Latest News

చర్చి కోర్టులు ఇచ్చే విడాకులు చెల్లవు : సుప్రీం కోర్టు కీలక తీర్పు

చర్చి కోర్టులు ఇచ్చే విడాకులు చెల్లవు : సుప్రీం కోర్టు కీలక తీర్పు

క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డు ప్రకారం చర్చి కోర్టులు ఇచ్చే విడాకులు చెల్లవని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చర్చి కోర్టు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత లేదని, అలాంటివి చెల్లవని తేల్చి చెప్పింది. ఇది భారతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత కల్పించాలంటూ కర్ణాటక కేథలిక్ అసోసియేషన్ […]

మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ ప్లూ

మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ ప్లూ

హైదరాబాద్ లో స్వైన్‌ఫ్లూ వైరస్‌  చాపకింది నీరులా విస్తరిస్తోంది. జనవరి నెలలో 15 కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు మృతి చెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.కేవలం మూడురోజుల వ్యవదిలో ముగ్గురు మహిళళు మృత్యువాత పడటంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు..స్వైన్ ప్లూ లక్షనాలతో వచ్చే రోగుల పై కూడా గాంది వైద్యులు […]

Madurai: Hundreds of youths who have gathered from southern districts, participating in a protest demanding the Central government to lift the ban on Jallikattu, in Madurai on Tuesday. PTI Photo (PTI1_11_2017_000237B)

జల్లికట్టుపై తమిళ యువత పట్టు

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళ యువత పట్టు పట్టడంతో పాలకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ రోజు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ముఖ్యంగా యువత ఈ బంద్ లో పాలు పంచుకుంటున్నారు. తొలిసారిగా గర్వపడే స్థాయిలో యువత ఘన కార్యంలో తలమునకలై ఉందని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. […]

2016 హాటెస్ట్ ఇయర్ 

2016 హాటెస్ట్ ఇయర్ 

గడిచిన 100 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2016 నిలిచింది. మూడు దశాబ్దాల సగటు ఉష్ణోగ్రత కంటే గతేడాది 0.91 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్టు తెలిపింది భారత వాతావరణ సంస్థ. 13 ఏళ్లుగా భూమి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ వస్తున్నాయని తెలిపింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా 2016 లో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డ్ నమోదైంది.నైరుతి […]

రూ.30వేలకే పాన్ కార్డ్ మస్ట్

రూ.30వేలకే పాన్ కార్డ్ మస్ట్

ఇప్పటివరకు రూ.50వేల నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.30వేలకు తగ్గించాలని యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో రూ.30 వేలకు సరిపడే ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపార లావాదేవీలను సైతం ప్రభుత్వం […]

ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి

ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి

సంక్రాంతి పండగ ఆర్‌టిసికి కాసుల వర్షం కురిపిస్తోంది. నష్టాల బాటలో ఉన్న ఆర్‌టిసికి సంక్రాంతి పండగ పెద్ద ఊరట కల్పించింది. ఏకంగా 20 కోట్ల రూపాయిలకు పైగా అదనపు ఆదాయం లభించినట్టయింది. ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమని ఒకపక్క అధికారులు బాకా ఊదుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ప్రయాణికులను నిలువునా దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రైవేటు బస్సులకు […]

అరచేతిలోనే మీ సమస్య పరిష్కారం…

అరచేతిలోనే మీ సమస్య పరిష్కారం…

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించిన ‘పురసేవ’ యాప్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో పౌర సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదులు సంబంధిత విభాగం అధికారులకు చేరడానికి చాల సమయం పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫిర్యాదులపై అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసం ఫిర్యాదుదారులు పనులు […]

పాపికొండలకు పరిధితో…రక్షణ కరువు

పాపికొండలకు పరిధితో…రక్షణ కరువు

పాపికొండలు జాతీయ పార్కుకు రక్షణ కరువైంది.దాదాపు పదేళ్ల తర్వాత అటవీ శాఖ విభాగాలను పునర్వ్యవస్థీకరించి పటిష్టపరుస్తున్నారు. పాపికొండల ప్రాంతం 1998 వరకు పాపికొండల అభయారణ్యంగా ఉండేది. 590 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ అటవీ ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని 1012 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించారు. 2008లో దీన్ని […]

జియో వినియోగ‌దారుల‌కు మరో శుభవార్త

జియో వినియోగ‌దారుల‌కు మరో శుభవార్త

రిలయ‌న్స్ జియో ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను గుక్క తిప్పుకోనివ్వ‌కుండా చేస్తోంది. తాజాగా మ‌రోమారు ఇత‌ర కంపెనీల‌ను దెబ్బకొట్టే వ్యూహంతో ముందుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. జియో క‌నెక్ష‌న్ తీసుకున్న వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో 5జీ సేవ‌ల‌ను అందించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. అంతేకాదు 5 జీ స్మార్ట్‌ఫోన్ల‌ను కూడా మార్కెట్లోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. అదే జ‌రిగితే ఇత‌ర […]

రైల్వేస్టేషన్లలో అప్రమత్తం

రైల్వేస్టేషన్లలో అప్రమత్తం

ఇంటెలిజన్స్ హెచ్చరికలతో ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యమైన విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ముఖ్య పట్టణాలు, రైల్వేస్టేషన్లలో ఉగ్రవాదుల కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో అంతా హై ఎలర్ట్ ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతను మరింతగా పెంచాలని నిర్ణయించారు. దేశ నలుమూలల నుంచి నడిచే రైళ్ళన్నీ […]

పలు విదేశీ కంపెనీలతో  చంద్రబాబు చర్చలు 

పలు విదేశీ కంపెనీలతో  చంద్రబాబు చర్చలు 

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్శిటీలో భాగ స్వామి కావాలని చమురు, సహజవాయు, రిఫైనరీ రంగా లలో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ ఆరాంకో సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దావోస్‌ లో ప్రపంప ఆర్ధికవేదిక సదస్సులో  సౌదీ ఆరాంకో సంస్థ ప్రెసిడెంట్‌, సీఈఓ అమిన్‌ హెచ్‌.నాసర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ […]

వామ్మో…గడ్డి…

వామ్మో…గడ్డి…

జిల్లాలో వరిగడ్డి ధరలు పాడి రైతులను కలవరపెడుతున్నాయి.ఏడాది క్రితం ఎకరా రూ.1600 మాత్రమే ఉండే వరిగడ్డి ధరలు ఇప్పడు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పశుపోషకులు పశువులను మోపేందుకు ఇష్టం చూపించకపోవటంతో జిల్లాలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో ఆ ప్రభావం పాల దిగుబడిపై కూడా పడింది. ఎకరా రూ.6వేలు నుండి రూ.7వేలకు పైగా ధరకు కొనుగోలు చేస్తున్నారు. […]

ఎడారిగా మారుతున్న తుంగభద్ర ఆయకట్టు

ఎడారిగా మారుతున్న తుంగభద్ర ఆయకట్టు

రెండేళ్ల నుంచి రబీ సీజన్‌లో తుంగభద్ర దిగువ కాలువకు నీరు లేక 1.05 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి సీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చుతానని ప్రకటనలు చేస్తుండగా మరోవైపు ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు, నాయకులు కర్నాటక అధికారులు, ముఖ్యమంత్రితో మాట్లాడి మన వాటా నీటిని కూడా తెప్పించుకోలేని దుస్థితి నెలకొంది. […]

మూడు దశాబ్దాల కల ఆవిరైపోయింది

మూడు దశాబ్దాల కల ఆవిరైపోయింది

మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన నంద్యాల- యర్రగుంట్ల రైల్వే మార్గం గత ఏడాది ప్రారంభం కాగా నంద్యాల నుంచి కడప వరకూ డెమో రైలు నడుపుతున్నారు. అయితే నంద్యాల-కడప మధ్య తిరుగుతున్న డెమో రైలులో ప్రయాణం నరకప్రాయంగా ఉందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఎద్దుల బండి వేగంతో పోటీపడే విధంగా నడుస్తుందని కడప నుంచి నంద్యాలకు 4 […]

9.2 ల‌క్ష‌ల కోట్ల కొత్త క‌రెన్సీ జారీ..

9.2 ల‌క్ష‌ల కోట్ల కొత్త క‌రెన్సీ జారీ..

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత రూ.9.2 ల‌క్ష‌ల కోట్ల కొత్త క‌రెన్సీ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ తెలిపారు. నోట్ల ర‌ద్దు అంశం ప‌ర్య‌వ‌సానాల‌పై 2016 ఆరంభం నుంచే అంచ‌నాలు వేస్తున్నట్లు స్టాండింగ్ క‌మిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల బ్యాంకులకు ఎంత సొమ్ము […]