Tirumala News

వాటికన్ సిటీ, డిస్నీ తరహాలో తిరుమల సౌకర్యాలు

వాటికన్ సిటీ, డిస్నీ తరహాలో తిరుమల సౌకర్యాలు

భక్తుల సౌకర్యాల కల్పన, పరిశుభ్రత తదితర విషయాల్లో వాటికన్ సిటీ, డిస్నీ తరహాలో తిరుమలలో ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తున్నారని హైదారాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి చెందిన అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ జె.బెర్రెట్ ట్రవీస్ కొనియాడారు. విదేశాల్లో పర్యటించే అమెరికన్లకు ఆయా దేశాల్లో కల్పిస్తున్న భద్రత, ఇతర సౌకర్యాలను పర్యవేక్షించేందుకు స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ […]

వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవోపేతంగా నిర్వహిస్తున్న వాహన సేవలను చూసి, తరలించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం సింహవాహానంపై ఊరేగారు. సాయంత్రం ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

-దేశంలోనే తొలిసారిగా ప్రహరి కళాత్మక ఉద్యానవనాలు -బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వివరించారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వివరించారు. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ప్రహరి […]

శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలి

శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రచార సామగ్రి వెంటనే సిద్ధం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

తలనీలాల తో 12 కోట్లు ఆదాయం

తలనీలాల తో 12 కోట్లు ఆదాయం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటాను కోట్ల భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా 12 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిలో 11,300 కిలోలకు రూ.12.21 కోట్ల ఆదాయాన్ని తితిదే గడించింది. ప్రతి నెల మొదటి తలనీలాల ఈ వేలం జరుగుతుంది. తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 […]

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేది నుండి 11వ తేది వరకు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు పూర్తి చేసి పైపులతో కొత్త నీటిని నింపే చర్యలు ప్రారంభించారు. శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు వేచిఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బ్యారికేడ్లు […]

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఈ  రోజు ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

రికార్డు స్థాయిలో తలనీలాల విక్రయ ఆదాయం

రికార్డు స్థాయిలో తలనీలాల విక్రయ ఆదాయం

తలనీలాల ద్వారా తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ ఆదివారం ఈ-వేలం ద్వారా విక్రయించింది. వేలంలో 3,900 కిలోల కురులు అమ్ము డుపోగా దీనిద్వారా రూ.6.10కోట్ల ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించే తలనీలాలను టీటీడీ నెలకోసారి వేలం నిర్వహిస్తుంటుంది. తలనీలాలను వివిధ రకాలుగా విభజించి పారదర్శకంగా విక్రయిస్తుండటంతో ఆదాయం భారీగా […]

విజయవాడలో స్వామి వారి నమూనా ఆలయం

విజయవాడలో స్వామి వారి నమూనా ఆలయం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో శ్రీవారి నమునా ఆలయం, రోజుకు లక్షమంది భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ […]

ఘనంగా కోదండరాముడికి పవిత్ర సమర్పణ

ఘనంగా కోదండరాముడికి పవిత్ర సమర్పణ

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా […]

శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్న భక్తులకు శుభవార్త. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నప్పటికీ సులువుగానే దర్శనం అయ్యే సౌకర్యం ఆర్టీసీ, టీటీడీ సంయుక్తంగా కల్పిస్తున్నాయి. ఇందుకు ఏం చేయాలో తెలుసా? చిత్తూరు జిల్లాలోని ఏ డిపోకు చెందిన బస్సయినా తిరుపతి వెళుతుంటే దాన్ని ఎక్కేయడమే! ఈ నెల 31 నుంచి ప్రయోగాత్మ కంగా అమలు చేయనున్న స్కీమ్ […]

ఆగష్టు24న 24 అడుగుల శ్రీనివాసుడి విగ్రహ ప్రతిష్ట

ఆగష్టు24న 24 అడుగుల శ్రీనివాసుడి విగ్రహ ప్రతిష్ట

బృందావనంలో 24 అడుగుల శ్రీవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అంతా సిద్ధమైంది. తిరుపతిలో శిల్పి పెంచల ప్రసాద్ ఆధ్వర్యంలో అరుదైన కృష్ణశిల రాళ్ళతో తయారవుతున్న శ్రీవారి భారీ విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమిళనాడు కాంచీపురం సమీపంలోని సిరిదాంబూర్ కొండల్లో నుంచి 40 టన్నుల ముడిరాయిని తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. కుడి ఎడమ చేతుల్లో […]

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. ఈ రోజు ఉదయానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

భక్తుల వినియోగానికి యాత్రిసదన్‌-4

భక్తుల వినియోగానికి యాత్రిసదన్‌-4

తిరుమలలో యాత్రిసదన్‌-4ను భక్తులకు అందుబాటులోకి మంగళవారం తీసుకువచ్చారు. ప్రధాన కల్యాణకట్ట ఎదుట ఉన్న సముదాయాన్ని తితిదే ఈవో సాంబశివరావు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు కలిసి పరిశీలించారు. వెంటనే యాత్రికులకు ప్రవేశం కల్పించి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు భక్తులను ప్రవేశపెట్టారు. సముదాయం యావత్తు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సముదాయంలో అత్యాధునిక […]

తిరుమలలో నో ఫ్లై జోన్ సాధ్యం కాదు

తిరుమలలో నో ఫ్లై జోన్ సాధ్యం కాదు

తిరుమల శ్రీనివాసుడి ఆలయ పరిసరాలను ‘నో ఫ్లైజోన్’గా ప్రకటించటం కుదరదని పౌర విమానయాన శాఖ మంగళవారం స్పష్టం చేసింది. దీనివల్ల తిరుపతి విమానాశ్రయం రాకపోకలు తగ్గిపోతాయని పేర్కొంది. వేంకటేశ్వరుడి ఆలయ ప్రాంగణంపై ఆకాశంలో విమానాలు తిరగకుండా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ […]