Bhakti

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు బుధవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ […]

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

భద్రాద్రి రాములోరి సన్నిధి ఆంక్షల సంకెళ్లలో కూరుకుపోయింది! ఒకప్పుడు సీతారాముల నీడలో, వారి చల్లని చూపుతో వివాహం జరిగేది. కానీ ప్రస్తుతం అది అసాధ్యం కానుంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం భద్రాద్రిలో హల్‌చల్ చేస్తోంది. కర్నూలుకు చెందిన నరేష్ బాబు, శివపార్వతులు శుభప్రదంగా వివాహం చేసుకునేందుకు భద్రాచలం వచ్చారు. అయితే పెళ్లిళ్లు నిషేధమని […]

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

-ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ -గణేష్ ప్రతిమల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి జిల్లాలో ఘనంగా జరుపుకునే వినాయక చవితి పర్వదిన వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల మనోభావాలు, భక్తి భావానికి ఆటంకం కల్గకుండా ఉంటూనే వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు […]

అప్రతిష్ట మూట కట్టుకుంటున్న బాసర ఆలయం

అప్రతిష్ట మూట కట్టుకుంటున్న బాసర ఆలయం

చదువుల తల్లి సరస్వతిమాత కొలువుదీరిన బాసర ఆలయంలో వరుసగా జరుగుతున్న అపశృతులు ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయ. కొంతమంది వ్యక్తుల కారణంగా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. ఇటీవల ఆలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులతో ఆరాధింపబడుతున్న సరస్వతిదేవి ఆలయంలో.. ఆ అమ్మవారికి నిత్య పూజలు చేసే అర్చకులే అపచారాలకు […]

గ్రహణం రోజున కుడా యధావిధిగా శ్రీకాళహస్తీశ్వరాలయం

గ్రహణం రోజున కుడా యధావిధిగా శ్రీకాళహస్తీశ్వరాలయం

 గ్రహణాలు సంభవిచినపుడు భారతదేశం లోని అన్ని దేవాలయాలు మూసివేస్తే చిత్తూరు జిల్లా లో గల వాయులింగ క్షేత్రం గా పేరు గాంచిన  శ్రీకాళహస్తి ఆలయంలో  మాత్రం  భక్తులకు యధావిధిగా స్వామి, అమ్మవార్ల  దర్శనం కొనసాగుతుంది. ఇక్కడ స్వామి వారు సర్ప రూపంలో ఉన్నందున గ్రహణాలకు అతీతంగా పూజలందుకుంటున్నాడు.  రాహుకేతు పూజలు కూడా యధావిధిగా  జరుగుతాయి. అయితే […]

వరలక్ష్మీ పూజకు వేళాయెరా

వరలక్ష్మీ పూజకు వేళాయెరా

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ముత్తైదువలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అనవాయితీ ఉన్న వారే ప్రతి యేడు క్రమం తప్పకుండా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి ప్రతి మతో వ్రతకల్పాన్ని పటిస్తూ పూజలు చేస్తారు. ఆరోజు కన్నెవడికిన దారాన్ని మూరెడు పొడవుతో తొమ్మిది వరుసలు పోస్తారు. దానికి పట్టుపోగు పెడతారు. వరలక్ష్మీ అమ్మవారి కథవింటూ తొమ్మిది […]

వరలక్ష్మివ్రతము వరలక్ష్మివ్రతము పురాణ గాధ

వరలక్ష్మివ్రతము వరలక్ష్మివ్రతము పురాణ గాధ

స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. […]

ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..

ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..

భ‌ద్రాద్రి ఆల‌య అభివ్రుద్ది తుది న‌మూనా సిద్ద‌మైంది. ఆల‌య మాస్టార్ ప్లాన్ ను ప‌రిశీలించిన చిన జీయ‌ర్ స్వామి అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చారు. భ‌ద్రాద్రి ఆల‌యాన్ని టెంపుల్ సిటీగా మార్చాల‌న్న సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి న‌మూనాల‌ను రూపొందించారు. ఆ న‌మూనాలు ఆగ‌మ‌న శాస్త్రం ప్ర‌కారం లేవ‌ని…కొన్ని మార్పులు, చేర్పులు చేయాల‌ని […]

