General

దుర్గగుడిలో సెక్యూరిటీ అంతా డొల్లేనా

దుర్గగుడిలో సెక్యూరిటీ అంతా డొల్లేనా

దుర్గగుడిలో భద్రత డొల్లతనం బయటపడింది. ఆలయంలో డిసెంబరు 26న అర్ధరాత్రి పూజల వ్యవహారంలో సెక్యూరిటీ సిబ్బంది తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం ఒక సారి రాత్రి 10.30 గంటలకు మూసివేసిన అనంతరం గర్భగుడి ఆలయం తాళంపై సీజ్‌ వేయడం, మూమెంట్‌ రిజిష్టర్‌లో ఆలయం మూసివేసినట్లు సంబంధిత బాధ్యులు సంతకాలు చేయడం ఆనవాయితీ. […]

ఆధార్‌కు రెండంచెల భద్రత

ఆధార్‌కు రెండంచెల భద్రత

ఆధార్ వివరాలు లీకయ్యాయనే వార్తలు రావడంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. ఆధార్‌కు రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వర్చువల్ ఐడీని క్రియేట్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఎక్కువ సంఖ్యలో ఏజెన్సీలు ఆధార్ నంబర్‌ను తమ వద్ద ఉంచుకోకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం కేవైసీ సేవలను […]

కోడి పందాల్లో ఇండియా పాకిస్తాన్

కోడి పందాల్లో ఇండియా పాకిస్తాన్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటే.. ఇదేదో క్రికెట్ మ్యాచ్ కాదు కాని అంతకు మించి రంజుగా సాగేట్టు సరికొత్త గోదావరి వాసులు కోడి పందెం బరిలను రెడీ చేస్తున్నారు. అవును ఈ ఏడాది కోడి పందేలకు పాకిస్థాన్ నుండి కోళ్లను రప్పించి మరీ వాటికి కత్తి కట్టేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి అంటే కోడి పందేలు, […]

బిట్‌కాయిన్‌కి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేదు.. స్ప‌ష్టం చేసిన ఆర్థిక‌మంత్రి

బిట్‌కాయిన్‌కి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేదు.. స్ప‌ష్టం చేసిన ఆర్థిక‌మంత్రి

భార‌త‌దేశంలో బిట్‌కాయిన్ వంటి వ‌ర్చువ‌ల్ క‌రెన్సీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇటీవ‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారిన బిట్‌కాయిన్ వాడ‌కం గురించి లోక్‌స‌భ‌కు ఆయ‌న లిఖిత పూర్వ‌కంగా లేఖ‌లో తెలియ‌జేశారు. ఇప్ప‌టికే దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ సంస్థ‌లు ఏర్ప‌డ్డాయ‌ని, వాటి ద్వారా జ‌రిగే లావాదేవీల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌ని, అది […]

ఇల్లు కొనుగోలు చేసే వారికి వరం “రెరా”

ఇల్లు కొనుగోలు చేసే వారికి వరం “రెరా”

ఏదైనా వెంచర్‌లో ప్లాట్‌ బుక్‌ చేసుకుంటే నిర్మాణదారు మనకు ఎప్పుడు అప్పగిస్తాడో తెలియదు. ఒక వేళ డబ్బు తీసుకుని మనకు ఇంటిని సరైన సమయానికి అప్పగించకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకున్న బ్యాంకు రుణంపై వడ్డీ పెరిగిపోతుంది. కేంద్రం ఇటీవల కొత్తగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకువచ్చింది. చట్ట ప్రకారం చేపడుతున్న […]

9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

-నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీస్శాఖ -సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు -ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు -ఎస్ఏఆర్సీపీఎల్లో 56, టీఎస్ఎస్పీలో 4065 -ఎస్పీఎఫ్లో 174, ఫైర్లో 416 పోస్టుల భర్తీ -ఈ నెల 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు -ఏప్రిల్ 3న ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణలో భారీ సంఖ్యలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు […]

కాన్పూర్ లో ఆస్థి కలాశ్ బ్యాంక్

కాన్పూర్ లో ఆస్థి కలాశ్ బ్యాంక్

ఈ బ్యాంకు పేరు.. ‘అస్థి కలాశ్ బ్యాంక్’. మనోజ్ సెంగార్ అనే వ్యక్తి దీన్ని స్థాపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కొన్ని వేల మంది తమ ఆప్తుల అస్థికలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ ధర్మాల ప్రకారం.. దహన సంస్కారాల తర్వాత ఇచ్చే అస్థికలను 14 రోజుల వరకు ఇంటికి తీసుకెళ్లకూడదు.దీంతో, చాలామంది వాటిని […]

ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్

ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్

మీరు వాడుతున్న మొబైల్ నంబర్‌‌ను మీ ఆధార్ నంబర్‌‌తో రీ-వెరిఫై చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆయా టెలీకాం కంపెనీలు కస్టమర్లను ఆధార్‌తో మీ మొబైల్ నంబర్‌ను రీ-వెరిఫై చేసుకోవాలని కోరుతున్నాయి. చాలా మంది ఇప్పటికే తాము వాడుతున్న నెట్‌వర్క్‌కు చెందిన రిటైల్ స్టోర్లకు వెళ్లి ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను వెరిఫై […]

గ్రాండ్ గా 78వ నూమాయిష్

గ్రాండ్ గా 78వ నూమాయిష్

నుమాయిష్ రానేవచ్చేసింది. ఫిబ్రవరి 15 వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా 78వ నుమాయిష్‌ను నిర్వహిస్తున్నారు. 46 రోజుల పాటు నిరాటంకంగా జరిగే ఈ ప్రదర్శన నిర్వహణకు అంతా రెడీ అయింది. మొత్తం 2500 స్టాళ్లను ఏర్పాటు చేయగా, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు విక్రయాలు సాగించనున్నారు. ఆటపాటలాడుకునే పిల్లల కోసం గేమింగ్ జోన్లు, […]

కర్కాటకం, మీనం లకు కలిసొచ్చే 2018

కర్కాటకం, మీనం లకు కలిసొచ్చే 2018

జ్యోతిషం ప్రకారం రాశిచక్రంలో చోటుచేసుకునే సంఘటనలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇందులో మంచి, చెడులు రెండూ ఉంటాయి. ఈ సందర్భాల్లో శని గ్రహం దుష్ప్రభావం అధికంగా ఉంటుంది. గ్రహస్థితిలో శని అనుకూలంగా ఉంటే మేలు జరుగుతుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో జరిగే మంచి, చెడులకు శని గ్రహం బాధ్యత వహిస్తుంది. 2018లో శని […]

హైద‌రాబాద్‌లో ఓ యువ‌కుడిని మింగేసిన బ్లూవేల్

హైద‌రాబాద్‌లో ఓ యువ‌కుడిని మింగేసిన బ్లూవేల్

ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బ్లూవేల్ భూతం హైదరాబాద్‌కు పాకింది. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. రాజేంద్ర నగర్‌ సన్‌సిటీలోని మిఫుల్‌ టౌన్‌ విల్లాకు చెందిన వరుణ్‌(19) బ్లూవేల్‌ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ బిట్స్‌పిలానీలో రెండో సంత్సరం చదువుతున్న వరుణ్‌ సెలవుల కారణంగా వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. […]

జనవరి 10న ఇస్రో భారీ ప్లాన్

జనవరి 10న ఇస్రో భారీ ప్లాన్

ఉపగ్రహాలను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించిన‌ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఫిన్లాండ్‌, అమెరికాలతోపాటు భారత్‌కు చెందిన 30 ప్రైవేటు నానో, సూక్ష్మ ఉపగ్రహాలు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌- 2 ఉపగ్రహాన్ని జనవరి 10 అంతరిక్షంలోకి పంపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పీఎస్ఎల్వీ సి40 ద్వారా ఈ ఉపగ్రహాలను […]

అమల్లోకి… తలాఖ్ బిల్లు

అమల్లోకి… తలాఖ్ బిల్లు

మూడుసార్లు తలాక్ అంటే విడాకులు వచ్చేవి. ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు. అలా చేస్తే ఇక మీదట నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఫలితంగా ముస్లిం మహిళలకు మేలు జరగనుంది. అసదుద్దీన్ ఒవైసీ వంటి ఎంపీలు వ్యతిరేకించినా బిల్లు ఆమోదం ఆగలేదు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఎంఐఎం, అన్నాడీఎంకే, బీజేడీ, ఆర్జేడీ, […]

హైద్రాబాద్ లో రోబో పోలీస్

హైద్రాబాద్ లో రోబో పోలీస్

పలకరిస్తుంది. గుర్తు పడుతుంది. ఫిర్యాదులు వింటుంది. నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అంటుంది. అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది. ఇదంతా ఏదో కొత్త సాఫ్ట్ వేర్ అనుకుంటున్నారా…. కానే కాదు రజనీకాంత్ సినిమాలో చిట్టీ లాంటి రోబో…..ఇవి త్వరలో హైదరాబాద్ రోడ్లపై దర్శనమివ్వనున్నాయి. కొత్త సంవత్సరంలో ప్రజల రక్షణ కోసం పోలీసులతో కలిసి పని […]

తీపి, చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్న నండూరి

తీపి, చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్న నండూరి

 రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు ఏపీ డిజిపి నండూరి సాంబశివరావు.. మీడియా ప్రతినిధులను ముందు కూర్చోపెడితే ఊరుకుంటారా.. రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అసలు మీడియా సమావేశం ఎందుకు పెట్టానురా బాబాయ్ అనిపించేశారు. టీడీపీ కార్యకర్తలా డిజిపి వ్యవహరించారనే విమర్శల పై మీరు ఏమంటారని ఓ ప్రతినిధి అడిగారు. మీరు టీడీపీ పక్షాన […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com