Politics

తెలంగాణ కమలానికి దారెటు…

తెలంగాణ కమలానికి దారెటు…

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రభావంతో 2019 నాటికి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలన్న కసితో ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపి నేతల ఉత్సాహంపై కేంద్ర బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు నీళ్లు చల్లుతున్నారు. ఢిల్లీ పెద్దల తీరుతో తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైందని ఒక నాయకుడు ఆవేదన […]

జనాలకు దూరంగా ఫిరాయింపు నేతలు

జనాలకు దూరంగా ఫిరాయింపు నేతలు

ఫిరాయింపు ఎంఎల్ఏలకు జనాలు షాకులిస్తున్నారు. ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం మొదలైన దగ్గర నుండి షాకులు మరీ ఎక్కువగా తగులుతున్నాయి. కార్యక్రమంలో నలుగురు ఎంఎల్ఏలను జనాలు నిలదీయటంతో వారికి ఏం సమాధానాలు చెప్పాలో అర్దం కాలేదు. దాంతో కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగారంటేనే అర్ధం చేసుకోవచ్చు పరిస్ధితి. జ్యోతుల నెహ్రూ, చాంద్ భాషా, జయరాములు, అశోక్ రెడ్డిలకు […]

కమల్ కు అంత సీన్ లేదు

కమల్ కు అంత సీన్ లేదు

రాజకీయాలపై ఆసక్తిని చూపుతున్న తమిళ హీరోలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడాన్ని ఆపడం లేదు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. సొంత పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వస్తామన్నట్టుగా ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లపై స్వామి మరోసారి ధ్వజమెత్తారు. వాళ్లకు కనీస అవగాహన లేదు.. వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి సాధించేది ఏమిటి? […]

మీడియా దూరంగా రోజా

మీడియా దూరంగా రోజా

రోజా ఏం చేసినా వివాదమే అవుతోంది. మంచి చేయాలనుకుంటోంది. కానీ అది రివర్స్ అయి తిరిగి తనకే ఇబ్బంది తెచ్చిపెడుతోంది. నగరి ఎమ్మెల్యే రోజా నంద్యాల, కాకినాడ ఎన్నికలు తరువాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో నగరి ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. తన మాటల్లో మార్పు వచ్చింది. పెద్దగా హడావుడి చెయ్యడం లేదు. […]

రాజకీయాలకు జయప్రద గుడ్ బై

రాజకీయాలకు జయప్రద గుడ్ బై

ప్రముఖ అందాల నటి, సమాజ్ వాది పార్టీ మాజీ ఎంపి జయప్రద ఇక రాజకీయాలలో ఉండనంటున్నారు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆమె ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి పోటీ చేసి గెల్చారు. తర్వాత పార్టీ నుంచి ఆమె ను బహిష్కరించారు. అప్పటినుంచి ఆమె రాజకీయాల ప్రస్తానం దాదాపు ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీలో చేరుతుందన్నారు.కాంగ్రెస్ […]

హోంగార్డుల సమస్యను తీర్చండి : కిషన్ రెడ్డి

హోంగార్డుల సమస్యను తీర్చండి : కిషన్ రెడ్డి

హోంగార్డుల సమస్యల పరిష్కార విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియంతలా ప్రవర్తిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం నాడు హోంగార్డుల సమస్యలపై బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన కిషన్ రెడ్డి 2004నుండి హోంగార్డుల కోసం పోరాడూతున్నారు. వైఎస్ ప్రభుత్వంలోనూ అన్ని పార్టీలను […]

రాజం పేటలో ఎన్నికలకు టీడీపీ ప్లాన్

రాజం పేటలో ఎన్నికలకు టీడీపీ ప్లాన్

జగన్ ఇలాకాలోనే ఝలక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీకి ఎన్నికలు జరిపించి, దాన్ని గెలుచుకుని జగన్ కు ప్రజాభిమానం తగ్గిందని నిరూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.తొలుత కోర్టులో ఉన్న కేసులను తొలగించి, ఆపై ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు, ప్రస్తుతం […]

అనంతపురం పై కన్నేసిన పురందరేశ్వరీ

అనంతపురం పై కన్నేసిన పురందరేశ్వరీ

అధిష్టానం ఆదేశిస్తే.. అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తా.. అని ప్రకటించారు బీజేపీ నేత పురందేశ్వరి. ఆ జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. క్రితం సారి ఎన్నికల్లో రాయలసీమ నుంచినే పురందేశ్వరి పోటీ చేశారు. కడప-చిత్తూరు జిల్లాల అసెంబ్లీ సీట్లు మిళితం అయిన రాజంపేట నుంచి ఆమె పోటీ చేశారు. […]

విమోచనంతో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్

విమోచనంతో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బిజేపి సెప్టెంబర్ 17న నిజామబాద్ లో భారి బహిరంగసభను నిర్వహిస్తోంది. కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యే ఈ సభ ద్వారా విమోచన సంకల్పం తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. దీని ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంటును రగిలించి రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది […]

సమాజాభివృద్దికి పాత్రికేయులు కృషి చేయాలి : స్పీకర్ మధుసూదనాచారి

సమాజాభివృద్దికి పాత్రికేయులు కృషి చేయాలి : స్పీకర్ మధుసూదనాచారి

సమాజంలో అన్ని వర్గాల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తున్నారని స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అపూర్వమని ప్రశంసించారు. సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు కృషి చేయాలని సూచించారు. వరంగల్ లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులకు అయన ముఖ్యఅతిధిగా హజరయ్యారు. స‌మాజంలో విలువ‌ల ప‌త‌నం శ‌ర‌వేగంగా సాగుతోంద‌న్నారు. స‌మాజాభివృద్ధికి […]

నిన్న గవర్నర్‌…ఇవాళ సీఎం

నిన్న గవర్నర్‌…ఇవాళ సీఎం

పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడం లేదని ఫిర్యాదు వచ్చింది. అక్కడకు సంబంధిత శాఖ సిబ్బంది వెళ్లి చూస్తే సరిపోతోంది. లేకపోతే అధికారి వెళ్లి పర్యవేక్షణ చేస్తే సమస్య పరిష్కారమవుతోంది. కానీ ఆ పని చేయలేదు సిఎం వి. నారాయణస్వామి. రాత్రి పూట వీధుల్లో స్కూటర్‌పై తిరిగారు. ఎక్కడ వీధిలైట్లు ఉన్నాయో.. మరెక్కడ లేవో తెలుసుకున్నాడు. […]

వాణీ విశ్వనాధ్ ఎంట్రీకి అంతా రెడి

వాణీ విశ్వనాధ్ ఎంట్రీకి అంతా రెడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి సినీ నటి వాణి విశ్వనాధ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. తన తండ్రి జ్యోతిష్యం చూసి చెప్పారని… రాజకీయాల్లో తాను రాణించే అవకాశముందని ప్రస్తావించారని చెబుతోందా అమ్మడు. 13 ఏళ్ల వయసుకే సినిమాల్లోకి అడుగు పెడతానని ఆమె పుట్టినప్పుడే చెప్పారట తండ్రి. ఇప్పుడు అదే మాట చెప్పారని గుర్తు చేస్తోంది. నగరి నుంచి పోటీకి […]

పార్టీల వాణి ప్రవాసామేనే….

పార్టీల వాణి ప్రవాసామేనే….

ప్రజాసమస్యల పరిష్కారం కోసం రెండు ప్రతిపక్షపార్టీలు చేస్తున్న ‘ప్రవాస పోరాటాలు’ ఫలితాలివ్వకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లవుతున్నా, ఇప్పటివరకూ రాష్ట్ర రాజధాని విజయవాడ కాకుండా హైదరాబాద్ నగరానికే రాజకీయ కార్యకలాపాలు పరిమితవడాన్ని వైసీపీ, జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు జిల్లాలకు చెందిన రెండు పార్టీల నాయకులకు […]

ధైర్యమే కవచంగా అడుగులు వేశాను :పవన్

ధైర్యమే కవచంగా అడుగులు వేశాను :పవన్

ఓవైపు సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరో వైపు ‘జనసేన’ పార్టీ పెట్టి ప్రజాసేవ వైపు నడుస్తున్నారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీచేసి ప్రజాసేవలో మమేకం కావాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన పలు సమస్యలపై పవన్ గొంతెత్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం […]

నల్గొండ నుంచి రేవంత్ పోటీకి రెడీ

నల్గొండ నుంచి రేవంత్ పోటీకి రెడీ

నల్లగొండ ఎంపీ సీటుకు గనుక ఉప ఎన్నిక వస్తే.. అక్కడ నుంచి పోటీ చేయడానికి సై అనే సంకేతాలను ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తాసుఖేందర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామాచేయవచ్చుననే ఊహాగానాలున్నాయి. ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఇది జరిగి కూడా […]