Home > Politics > నంద్యాల ఫలితంతో బీజేపీ రూట్ మార్చింది

నంద్యాల ఫలితంతో బీజేపీ రూట్ మార్చింది

దివ్యాంగులకు ఏపీ సర్కార్ హోండా యాక్టివా
హ్యాపీ రిసార్ట్స్ లోనే టీడీపీ ఆఫీసు

bjp-apduniaనంద్యాల ఉప ఎన్నిక తర్వాత టీడీపీ చంద్రబాబు సత్తా బీజేపీకి తెలిసొచ్చినట్లుంది. అందుకే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తుతో వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీలోని కొందరు ముఖ్య నేతలకు కూడా ఈ రకమైన సంకేతాలను ఇప్పటికే పంపినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే కలిసి వెళ్లాల్సి వస్తుందని, అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నామని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం. నిన్న మొన్నటి వరకూ టీడీపీతో జతకట్టడమా? వైసీపీతో కలిసి వెళ్లడమా? అన్న డైలమాలో బీజేపీ అధిష్టానం ఉంది. బీజేపీలోని కొందరు నేతలు టీడీపీతో పొత్తును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పురంధ్రీశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు వంటి నేతలు టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల విజయవాడకు వచ్చిన అమిత్ షాకు కూడా ఈ విషయం చెప్పారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా టీడీపీతో పొత్తు వద్దంటూ నినాదాలు చేశారు కొందరు కార్యకర్తలు. దీంతో పార్టీ హైకమాండ్ కూడా కొంత ఆలోచనలో పడింది నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల అనంతరం బీజేపీ హైకమాండ్ గట్టి నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు వెళ్లాలనే నిశ్చయించింది. వైసీపీ తో దగ్గరవ్వాలన్న ఆలోచనకు కమలనాధులు స్వస్తి చెప్పినట్లు సమాచారం. నిన్నటి వరకూ వైసీపీతో కలిసి వెళ్లాలని ఒక దశలో బీజేపీ నిర్ణయించింది. జగన్ తో జట్టు కడితే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంందని భావించింది. అందుకోసమే రెండు పార్టీల మధ్య సఖ్యత వాతావరణం కన్పించింది. కాని నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత సీన్ మారింది. వైసీపీ తో కలిసి వెళ్లడం కంటే టీడీపీ ప్రయాణం సాగించడమే మేలన్న నిర్ణయానికి పార్టీ అధిష్టానం కూడా వచ్చింది. అందువల్లనే ప్రస్తుత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును మంత్రివర్గంలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగించాలని చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కారణంగానే మంత్రి పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. హరిబాబుకు టీడీపీతో సత్సంబంధాలున్నాయి. చంద్రబాబుతోనూ వ్యక్తిగత సంబంధాలు కొనసాగించే హరిబాబును రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంచే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీని ఇక దూరంగా పెట్టాలనే బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *