Home > Politics > అసంతృప్తి సెగ!

అసంతృప్తి సెగ!

రోహింగ్యా వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్
సింగరేణి కార్మికులకు సోంత ఇళ్లు : ఎంపి బాల్క్ సుమన్

vishnu-kumar-raju-apduniaవిశాఖ మహా నగరం ప్రభుత్వాలకు కాసులు కురిపించే సిటీ. ఇక ఈ ఏడాది కొత్త మద్యం పాలసీలో ఖజానాకు ఈ అభ్కారి నుంచి రూ.కోట్లు ఆదాయం సమకూరనుంది. అయితే ఈ విధానం విశాఖ బి.జె.పి యం.ఏల్.ఎ విష్ణు కుమార్ రాజుకు నచ్చ లేదు. తన నియోజక వర్గంలో మద్యం అమ్మకాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన మహిళలు, స్వచ్ఛంద సంస్థలకు బాసటగా నిలిచారు. వారితో పాటే ఆందోళనల్లో పాల్గొన్నారు. అయినా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతుండడంపై విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కైలాసపురం రోడ్డు సంతోష్‌నగర్‌ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుకు లైసెన్స్‌ మంజూరు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ మద్యం దుకాణం ఇళ్ళ మధ్య ఉంది. అంతేకాక ఈ షాపుకు వంద మీటర్ల లోపే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ఉంది. దీంతోమద్యం షాపును తరలించాలని గత రెండు నెలలుగా స్థానిక కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారు. అయితే మద్యం వ్యాపారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఎక్సైజ్‌ అధికారులు పాత మద్యం షాపు పేరు మార్చి అశోక్‌ వైన్స్‌ పేరుతో లైసెన్స్‌ ఇచ్చారని విష్ణుకుమార్ చెప్తున్నారు.

తన నియోజకవర్గంలో 14 వార్డులు ఉంటే 13 బార్లు, 14 వైన్‌షాపులకు లైసెన్స్‌లు మంజూరు చేశారని విష్ణుకుమార్ వివరించారు. వీటిలో సమస్యాత్మకంగా ఉన్న నాలుగు వైన్‌షాపులను తొలగించాలని తాను ఎక్సైజ్‌ మంత్రికి, ఇటీవల నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేసినా, ఆ వినతి పత్రాలను పట్టించుకోలేదని చెప్పారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న మద్యం దుకాణాలు తొలగించమని మిత్రపక్షంగా ఉన్న తాము ఇచ్చిన వినతి పత్రాల్నే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ అంశంపై మరోసారి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తున్నామని, అధికారుల సమక్షంలో పాఠశాలకు, మద్యం దుకాణానికి ఉన్న దూరాన్ని కొలవగా కేవలం 83 మీటర్లే ఉందని, వీటితో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన వెంకటేశ్వర ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల ధ్రువీకరణ పత్రాలు సూపరింటెండెంట్‌కి పంపిస్తున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మద్యం దుకాణాలపై రాష్ట్రవ్యాప్త పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అధికార టీడీపీకి మిత్ర పక్షంగా బీజేపీ నేత ప్రభుత్వాన్ని బహిరంగానే నిలదీయడం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com