Editorial

ప్రభుత్వాలను తలంటిన సుప్రీం

ప్రభుత్వాలను తలంటిన సుప్రీం

ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉండటం, అనేక మంది సాయుధ చర్యలలో బలికావడం అంతర్జాతీయంగా మన దేశానికి మచ్చ తెస్తున్నది. ప్రభుత్వం రాజకీయ పరిష్కారం కోసం సమర్థవంతంగా కృషి చేయడం లేదనే అపవాదు దీనివల్ల కలుగుతున్నది. సుప్రీం కోర్టు కూడా తమ తీర్పులో ఈ అంశాన్ని […]

లెక్కలు చెప్పేదెవరు

లెక్కలు చెప్పేదెవరు

ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7 తరగతుల విద్యార్థులకు గణితం బోధించడంపై గందరగోళం నెలకొంది. ఫిజిక్స్, మ్యాథ్స్‌ టీచర్ల మధ్య రగులుతున్న సమస్య విద్యార్థులకు శాపంగా మారింది. ఉన్నత పాఠశాలల్లో íఫిజిక్స్, మ్యాథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ రెం డు సబ్జెక్టులు కీలకమైనవి కూడా. అయితే మ్యాథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్లు 8, 9, 10 తరగతుల […]

బతుకు భారమై…పులికి ఆహారమై…..

బతుకు భారమై…పులికి ఆహారమై…..

  ప్రపంచ మానవాళికి ఆకలికి మించిన శత్రువు లేదు. అది మనిషిని చంపుతుంది. చంపిస్తుంది. నిండు నూరేండ్లూ బతకాల్సిన మనిషి తనకు తానే తన మరణ శాసనాన్ని లిఖించుకునేలా అతని మానసికస్థితిని మలుస్తుంది. ఇందుకు సజీవ నెత్తుటి సాక్ష్యాలే ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ ప్రాంతంలో సంభవిస్తున్న వృద్ధుల వరుస మరణాలు. తీవ్ర కరువు ప్రాంతమైన ఫిలిబిత్‌లో ‘పులుల అభయారణ్యం’ […]

మళ్ళీ కొనసాగుతున్న వలసలు..

మళ్ళీ కొనసాగుతున్న వలసలు..

వలస సుఖప్రదం కాదు. ఆవేదనా భరితం. వెంటాడే విషాదం. బతుకును రుజాగ్రస్తం చేసే ఘర్షణ. తననీ, తనవాళ్ళనీ తనకు దూరం చేసే మహా యాతన. బతకడం కోసం వెళుతూ బతుకునే కోల్పోయే బీభత్స ఘటన. ఉన్న ఊరునీ, అయినవాళ్ళనీ వదిలి దేశాలవెంట పడిపోవడం ఎవరికి మాత్రం ఉత్సాహంగా ఉంటుంది. కానీ తప్పదు. తప్పనిసరయి వెళ్ళాల్సి వచ్చేవారికి […]

భారత్ ను మింగేస్తున్న డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ను కబళిస్తోన్న చైనా

భారత్ ను మింగేస్తున్న డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ను కబళిస్తోన్న చైనా

న్యూఢిల్లీ- భారత్ ను డ్రాగన్ దేశం మింగేస్తోంది. ఇండియా ఆర్థిక వ్యవస్థతోపాటు మార్కెట్ ను చైనా కబళిస్తోంది. ప్రతి ఇంటా ఆ దేశ వస్తువులను డంప్ చేస్తోంది. వాణిజ్య లావాదేవీలు ప్రస్తుతం 71.5 బిలియన్ డాలర్లకు చేరడం భారత వ్యాపారవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు సరిహద్దులో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనా మరోవైపు భారత వ్యాపారాన్ని […]

సంక్షేమ గృహాల్లో చదువు చెప్పేదెవరు..?

సంక్షేమ గృహాల్లో చదువు చెప్పేదెవరు..?

జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల గురుకులాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి బీసీ విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల విద్యను ప్రవేశపెట్టింది. నియోజక వర్గానికి ఒకటి చొప్పున ఆరు బీసీ గురుకులాలను మంజూరు చేసింది. ఈ ఏడాది 5,6,7 తరగతులను ప్రారంభించారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్‌కు 40 సీట్ల […]

అధ్వాన్నంగా మారుతున్న మిడ్ డే మీల్స్

అధ్వాన్నంగా మారుతున్న మిడ్ డే మీల్స్

అదిలాబాద్ జిల్లాల్లో మధ్యా హ్న భోజనం పథకం అధ్వానంగా మారుతోంది. ఉడికీఉడకని మెత్తటి అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది.ఏజెన్సీల నిర్లక్ష్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిం […]

లాలు స్వయం కృతాపరాధం

లాలు స్వయం కృతాపరాధం

బిహార్ లో పరిమాణాలు రోజు రోజు మారుతున్నాయి.. ఎవరి ప్రయోజనా లని బట్టి వారు తమ వైఖరి తాము తీసుకుంటున్నారు.తరతరాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారికి రాజ్యాధికార సాధనకు లాలూప్రసాద్ తరహా ఉదంతాలు మేలుచేస్తాయా లేక హాని కలిగిస్తాయా అన్నది ప్రధానమైన ప్రశ్న. గతంలో పశువుల దాణా కేసులో లాలూప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొని జైలుశిక్ష కూడా […]

నేర రాజకీయాలపై చర్యలు ఏవీ

నేర రాజకీయాలపై చర్యలు ఏవీ

కళంకిత రాజకీయ నాయకులపై చర్యల గురించి ఎన్నికల సంఘం వైఖరిపై సుప్రీంకోర్టు తలంటింది. వివిధ అవినీతి కేసులలో ఉన్న నేతలపై నిర్ధిష్ట చర్యలపై అస్పష్ట వైఖరి తగదని స్పష్టం చేసింది. మచ్చపడ్డ నేతలపై జీవితకాలపు పోటీ అనర్హతను విధించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పం దించింది. ఇలాంటి తీవ్రమైన అంశాలపై ఎన్నికల సంఘం మౌనం వహించడం […]

ఆందోళనలను పార్టీలకు అతీతంగా ఖండించాలి

ఆందోళనలను పార్టీలకు అతీతంగా ఖండించాలి

పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో చెలరేగిన మత కలహాలు దేశంలోని సామాజిక ఉద్రిక్తతలనే కాదు, రాజకీయ పతనాన్ని కూడా సూచిస్తున్నాయి. ఒక పదకొండవ తరగతి విద్యార్థి ఫేస్‌బుక్‌లో మరో మతానికి సంబంధించిన అభ్యంతరకర బొమ్మలను పెట్టడంతో ఈ నెల నాలుగవ తేదీన మత కలహాలు ప్రారంభమయ్యాయి. పరస్పర దాడులతో పాటు భారీ విధ్వంసం సాగింది. […]

భారత్ లక్ష్యాలు మారుతున్నాయ్…

భారత్ లక్ష్యాలు మారుతున్నాయ్…

చైనాలోని అన్ని ప్రాంతాలకూ చేరుకోగలిగే అణ్వాయుధాలను భారత్ సిద్ధం చేసుకుంటోందని అమెరికా అణు నిపుణులు కీలక నివేదిక తెలిపింది. ప్రస్తుతం అణు సామర్థ్యమున్న క్షిపణి వ్యవస్థలు ఏడు ఉన్నాయని, వాటిలో రెండు విమానాల ద్వారా, నాలుగు భూభాగం ద్వారా ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, మరొకటి సముద్ర ఉపరితలం నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించిందని పేర్కొంది. ఇప్పటివరకూ […]

ఏం కొనాలి… ఏం తినాలి

ఏం కొనాలి… ఏం తినాలి

జేబు నిండా నగదు పెట్టుకుని మార్కెట్‌కెళితే కనీసం సంచి నిండా కూడా కూరగాయలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తరచూ ఉపయోగించే టమోటా, మిర్చి వంటి కూరగాయల ధరలు వారం రోజుల వ్యవధిలో నాలుగింతలకు చేరుకోవడం విశేషం. వారం […]

మంచు కొండ కరుగుతోంది

మంచు కొండ కరుగుతోంది

ప్రపంచంలోనే మంచుతో కప్పబడిన ఏకైక ఖండం అంటార్కిటికా. ఈ ఖండం మొత్తం మంచు పర్వతాలు, కొండలే ఉంటాయి. అందులోని అతి పెద్ద కొండ బద్దలైంది. వెస్ట్ అంటార్కిటికాలోని లారెన్స్-సి అనే ప్రాంతంలో 5వేల 800 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ మంచు కొండకు జూలై 10వ తేదీన చీలికలు గుర్తించారు శాస్త్రవేత్తలు. రెండు రోజుల వ్యవధిలోనే […]

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు…

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు…

అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అక్రమాలకు తెర లేపుతున్నారు. రాజకీయ నాయకులకు అధికారులు తోడు కావటంతో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కంచే చేను మేస్తున్న దృశ్యాలు’ అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఆర్‌జెడి పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన […]

తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్ టాప్

తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్ టాప్

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలే బెస్ట్‌ అని తెలిపారు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌. నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యదర్శులతో ఏర్పాటుచేసిన సమావేశంలో అమితాబ్‌ పాల్గొన్నారు. వ్యాపార, సామాజిక అభివృద్ధిలో తొలి స్థానంలో నిలిచిన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ఈజ్‌ […]