Health

తుది దశలో అమరావతి డిజైన్స్

తుది దశలో అమరావతి డిజైన్స్

రాష్ట్ర శాసన పరిషత్  సముదాయ నిర్మాణానికి వజ్రాకృతిలో ఉన్న డిజైన్‌ను ఎంపికచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు భవనానికి స్థూపాకృతిని ఎంపికచేశారు. దీనిని వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించి రెండురోజులలో మొత్తం తుది ఆకృతులను సిద్ధం చేయాలని చెప్పారు.అమరావతిలోని పరిపాలన నగరానికి తుది ఆకృతులను సిద్ధం చేస్తున్న ఫోస్టర్ అండ్ […]

బాలారిష్టాలు దాటని ఇంగ్లీషు మీడియం స్కూల్స్

బాలారిష్టాలు దాటని ఇంగ్లీషు మీడియం స్కూల్స్

ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్లబోధన విధానాన్ని ప్రభుత్వం అంచెలెంచులుగా అమలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆంగ్ల విద్యా విధానంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు నియామకం, పాఠ్యపుస్తకాల సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు […]

ఒక పిల్ వేసుకుంటే తిరిగి య‌వ్వ‌నంలోకి!

ఒక పిల్ వేసుకుంటే తిరిగి య‌వ్వ‌నంలోకి!

కెన‌డాలోని మెక్‌మాస్ట‌ర్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు య‌వ్వ‌నాన్ని తిరిగి అందించే యూత్ పిల్ ప‌రిశోధ‌న‌లో తొలి అడుగు వేశారు. మ‌రో రెండేళ్ల‌లో ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వ‌స్తుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. మెదడు సామ‌ర్ధ్యాన్ని త‌గ్గించే వ్యాధి డిమెన్షియా, ఇతర వ‌య‌సుతోపాటు వ‌చ్చే అనేక రోగాల వ‌ల‌న జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చి, తిరిగి నూత‌న ఆరోగ్యాన్ని అంద‌జేయాల‌నే […]

ఘనంగా కొనసాగుతున్న  డయేరియా పక్షోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న డయేరియా పక్షోత్సవాలు

 నీళ్ల విరేచనా లను అదుపు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జూలై 1 నుంచి 15 వరకు డయేరియా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్నెళ్ల లోపు చిన్నారులకు వచ్చే నీళ్ల విరేచనాలను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా చిన్నారులకు ఓఆర్‌ఎస్, జింక్ ఔషధాలను పంపిణీ చేయనుంది. జిల్లా కేంద్రంలోని […]

గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..

గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..

ఆస్తమా వ్యాధి నిర్థారణ అవగానే ఇన్‌హేలర్ ఎల్లప్పుడూ మీతో ఉంచుకోమని వైద్యుడు సలహా ఇస్తాడు. కానీ రాత్రి పడుకునేపుడు వచ్చే గురకలు ఇన్‌హేలర్‌లు ఎంతవరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషధాలు ఇలాంటి గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషధాలంటే మీరే చూడండి.. క్యాంఫర్, ఆవాలు ఆవాల నూనె […]

వైద్యానికి జబ్బు

వైద్యానికి జబ్బు

రోగాలను తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వస్తే.. అక్కడేమో వేళకు రాని వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందుతాయన్న ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయి. ఆస్పత్రుల ఆవరణల్లో పారిశుద్ధ్య పరిస్థితి మరీ దారుణంగాఉంది. స్వచ్ఛత కనిపించడం లేదు. రోగాలను నయం అవుతాయనుకుని వచ్చే అపరిశుభ్రతతో లేని రోగాలు […]

పల్లెల్లో పొంచి ఉన్న డెంగ్యూ, మలేరియా

పల్లెల్లో పొంచి ఉన్న డెంగ్యూ, మలేరియా

పల్లెజనానికి జ్వరమొచ్చింది. పట్నం జనం రోగాల భయంతో వణుకు తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో దోమల స్వైర విహారం బయపెడుతుంది. ప్రతి ఏటా డెంగీ, మలేరియా వణికిస్తుండగా ఈ ఏడాది అదే భయంలో ప్రజలు ఉన్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సుల కొరత మరింత భయపెడుతుంది. వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తత కాకుంటే జనం రోగాల బారిన […]

వణికిస్తున్న పెట్యా వైరస్

వణికిస్తున్న పెట్యా వైరస్

కొద్ది రోజుల క్రితం ‘వాన్నా క్రై’ రాన్సమ్‌వేర్ సైబర్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మరో భీకర సైబర్ దాడి మొదలైంది. ‘పెట్యా’ రాన్సమ్‌వేర్ ఇప్పుడు సైబర్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఉక్రెయిన్‌లో ప్రారంభమైన ‘పెట్యా’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు శరవేగంగా విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోంది. యూరప్‌ను వణికిస్తున్న ఈ భయంకర రాన్సమ్‌వేర్.. భారత్‌ను టార్గెట్ చేసినట్లు […]

Couple Kissing Passionately On Bed

వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె పదిలం

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. దంపతుల మధ్య పలకరింపులు కూడా ఫోన్లకే పరిమితమవుతోంది. ఇంటికొచ్చినా.. మళ్లీ ఏదో పనిలో పడి హడావుడిగా గడిపేస్తున్న దంపతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఎన్ని పనులున్నా వారానికి రెండుసార్లు మాత్రం శృంగారంలో తప్పక పాల్గొనాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే..? వారానికి రెండుసార్లు శృంగారంలో […]

సర్కారీ ఆస్పత్రులు సొగసు చూడతరమా..

సర్కారీ ఆస్పత్రులు సొగసు చూడతరమా..

ఈ ఫోటోలు చూస్తే స్టార్ హోటల్స్ అనుకునేరు… కానీ ఆస్పత్రులు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కావు. పక్కా ప్రభుత్వ ఆస్పత్రులు. కొత్త ఫర్నిచర్‌తో కొత్త లూక్‌లో ఆస్పత్రులను చూసి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సైతం ముచ్చటపడి ఆస్పత్రుల దృశ్యాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కింగ్ కోటి, మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రులు కొత్త హంగులతో అలరిస్తున్నాయి. ప్రభుత్వ […]

అదిలాబాద్ కు ర్యాపిడ్‌ కార్డ్‌ టెస్టు కిట్లు

అదిలాబాద్ కు ర్యాపిడ్‌ కార్డ్‌ టెస్టు కిట్లు

సీజనల్‌ వ్యాధుల ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా సీజనల్‌ వ్యాధుల ప్రభావం కారణంగా అధికసంఖ్యలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగించేది. రెండేళ్లుగా మరణాల ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ వ్యాధుల ప్రభావం మాత్రం తగ్గలేదు. ప్రభుత్వం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కలుషితం నివారణకు చర్యలు తీసుకుంటోంది. వ్యాధులు […]

జరా భద్రం వ్యాధుల భయం

జరా భద్రం వ్యాధుల భయం

ఉష్ణోగ్రతలు చల్లబడ్డాయి. నగరంలో తరచూ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు చిత్తడిగా మారుతున్నాయి. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా పైపుల లీకేజీ వంటి వాటితో నీరు కలుషితమవుతోంది. మరోవైపు రోడ్లపై విక్రయించే కలుషితమైన తినుబండారాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన తాజా వేడి వేడి […]

ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ముప్పు

ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ముప్పు

ఖమ్మం జిల్లా వైరా లో పెను ప్రమాదం తప్పింది. సత్తుపల్లి డిపో ఆర్టీసీ డిపోకు చెందిన ఒక బస్సు ఖమ్మం వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు కు ఒకవైపుకు దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలవలేదు.

సీజపల్ వ్యాధుల పట్ల అప్రమత్తత

సీజపల్ వ్యాధుల పట్ల అప్రమత్తత

వర్షాకాలంతో తరుణంలో సీజనల్‌ వ్యాధులు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండ నుంచి ఉపశమనం లభించినా.. పరిశుభ్రత పాటించకపోతే రోగాలబారిన పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో రోగాలు అధికంగా వచ్చే అవకాశముండడంతో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేకుంటే దోమలు […]

గోంగూరతో గంపెడు ప్రయోజనాలు

గోంగూరతో గంపెడు ప్రయోజనాలు

గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూరలో ఎ, బి1, బి9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియమ్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, సోడియం, ఐరన్‌లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రైట్లు అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. గోంగూరలోని విటమిన్‌-ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటిని కూడా తగ్గిస్తుంది. గోంగూరలోని కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు […]