Home > Editorial > సోవరిన్ బంగారం బాండ్ల పధకం మార్గదర్శక సూత్రాల సవరణకు మంత్రివర్గ ఆమోదం

సోవరిన్ బంగారం బాండ్ల పధకం మార్గదర్శక సూత్రాల సవరణకు మంత్రివర్గ ఆమోదం

బీహార్ లో సంప్రాదాయాలకు తిలోదకాలు
నితీశ్ పిల్లిమొగ్గలు ...
 
modi meeting_apduniaసోవరిన్ బంగారం బాండ్ల (ఎస్ జి బి) పధకం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వీలుగా – ఆ పధకం మార్గదర్సక సూత్రాల సవరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. 
రెండు సెట్లుగా – ఈ పధకంలో మార్పులు చేయడం జరిగింది.  
I. బంగారం దిగుమతుల వల్ల ఎదురౌతున్న ఆర్ధిక ఒత్తిడిని తగ్గించడానికీ, కరెంట్ అక్కౌంట్ లోటు (సి ఏ డి) ని తగ్గించడానికీ – లక్ష్యాలకు అనుగుణంగా – ఈ పధకం మరింత ఆకర్షణీయంగా, నిధులు మళ్లించడానికి వీలుగా ఉండడానికీ – ఈ పధకం గుణగణాలలో కొన్ని నిర్దిష్ట మార్పులు చేయడం జరిగింది. 
II. వివిధ వర్గాల పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయ పెట్టుబడులను సూచించే విధంగా  – సావరిన్ బంగారం బాండ్లను – వివిధ వడ్డీ రేట్లతో, ప్రమాదాల భద్రత / చెల్లింపులతో ప్రవేశపెట్టడానికి వీలుగా ఆర్ధిక మంత్రిత్వ శాఖకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 
 
ఒక నిర్దిష్టమైన షేర్లు గుణగణాలను ఖరారు చేయడానికీ – దానిని ప్రకటనగా జారీ చేయడానికి మధ్య సమయాన్ని తగ్గించడానికి వీలుగా ఆర్ధిక మంత్రి అనుమతితో – ఈ పధకంలో సవరణలు / అదనపు లక్షణాలను జత చేర్చడానికి – ఆర్ధిక మంత్రిత్వ శాఖ (జారీచేయువారు) కు ఈ అధికారాన్ని అప్పగించడం జరిగింది. కొత్త పెట్టుబడి ఉత్పత్తుల పోటీ అంశాలను ఎదుర్కోడానికి,  చాలా డైనమిక్ గా, ఒక్కోసారి అస్థిర మార్కెట్,  స్థూల ఆర్ధిక , బంగారం ధరల వంటి ఇతర పరిస్థితులను ఎదుర్కోడానికి – ఈ వెసులుబాటు సమర్ధంగా ఉపయోగపడుతుంది.  
ఈ పధకంలో దిగువ పేర్కొన్న మార్పులను ఆమోదించడం జరిగింది. 
 
i   వ్యక్తులకు 4 కిలోగ్రాముల వరకు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్ యు ఎఫ్) కు 4 కిలోగ్రాముల వరకు, ట్రస్టులు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించిన ఇతర సంస్థలకు 20 కిలోగ్రాముల వరకు – ఈ ఆర్ధిక సంవత్సరంలో పెట్టుబడి పరిమితిని పెంచారు.  
ii.  ఆర్ధిక సంవత్సరం ప్రాతిపదికగా – సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో కొనుగోలు చేసిన సావరిన్ బంగారం బాండ్లతో సహా – ఈ పరిమితిని లెక్కిస్తారు.
iii.  బ్యాంకులు, ఆర్ధిక సంస్థల అనుషంగికంగా ఉన్న హోల్డింగ్స్ ను ఈ పెట్టుబడి పరిమితిలో మినహాయిస్తారు. 
iv. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు ” ఆన్ ట్యాప్ ” లో అందుబాటులో ఉంటాయి. ఎన్ ఎస్ ఈ, బి ఎస్ ఈ , బ్యాంకులు, తపాలా శాఖ తో సంప్రదింపుల ఆధారంగా ” ఆన్ ట్యాప్ ” విక్రయాలను ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఖారారు చేస్తుంది. 
v.      ద్రవ్య పరిస్థితిని, సావరిన్ గోల్డ్ బాండ్ల విక్రయ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి అనువైన మార్కెట్ చర్యలు రూపొందిస్తారు.  వాణిజ్య బ్యాంకులు లేదా ఎమ్ ఎమ్ టి సి లాంటి ప్రభుత్వ రంగ సంస్థ లు లేదా భారత ప్రభుత్వం నిర్ణయించిన ఏదైనా సంస్థ – వీటిని విక్రయిస్థాయి. 
vi. అవసరమని భావిస్తే – భారత ప్రభుత్వం – ఏజెంట్లకు ఎక్కువ మొత్తంలో కమీషన్ అనుమతించే అవకాశం ఉంది. 
నేపధ్యం :
సోవరిన్ గోల్డ్ బాండ్ల పధకాన్ని మంత్రిమండలి ఆమోదంతో 2015 నవంబర్ 5వ తేదీన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం లోహాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా ఒక ఆర్ధిక వనరుగా అభివృద్ధి చేయడమే ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం. పెట్టుబడి కోసం ప్రతీ ఏటా కొనుగోలు చేస్తున్న సుమారు 300 టన్నుల బంగారు కడ్డీలు, నాణేలలో కొంత భాగాన్ని  ” డీమ్యాట్ ” గోల్డ్ బండ్ల రూపంలోకి మార్చడం లక్ష్యం. ఈ పధకం కింద 2015-16 లో 15,000 కోట్ల రూపాయలు, 2016-17 లో 10,000 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పధకం కింద ఇంతవరకు  4,769 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయి. 
ఈ పధకం కింద ఇంతవరకు అనుకున్నదానికంటే తక్కువ స్పందన వచ్చిన నేపథ్యంలో – సి ఏ డి పై పడుతున్న భారాన్ని, మొత్తం మీద దేశ  స్థూల ఆర్ధిక పరిస్థితి పరిగణలోకి తీసుకుని – ఈ పధకం విజయవంతం చేయడం కోసం ఈ పధకంలో మార్పులు చేయడం అవసరమని భావించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *