Home > Bhakti > గ్రేటర్ లో బోనాల ముస్తాబు

గ్రేటర్ లో బోనాల ముస్తాబు

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం
కాణిపాకం ప్రసాదంలో మేకు
 
 bonalu_apduniaబోనాలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసం తొలి ఆదివారం లేదా తొలి గురువారం రోజున బోనాల జాతర ప్రారంభమవుతోంది. నగరంలో ఈ నెల జాతర జూన్ 25న మొదలుకాబోతోంది. ఈ తొలి బోనంతో జంట నగరాల్లోని ఆలయాల్లో ఘటం ఎదుర్కోలు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 25న గోల్కొండ బోనాల జాతర
రంభమవుతుందని గోల్కొండ ఎల్లమ్మ (మహంకాళి) ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.                 
అనవాయితీ ప్రాకారం మొదట సంప్రదాయబద్ధంగా గోల్కొండ బోనాలు లంగర్హౌజ్ దగ్గర తొట్టెల ఊరేగింపుతో మొదలవుతుంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు , స్థానికులు పాల్గొనే ఈ ఊరేగింపు ఆలయ పూజారి ఇంటి వరకు సాగుతుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల సిగాలు, డప్పు దరువులతో సాగే ఈ తొట్టెల ఊరేగింపు ఆలయ పూజారి ఇంటికి చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి కోటలోకి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుపోతారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (మహంకాళి) ఆలయంలో తొలిపూజను ఆలయ పూజారులు నిర్వహించి బోనం సమర్పించడంతో తెలంగాణలో బోనాల జాతర ఆరంభమవుతుంది. తొలి బోనంతో జూన్ 25న మొదలైన గోల్కొండ బోనాలు జూలై 23న బోనంతో జాతర ముగుస్తుంది. సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జూలై 9, 10 తేదీల్లో జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *