Home > Vanitha > Recipes > క్యాబేజీ పకోడా

క్యాబేజీ పకోడా

సోయా గ్రాన్యూల్స్‌ తో వెజిటేబుల్ బిర్యానీ
మెంతి పలావ్ రైస్

Cabbage Pakoda_apduniaకావలసిన పదార్థాలు:

క్యాబేజీ తరుగు – 3 కప్పులు, శనగపిండి – 1 టేబుల్‌ స్పూను, కారం – 1 టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత, వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూను, మసాలాపొడి – అర టీ స్పూను, పసుపు – చిటికెడు, నూనె – వేగించడానికి సరిపడా. ఉల్లితరుగు (పొడుగ్గా సన్నగా ఉండాలి) – 1 కప్పు, కరివేపాకు – అరకప్పు.

తయారుచేసే విధానం:

ఒక పాత్రలో శనగపిండి, వెల్లుల్లి పేస్టు, కారం, మసాలాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోనే కాబేజీ తరుగు కూడా వేసి శనగపిండి మిశ్రమం కాబేజీకి పట్టేట్టుగా కలపాలి. అవసరమైతే కొద్ది నీటిని వాడొచ్చు. ఈ ముద్దని అరగంటపాటు నానబెట్టి తర్వాత నూనెలో పలచగా, విడివిడిగా పకోడీల్లా వేసి (గట్టిపడేదాకా) వేగించి, తీసి చల్లారనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తాలింపును ఇందులో కలుపుకోవాలి. ఈ పొడికూర పప్పన్నం, సాంబారుల్లో నంజుకోడానికి బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *