Bhakti

ప్రతి పౌర్ణమి రోజున స్వర్ణ దుర్గమ్మ

ప్రతి పౌర్ణమి రోజున స్వర్ణ దుర్గమ్మ

విజయవాడ కనకదుర్గమ్మ స్వర్ణకవచంలో భక్తులకు దర్శనమిస్తోంది. కేవలం దసరా ఉత్సవాల తొలిరోజున మాత్రమే అమ్మవారిని స్వర్ణకవచంతో అలంకరించటం ఆనవాయితీ. అయితే ఇక నుంచి ప్రతి పౌర్ణమినాడు అమ్మవారికి స్వర్ణకవచం అలంకరించనున్నారు. దీంతో ఇవాళ పౌర్ణమి కావటంతో అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గమ్మగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మకు గతంలో ఉన్న స్వర్ణకవచం స్థానంలో ఇటీవలి దసరా ఉత్సవాల సందర్భంగా […]

విజయనగరం ఉత్సవాలు ప్రారభం

విజయనగరం ఉత్సవాలు ప్రారభం

గజపతిరాజులు ఏలిన విజయనగరం జిల్లా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కోట వ‌ద్ద‌ మూడు కిలోమీట‌ర్ల ప‌రుగుతో జిల్లా ఉత్స‌వాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ వివేక్ యాద‌వ్ ప్రారంభించారు. ఈరోజునుంచి 3రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం కోసం విజయనగరం జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరాన్ని అందంగా అలంకరించారు. పైడితల్లి సిరిమాను ఉత్సవం ప్రారంభయ్యే కొన్ని రోజులకు […]

దుర్గగుడిలో కొనసాగుతున్న రద్దీ

దుర్గగుడిలో కొనసాగుతున్న రద్దీ

దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. ఐదు రోజుల వ్యవధిలో సుమారు లక్ష నుంచి లక్షా ఇరవై వేలకు పైగానే భవానీలు అమ్మవారి సన్నిధికి చేరుకుని దీక్షలు విరమించినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. […]

దుమారం రేపుతున్న టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు

టీటీడీ ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను నాలుగు మాడ వీధుల్లో కాకుండా రింగురోడ్డులో నిర్వహించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచుతానని ఆయన చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆగమ శాస్త్రాలను పక్కనబెట్టి స్వామివారి వాహన సేవను రింగ్‌ రోడ్డులో నిర్వహిస్తారా […]

పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం

పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం

తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో నేటి రాత్రి ధ్వజావరోహణం జరగనుంది. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. టీటీడీ ఈవో సాంబశివరావు ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు […]

భద్రకాళికి సర్కార్ స్వర్ణ కిరీటం

భద్రకాళికి సర్కార్ స్వర్ణ కిరీటం

వరంగల్ భద్రకాళి అమ్మవారి మొక్కును ప్రభుత్వం తరపున దేవీ నవరాత్రుల సందర్భంగా సీఎం కేసీఆర్ తీర్చుకోనున్నారు. శుక్రవారం కేబినెట్ సమావేశం తర్వాత క్యాంపు కార్యాలయంలో స్వర్ణ కిరీటాన్ని పరిశీలించారు. 3 కోట్ల 70 లక్షలతో …11 కిలోల 7 వందల గ్రాముల బంగారంతో స్వర్ణ కిరీటాన్ని అమ్మవారి కోసం జీఆర్టీ జువెలర్స్ తో ప్రత్యేకంగా తయారు […]

శ్రీవారి బ్రహ్మోత్సవాల భక్తులకు శుభవార్త

శ్రీవారి బ్రహ్మోత్సవాల భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ ఈవో సాంబశివరావు శుభవార్త వినిపించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అవసరమైనన్ని లడ్డూలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలకు రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోందని అన్నారు. వారికి అవసరమైన లడ్డూ కౌంటర్లు 24గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆలయ నాలుగు మాడవీధుల్లో వివిధ గ్యాలరీలకు […]

తుదిశ్వాస వరకు శ్రీ‌వారి సేవకే : డాలర్ శేషాద్రి

తుదిశ్వాస వరకు శ్రీ‌వారి సేవకే : డాలర్ శేషాద్రి

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కనపడడం లేదు. అనారోగ్యం కారణంగానే ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన‌డం లేదు. ఈ అంశంపై శేషాద్రి స్పందించారు. మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ త‌న తుదిశ్వాస వరకు శ్రీ‌వారి సేవకే త‌న జీవితం అంకితమ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయకుడి […]

చిన్న శేషవాహనంపై వెంకన్న

చిన్న శేషవాహనంపై వెంకన్న

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మలయప్పస్వామి చిన్నశేషవాహనంపై వూరేగారు. ఉదయం 9గంటల నుంచి తిరువీధుల్లో చిన్న శేషవాహనసేవ జరిగింది. వాహనసేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అశేష భక్తకోటి నుంచి స్వామివారు హారతులందుకున్నారు. వాహనసేవలో తితిదే ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు కొంగుబంగారం..నెల్లూరు రాజరాజేశ్వరీ ఆలయం

భక్తులకు కొంగుబంగారం..నెల్లూరు రాజరాజేశ్వరీ ఆలయం

నెల్లురు నగరనాయకీ కోరినవారికి కొంగుబాంగారమై కరుణించే కల్పవల్లీ రాజరాజేశ్వరీ నమో నమః, నవరాత్రి కలశ స్థాపనతో కొలువైన రాజరాజేశ్వరిమాత గాయత్రి తేజంలో దర్శనమిచ్చారు. మూలస్థానేశ్వరాలయంలో నూ అమ్మ భునేశ్వరిదేవిని, భక్తులు సౌభాగ్యం కోరుతూ ఆలయ ప్రదక్షణలను విశేషంగా సమర్పించారు. దుర్గాంశ ఆలయాల్లో దేవీ నవరాత్రి ప్రాధాన్యత స్థుతి, పార్థన, పూజా కార్యక్రమాలతో, భక్తుల సందర్శనతో ఈ […]

తిరుమల 365 రోజుల్లో 433 పండగలు

తిరుమల 365 రోజుల్లో 433 పండగలు

హిందూ ధర్మంలో పండగలకు కొదవేలేదు. ఏ మతాలలో లేనన్ని పండగలు, పర్వదినాలు హిందుత్వంలో ఉన్నాయి. అయితే అందరికీ తెలిసినవి మాత్రం కొన్నే. ఎక్కువగా జరుపుకునే పండగలు 10వరకే ఉంటాయి. అయితే తిరుమల క్షేత్రంలో మాత్రం… ప్రతీరోజూ పండగే. ఆ విశేషాలు మీ కోసం.కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం. శ్రీమహావిష్ణువు… శ్రీనివాసుడిగా కొలువైన దివ్య మందిరం. నిత్య […]

గాయత్రిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

గాయత్రిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి మూడవరోజు గాయత్రిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ప్రత్యేకపూజలు పూర్తైన తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గాయత్రిదేవి అవతారంలో బ్రహ్మ విష్టు మహేశ్వరీ తత్వం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారుబాసరలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారు ఇవాళ బ్రహ్మచారిణి […]

ఈసారి 11 రూపాల్లో కనకదుర్గమ్మ

ఈసారి 11 రూపాల్లో కనకదుర్గమ్మ

ఈ సారి బెజవాడ దుర్గమ్మ 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. దాదాపు 34 సంవత్సరాల తరువాత 11 రూపాల్లో కనిపిస్తుంది అమ్మవారు. తిధుల వృద్ధి మూలంగానే ఈ విధంగా వస్తుందంటున్నారు పండితులు. 11 రూపాల్లో ఉన్న దుర్గమ్మ ధరించే చిరలు ప్రత్యేకంగా కంచిలో తయారు చేయించారు. 11 చీరలు సుమారు 4 లక్షల అయినట్లు […]

ఐదు రాజాగోపురాలతో యాదాద్రి

ఐదు రాజాగోపురాలతో యాదాద్రి

-ప్రత్యేక కాటేజీలు దైవ సన్నిది వచ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఐదు రాజగోపురాలతో పాటు ప్రాకార మండపాలను పూర్తిస్థాయి శిలతో నిర్మితం కానున్న ప్రపంచంలోనే మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోనున్నదని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం […]

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

అక్టోబర్ 3వ తేదీ నుంచి 11 వరకూ శ్రీవేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఇతర అధికారులు, టీటీడీ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చందన […]