లో బావి ప్రాంతంలో నక్షత్ర వనం

లో బావి ప్రాంతంలో నక్షత్ర వనం

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయానికి సమీపంలోవున్న లోబావి ప్రాంతంలో నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో నక్షత్రానికి ఒక్కోరకమైన చెట్లను నాటి ఆ నక్షత్రానికి సంబంధించినవారు పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం టెండర్లను పిలుస్తామన్నారు.రూ. 6కోట్లతో అన్నదాన మండపాన్ని నిర్మించనున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న […]

గౌరంగబాబుకు దుర్గగుడి ఛైర్మన్ పదవి

గౌరంగబాబుకు దుర్గగుడి ఛైర్మన్ పదవి

దుర్గగుడి చైర్మన్‌ గిరి ఎట్టకేలకు టిడిపి సభ్యునికే దక్కింది. యలమంచలి గౌరంగబాబుకు అవకాశం ఇచ్చారు నెలరోజుల పాటు సాగిన టిడిపి, బిజెపి మధ్య నలిగిన  వ్యవహారంలో బిజెపి సభ్యుడు రంగప్రసాద్‌ పోటీ నుండి వైదొలిగారు. చైర్మన్‌గా అవకాశం కల్పించకపోవడంతో ఆయన ధర్మకర్తల మండలి సభ్యుడుగా కూడా కొనసాగబోనని తెగేసి చెప్పారు. దీంతో దుర్గగుడి చైర్మన్‌ పదవికి […]

సముద్రగర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం

సముద్రగర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం

బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్రగర్భంలో ఒక పురాతన దేవాలయం బయల్పడింది. ఈ దేవాలయం చాలా పురాతనమైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యాటకుల సందర్శన నిమిత్తం 2005లో దీనిని టెంపుల్ గార్డెన్‌గా మార్చారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణాకృతితో ఈ కట్టడం నిర్మించబడింది. […]

7న శ్రీవారి ఆలయం మూసివేత

7న శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల శ్రీవారి భక్తులు ఆగస్ట్ 7వ తేదీన తిరుమలకు రాకుంటే మంచిదన్న అభిప్రాయం టిటిడి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కారణం శ్రీవారి ఆలయాన్ని ఆ రోజు మూసేయనున్నారు కాబట్టి. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తితిదే తెలిపింది. గ్రహణం 7వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు […]

బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడిలో అప‌చారం

బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడిలో అప‌చారం

ఏపీలో అధికారుల నిర్ల‌క్ష్యం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని ప‌రిర‌క్షించాల్సిన బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌య సిబ్బంది అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. భ‌క్తులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స్వీక‌రించే ప్ర‌సాదం విష‌యంలో ఆల‌య సిబ్బంది అనుస‌రించిన వైనం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు తావిస్తోంది. అమ్మ‌వారి ప్ర‌సాదాల్ని పంపిణీ చేసిన త‌ర్వాత మిగిలిపోయిన […]

శరవేగంగా కొనసాగుతున్న యాదాద్రి పనుల

శరవేగంగా కొనసాగుతున్న యాదాద్రి పనుల

  యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం విస్తరణ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి స్వామివారి గర్భాలయం దర్శనాలు పునఃప్రారంభించే దిశగా ప్రణాళిక మేరకు పనులు సాగుతున్నా కొండపైన శిల్పాలు, ఇతర నిర్మాణాలు సాగించడంలో కొంత జాప్యం కొనసాగుతోంది. సిఎం కెసిఆర్ యాదాద్రిని తిరుమల తిరుపతి తరహాలో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దాదాపుగా రూ.800 […]

స్టాండింగ్ కే పరిమితమవుతున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు

స్టాండింగ్ కే పరిమితమవుతున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు

  దుర్గగుడి ట్రస్ట్ బోర్డు కమిటీకి ఇప్పటి వరకు చాంబర్ లేకపోవటంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజగోపురం ముందే నిలబడి వచ్చిన విఐపిలకు స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయిస్తూ అమ్మవారి సేవలో పలు వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొండపైనున్న నిర్మాణాలు కూల్చకముందు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరికీ ఒక ప్రత్యేక సమావేశ […]