Home > Tirumala News > తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ.

తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ.

వెంకన్న కాలి ముద్రే ఈ అలిపిరి పాదాలు
గదుల కేటాయింపు మార్పులు బాగున్నాయి : టీటీడీ జేఈవో
 
brahmostavams_apdunia భక్తుల పాలిట కొంగు బంగారంగా తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతాయి. అయితే వార్సి కోత్సవాలలో అత్యంత విశిష్టమైనది, వైభవోపేతంగా నిర్వహించేది వార్షిక బ్రహ్మోత్సవాలు. జగత్కాల్యాణం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడే భూవికి దిగివచ్చి ముందుండి జరిపించే ఉత్సవాలు కాబట్టే వీటికి బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఆ బ్రహ్మోత్సవాలు చూడ్డానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు ప్రతిఏటా వస్తుంటారు. ఏడాది కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్దమౌతున్నది. 
వాయిస్ 1: వేంకటాచల క్షేత్రంలో పరబ్రహ్మస్వరూపంగా వెలసిన శ్రీనివాసునికి ప్రతియేట సౌరమానం ప్రకారం కన్యామాసంలో, చంద్రమానం ప్రకారం అశ్వీయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ముగిసేవిధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. బ్రహ్మదేవుడే దగ్గరుండి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు కాబట్టి బ్రహోత్సవాలని అంటారు. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ పదిరోజుల ఉత్సవాలను కాలక్రమేణ ఎందరో రాజులు, మరెందరో రారాజులు తమ విజయపరంపరకు సూచికగా తిరుమల శ్రీనివాసుడికి బ్రహోత్సవాలకు నిర్వహించారు.  గతంలో ప్రతినెల స్వామి వారికి బ్రహోత్సవాలు జరిగిన్నట్లు చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీనివాసుడికి జరిగే వాహన సేవలకు అగ్రపధాన నిరాకార రూపంలో బ్రహ్మ అధిష్టించిన బ్రహ్మరథం కూడా సాగుతుంది. అంకురార్పణతో భీజం పడి, ధ్వజ రోహణంతో ప్రారంభమై, ధ్వజా అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 
ధ్వజరోహణం జరిగిన రోజు రాత్రి నుండి స్వామి వారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహా, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహిని, గరుడ, హానుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, తేరు, స్వర్ణరథం, ఆశ్వ వాహనాలపై ఊరేగుతారు. 9 రోజుల ఉదయం వారహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మరియు సుదర్శన చక్కత్తాళ్వార్ వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సుదర్శన చక్రాన్ని మూడుసార్లు పుష్కరిణి ముంచడంతో బ్రహ్మోత్సవ వేడుకులు ముగుస్తాయి. ఆ రాత్రికి ధ్వజస్తంభానికి ఉన్న కొడిని దించడంతో బ్రహోత్సవాలను పరిసమాప్తం ఆవుతాయి. సెక్టంబర్ 23 నుండి అక్టోబర్ 1 వరకు ఉత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *