Home > Bhakti > పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు

పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు

బుధవారం అమావాస్య దుర్గను పూజించాలి
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..

ttd-tirumala-apduniaనిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవాల తో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అలాంటిది ఇక బ్రహ్మోత్సవాలంటే మాటలా.. 10రోజులపాటూ అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకుల కోసం మూడునెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఏ చిన్నలోపం ఏర్పడినా టీటీడీ పేరుప్రతిష్టలకే ఇబ్బంది ఎదురవుతుంది. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు సమీక్షా సమావేశాలు జరిపి ఏకాభిప్రాయానికి రావలసి ఉంటుంది.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న బ్రహ్మోత్సవాలు తొలిసారిగా పాలకమండలి లేకుండా తొలిసారి జరుపబోతుంది టీటీడీ. దాదాపు పది కోట్లు రూపాయలు ఖర్చుతో చేస్తున్న ఏర్పాట్లు కేవలం అధికారుల ఏకపక్షనిర్ణయంతోనే జరిగిపోతున్నాయి. దీంతో ఈ అంశం పై ఏపీప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు పెరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలాంటి కీలక ఘట్టాన్ని ఒక అధికారికి అప్పగించేయటమేంటి ..అందులోనూ నూతనంగా పదవీ భాద్యతలు చేపట్టిన ఈఓ తీసుకునే నిర్ణయాలేమైనా బెడిసి కొడితే పరిస్ధితేంటన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈఓ గా కొత్తగా పదవీ భాద్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఇలా ఈమధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారటం గమనార్హం..ముఖ్యంగా ఈమద్యకాలంలో ఈఓ తీసుకున్న ఆలయంలో ఇనుపమెట్ల ఏర్పాటు, కాలినడక భక్తులకు పత్యేక దర్శనాలరద్దు నిర్ణయాలు భక్తులనుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇక తాజాగా బ్రహ్మోత్సవాలను నిర్వహించే ప్రధాన అర్చకుని విషయం కూడా వివాదాస్పదమైంది. ప్రతిఏటా బ్రహ్మోత్సవాల నిర్వహించేందకు ప్రధాన అర్చకులలో ఒకరిని సారధ్యం వహించేదుకు ఎంపిక చేస్తారు.దీనికోసం అర్చకులతో కమిటీ వేసి ఏకాభిప్రాయం ప్రకారం ఆ వ్యక్తిని ఎన్నుకుని ఆ అర్చకునికి ద్వజారరోహణ సమయంలో బ్రహ్మోత్సవ కంకణం ధరింపచేస్తారు..అయితే ఈసారిమాత్రం ఎలాంటి కమిటీ ఊసులేకుండానే ఓ అర్చకునికి ఏకపక్షంగా బ్రహ్మోత్సవ సారధ్యం కట్టమెట్టడంతో మిగతా అర్చకులలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం బ్రహ్మోత్సవాల ప్రారంభం లోపే పాలకమండలినో కుదరకుంటే స్పెసిపైడ్ అధారిటీనో ఎర్పాటుచేసి బ్రహ్మోత్సవాలు వివాదరహితంగా దిగ్విజయంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *