Politics

తమిళనాడును పాలించిన మహిళా ముఖ్యమంత్రులు వారిద్దరే

తమిళనాడును పాలించిన మహిళా ముఖ్యమంత్రులు వారిద్దరే

తమిళనాడు రాష్ట్రాన్ని ఇద్దరు మహిళలు జయలలిత, జానకి రామచంద్రన్ పరిపాలించారు. జయలలిత ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగా జానకి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ పదవిని అలంకరించారు. 1988 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు అంటే 23 రోజులు ముఖ్యమంత్రిగా ఆమె వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సతీమణే జానకి. […]

వైసీపీలో కాసు మహేశ్ రెడ్డి

వైసీపీలో కాసు మహేశ్ రెడ్డి

గుంటూరు జిల్లాకు చెం దిన మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌ రెడ్డి త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరను న్నట్లు సమాచారం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం లోటస్‌ పాండ్‌లో కాసు మహేశ్‌ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన వైసిపి నేతలు కొం […]

పన్నీరు సెల్వం… ఛాయ్ వాలా టూ సీఎం

పన్నీరు సెల్వం… ఛాయ్ వాలా టూ సీఎం

టీస్టాల్ ఓనర్ గా పన్నీర్ సెల్వం జీవితం ప్రారంభించిన ఆయన తమిళనాడు కొత్త సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు ఆమెకు వారసుడు. తనకు అవసరమైనప్పుడు సీఎం సీట్లో జయ కూర్చోబెట్టిన సెల్వమే ఇప్పుడు ఆమె ఖాళీ చేసిన వెళ్లిన సీట్లో కూర్చున్నారు. కుటుంబం, వారసులు ఎవరూలేని జయలలితకు రాజకీయ వారసుడిగా ఎదిగారు పన్నీర్ సెల్వం. […]

పథకాల్లో అమ్మే టాప్…

పథకాల్లో అమ్మే టాప్…

జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టడంలో ఎంజీ.రామచంద్రన్ రూట్ నే ఫాలో అయ్యారు జయలలిత. ఆమె తమిళనాడులో అమలు చేసిన అన్ని పథకాలు.. ప్రజలను అట్రాక్ట్ చేశాయి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అంటూ.. మొదటిసారిగా ప్రజాకర్షక పథకాలకు తమిళనాట నాంది పలికారు ఎమ్జీ రామచంద్రన్. అదే రూట్లో.. పేదల కోసం అమ్మ […]

మమత వర్సెస్ త్రిపాఠీ

మమత వర్సెస్ త్రిపాఠీ

పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు విషయంలో సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలను ఆ రాష్ట్ర గవర్నర్‌ కేశ్రీనాథ్‌ త్రిపాఠి పరోక్షంగా తోసిపుచ్చారు. బాధ్యతాయుతమైన ఆర్మీ వంటి వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్త వహించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. అయితే, గవర్నర్‌ వ్యాఖ్యలను సీఎం మమత తప్పుబట్టారు. కేంద్రం గొంతునే గవర్నర్‌ […]

మోదీ చెప్పింది జరిగితే ఆయన నామస్మరణ చేస్తా

మోదీ చెప్పింది జరిగితే ఆయన నామస్మరణ చేస్తా

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో అవినీతి పూర్తిగా అంతమైతే తాను ‘మోదీ మోదీ’ అని ఆయన నామస్మరణ చేసేందుకు సిద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుందన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుని గతంలో మాదిరిగానే లావాదేవీలకు అవకాశమివ్వాలని […]

‘అమ్మ’ బతికే ఉంది – అపోలో..

‘అమ్మ’ బతికే ఉంది – అపోలో..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ఇవాళ ఆమె ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. జయ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఆ ప్రచారమంతా నిరాధారమైనదని తెలిపింది. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది ఆస్పత్రి యాజమాన్యం. మరో వైపు ఏఐఏడీఎంకే ప్రధాన […]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దృష్టి పెట్టిన చంద్రబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దృష్టి పెట్టిన చంద్రబాబు

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తనతో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని, 20 మంది ఎమ్మెల్యేలు తనవైపు చూస్తున్నారని, వారు వస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. జగన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు భారీ స్థాయిలోనే రివెంజ్ తీర్చుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచే టీడీపీలోకి […]

‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో మోదీ ఫస్ట్

‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో మోదీ ఫస్ట్

అమెరికన్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ ‘టైమ్స్‌’ ప్రతియేటా నిర్వహించే ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను వెన‌క్కినెట్టి ముందు వరసలో నిలిచారు. నిన్న‌టితో రీడర్స్‌ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2016’గా […]

‘మేకిన్ ఇండియా’కు ట్రంప్ గ్రహణం

‘మేకిన్ ఇండియా’కు ట్రంప్ గ్రహణం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ట్రంప్ గ్రహణం పట్టేట్టుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ‘మేకిన్ ఇండియా’ భవిషత్యే ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా కంపెనీలు ఏవైనా సరే తమ ఉద్యోగాలను ఔట్ సోర్స్ చేసినా, విదేశాల్లో ఫ్యాక్టరీలను నిర్మించినా కఠిన చర్యలు తప్పవని […]

ఏపీ బరిలోకి ఎంఐఎం?

ఏపీ బరిలోకి ఎంఐఎం?

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో తిరుగులేని పార్టీ ఎంఐఎం. త‌మ కార్య‌క‌లాపాల్ని దేశవ్యాప్తంగా విస్త‌రించడంలో భాగంగా మ‌హారాష్ట్ర‌లోనూ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోంది. ప్ర‌స్తుతం పార్టీ అధినేత‌లు అస‌దుద్దీన్, అక్బ‌రుద్దీన్ పొరుగున ఉన్న ఏపీపై దృష్టి పెట్టారు. ముస్లిములు అధికంగా ఉన్న చోట్ల పోటీ చేసి కొన్ని సీట్లు గెల‌వ‌డం ద్వారా కింగ్ మేక‌ర్ పొజిష‌న్‌ని కైవ‌సం చేసుకోవాల‌ని […]

పవన్ పై బాలయ్య బాణం

పవన్ పై బాలయ్య బాణం

జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌తి పనినీ చంద్ర‌బాబు నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఆయన సభలకు పెద్ద సంఖ్యలో జనం వస్తుండడం, ప్రసంగాలను ఆసక్తిగా వింటుండడంతో 2019 ఎన్నిక‌ల్లో దెబ్బ తప్పదని భావించిన చంద్రబాబు ఆయన్ను ఏ విధంగా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నారు. పవన్ కు దీటుగా ప్ర‌జ‌ల్లో ఐడెంటిటీ ఉన్న స్టార్ల‌ను వెతుకుతున్నారు. ప్ర‌స్తుతానికి […]

జయలలిత బతికి ఉన్నారా.. లేదా?

జయలలిత బతికి ఉన్నారా.. లేదా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసలు బతికి ఉన్నారా లేదా చెప్పాలనిఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ శశికళా పుష్ప డిమాండ్ చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు వాస్తవాన్ని చెప్పాలని కోరారు. ఆమె ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని, వీటిని నిలిపి, తమిళనాట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విన్నవించారు. రెండున్నర […]

డిస్టలరీల యాజమాన్య ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్…

డిస్టలరీల యాజమాన్య ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్…

వివిధ రకాల మద్యంపై 6 శాతం నుంచి 10 శాతం ధరలు వడ్డించింది.రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలపై సమీక్ష జరుగుతుంది. కానీ ఇక్కడ మూడేళ్లుగా పెంచటం లేదని.. డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అందుకే అటు డిస్టిలరీల యాజమాన్యాలు, మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరటంతో పాటు.. ఇటు ఖజానాకు కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతుందని […]

జయలలిత పరిస్థితి మరింత విషయం

జయలలిత పరిస్థితి మరింత విషయం

అపోలో అసుపత్రిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమెను చెన్నై అపోలో ఆసుపత్రిలోనే ఐసీయూ వార్డుకు తరలించారు. జయలలితకు ఈ ఉదయం ప్రత్యేక వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆమె గుండె కవాటాల్లో ఉన్న సమస్యను తొలగించినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గుండెకు ఊతమందించే ‘ఎక్మో’ […]