Sports

వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ టాప్

వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ టాప్

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్‌కు ఇటీవలే నంబర్ 1 స్థానాన్ని కోల్పోయిన విరాట్.. తిరిగి టాప్ పోజిషన్‌కు చేరుకున్నాడు. కివీస్‌పై తొలి వన్డేలో 121 పరుగుల చేసిన కోహ్లి, మూడో వన్డేలో 113 పరుగులు చేశాడు. మూడు […]

రెండు దేశాలకు చావో, రేవో

రెండు దేశాలకు చావో, రేవో

సెకండ్ వన్డేలో కోహ్లీసేన విజయ దుందుభి మోగించింది. తప్పక గెలవాల్సిన పోరులో ఒత్తిడిని చిత్తుచేసింది. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య ఇది 100వ వన్డే కాగా టీమిండియాకు 50వ విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. కాన్పూర్‌లో రేపు జరిగే అంతిమ సమరంలో రెండు […]

టీమ్ లో 14 మందికి అవకాశం

టీమ్ లో 14 మందికి అవకాశం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే.. అతను ఏం చెప్పినా.. అది ఆటకి ఉపయోగపడే విధంగా ఉంటుందని అందరి విశ్వాసం. దీనికి నిదర్శనమే పాఠశాల స్థాయి క్రికెట్‌ తుది జట్టులో 14 మంది ఆటగాళ్లకి చోటు కల్పించాలనే సూచన. గత ఏడాది సచిన్ సూచించిన […]

ఇండియాలో ఫుట్ బాల్ కు పెరుగుతున్న ఆదరణ

ఇండియాలో ఫుట్ బాల్ కు పెరుగుతున్న ఆదరణ

క్రికెట్.. క్రికెట్.. స్పోర్ట్స్ అంటే భారత్‌లో ఏకైక నిర్వచనం క్రికెట్టే. క్రికెటర్లే హీరోలు, క్రికెటర్లే స్టార్లు.. ఆట అంటే క్రికెట్ తప్ప మరేం కాదు. బ్రిటీష్ వాళ్లు అలవాటు చేసి వెళ్లిన క్రికెట్ మత్తులో పడిపోయి.. భారత్ మరే ఇతర క్రీడలోనూ కనీస ప్రాతినిధ్యం లేకుండా చేసుకుంది. జాతీయ క్రీడ హాకీ ఆదరణ లేక అల్లాడుతోంది. […]

మళ్లీ రింగ్ లోకి మేరికోమ్

మళ్లీ రింగ్ లోకి మేరికోమ్

భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ కొంత విరామం తర్వాత మళ్లీ రింగ్‌లోకి వస్తోంది. నవంబరులో జరగనున్న ఆసియా ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48కేజీల విభాగంలో మేరీకోమ్ పోటీపడనుంది. ఆమెతో పాటు మరో బాక్సర్ సరితా దేవి కూడా మరోసారి తమ అదృష్టాన్ని రింగ్‌లో పరీక్షించుకోనుంది. నవంబరు 2 నుంచి 11 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.2012 […]

భారత్ 70 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే

భారత్ 70 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే

ఒప్పందం ప్రకారం తమతో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడనందుకు బీసీసీఐ పరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేలా భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే.. ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం లేకపోవడంతో భారత్ జట్టు పాకిస్థాన్‌తో […]

పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు సిఫార్సు

పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు సిఫార్సు

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, ఒలింపిక్‌ పతక విజేత, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారానికి సిఫార్సు చేశారు. ఆమె పేరును పద్మభూషణ్‌ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 2వ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా సింధు కొరియా […]

విరాట్ నెక్స్టే  టార్గెట్ పాంటింగే

విరాట్ నెక్స్టే టార్గెట్ పాంటింగే

ఈడెన్ వన్డేల్లో 31వ శతకం నమోదు చేయడం ద్వారా ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును అధిగమించే అవకాశం కొద్దిలో మిస్సయ్యాడు. కానీ విరాట్ మరో అరుదైన రికార్డును మాత్రం అందుకున్నాడు. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. అన్ని ఫార్మాట్లూ […]

వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్

వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్

ప్రపంచకప్ 2019 టోర్నీకి శ్రీలంక నేరుగా అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌‌లో భాగంగాముగిసిన తొలి వన్డేలోనే వెస్టిండీస్ ఓటమిపాలవడంతో శ్రీలంకకి మార్గం సుగుమమైంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 78 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ ప్రపంచకప్‌కి నేరుగా అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్‌ని సిరీస్‌లో వైట్‌వాష్ చేయాల్సి ఉండేది. వెస్టిండీస్ అలా […]

పద్మ రేసులో ధోని

పద్మ రేసులో ధోని

దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరుని బీసీసీఐ సిఫార్సు చేసింది. ఇటీవల 300 వన్డేల మైలురాయిని అందుకున్న ధోనీ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 100 వన్డే అర్ధశతకాలు, 101 స్టంపౌట్స్‌తో అరుదైన రికార్డులను నెలకొల్పాడు. కెప్టెన్‌గా కూడా భారత్‌కి 2007లో టీ20 […]

లాస్ఏంజిల్స్ లో 2028 ఒలింపిక్స్

లాస్ఏంజిల్స్ లో 2028 ఒలింపిక్స్

2028 ఒలింపిక్స్ నిర్వహణ జాక్ పాట్ ను లాస్ ఏంజిల్స్ కొట్టేసింది. 2024లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తాజాగా సంకేతాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఒలింపిక్ కమిటీ త్వరలో వెల్లడించనుంది. నిజానికి 2024లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు […]

ఇది విరాట్ శకం…

ఇది విరాట్ శకం…

టీమిండియాలో మరో శకం మొదలైంది. గతంలో పటౌడీ శకం., కపిల్ శకం, సచిన్ శకం, గంగూలీ శకం., ధోనీ శకం.. ఇలా లెజెండరీ ఆటగాళ్లతో టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత క్రికెట్ లో విరాట పర్వం నడుస్తోంది. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లో విరాట్ కొహ్లీ అందిస్తున్న విజయాలతో భారత క్రికెట్ దూసుకుపోతోంది. తాజాగా […]

నాల్గో వన్డే లో కొత్త వారికి అవకాశం

నాల్గో వన్డే లో కొత్త వారికి అవకాశం

శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలకి జట్టులో మార్పులు ఉండొచ్చని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. వన్డే సిరీస్‌ కోసం సెలక్టర్లు 15 మందితో జట్టుని ఎంపిక చేయగా.. మూడు వన్డేలకి ఒకే తుది జట్టును కోహ్లి కొనసాగించాడు. మూడు వన్డేల్లోనూ తక్కువ […]

శ్రీశాంత్ కు కోర్టులో ఊరట

శ్రీశాంత్ కు కోర్టులో ఊరట

క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు ఊర‌ట క‌లిగించే తీర్పు వెలువ‌రించింది కేర‌ళ హైకోర్టు. అత‌నిపై బీసీసీఐ విధించిన జీవిత‌కాల నిషేధాన్ని ఎత్తేసింది. గ‌తేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పు త‌ర్వాత త‌నపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల‌ని శ్రీశాంత్ బీసీసీఐని కోరినా.. బోర్డు తిర‌స్క‌రించింది. దీంతో అత‌ను […]

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

శ్రీ లంకపై మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు శనివారం నుంచి జరగనున్న చివరి టెస్టులో ప్రయోగాలు చేయాలని యోచిస్తోంది. ఆదివారం ముగిసిన కొలంబో టెస్టులో క్రమశిక్షణ తప్పి మూడో టెస్టు నుంచి నిషేధానికి గురైన స్పిన్నర్ రవీంద్ర జడేజా స్థానంలో.. యువ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి చోటివ్వాలని కెప్టెన్ […]