Tirumala News

ఘనంగా కోదండరాముడికి పవిత్ర సమర్పణ

ఘనంగా కోదండరాముడికి పవిత్ర సమర్పణ

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా […]

శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్న భక్తులకు శుభవార్త. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నప్పటికీ సులువుగానే దర్శనం అయ్యే సౌకర్యం ఆర్టీసీ, టీటీడీ సంయుక్తంగా కల్పిస్తున్నాయి. ఇందుకు ఏం చేయాలో తెలుసా? చిత్తూరు జిల్లాలోని ఏ డిపోకు చెందిన బస్సయినా తిరుపతి వెళుతుంటే దాన్ని ఎక్కేయడమే! ఈ నెల 31 నుంచి ప్రయోగాత్మ కంగా అమలు చేయనున్న స్కీమ్ […]

ఆగష్టు24న 24 అడుగుల శ్రీనివాసుడి విగ్రహ ప్రతిష్ట

ఆగష్టు24న 24 అడుగుల శ్రీనివాసుడి విగ్రహ ప్రతిష్ట

బృందావనంలో 24 అడుగుల శ్రీవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అంతా సిద్ధమైంది. తిరుపతిలో శిల్పి పెంచల ప్రసాద్ ఆధ్వర్యంలో అరుదైన కృష్ణశిల రాళ్ళతో తయారవుతున్న శ్రీవారి భారీ విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమిళనాడు కాంచీపురం సమీపంలోని సిరిదాంబూర్ కొండల్లో నుంచి 40 టన్నుల ముడిరాయిని తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. కుడి ఎడమ చేతుల్లో […]

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. ఈ రోజు ఉదయానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

భక్తుల వినియోగానికి యాత్రిసదన్‌-4

భక్తుల వినియోగానికి యాత్రిసదన్‌-4

తిరుమలలో యాత్రిసదన్‌-4ను భక్తులకు అందుబాటులోకి మంగళవారం తీసుకువచ్చారు. ప్రధాన కల్యాణకట్ట ఎదుట ఉన్న సముదాయాన్ని తితిదే ఈవో సాంబశివరావు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు కలిసి పరిశీలించారు. వెంటనే యాత్రికులకు ప్రవేశం కల్పించి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు భక్తులను ప్రవేశపెట్టారు. సముదాయం యావత్తు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సముదాయంలో అత్యాధునిక […]

తిరుమలలో నో ఫ్లై జోన్ సాధ్యం కాదు

తిరుమలలో నో ఫ్లై జోన్ సాధ్యం కాదు

తిరుమల శ్రీనివాసుడి ఆలయ పరిసరాలను ‘నో ఫ్లైజోన్’గా ప్రకటించటం కుదరదని పౌర విమానయాన శాఖ మంగళవారం స్పష్టం చేసింది. దీనివల్ల తిరుపతి విమానాశ్రయం రాకపోకలు తగ్గిపోతాయని పేర్కొంది. వేంకటేశ్వరుడి ఆలయ ప్రాంగణంపై ఆకాశంలో విమానాలు తిరగకుండా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ […]

అందుబాటులోకి రానున్నశ్రీవారి సేవల మొబైల్‌ యాప్‌

అందుబాటులోకి రానున్నశ్రీవారి సేవల మొబైల్‌ యాప్‌

తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను మరింత విస్తృతం చేసేందుకు కొత్తగా మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్‌లో సేవా టిక్కెట్లు, గదుల బుకింగ్‌తోపాటు తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. సేవలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకునేందుకు అనువుగా ఇటీవల నెక్ట్స్‌జెన్‌ పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. గతంలో టికెట్లను పొందాలంటే ఆన్‌లైన్‌లోనూ గంటల తరబడి […]

ఆధార్ తప్పనిసరి చేసిన టిటిడి

ఆధార్ తప్పనిసరి చేసిన టిటిడి

ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, రేషన్ కావాలన్నా, పించన్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ కావాల్సిందే. తాజాగా తిరుమల శ్రీవారి దేవాలయంలోనూ ఆధార్ తప్పనిసరి చేశారు. స్వామి వారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు. వచ్చే గురువారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి […]

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ప్రముఖ దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి భక్తులు వెలుపల బారులు తీరారు. నిన్న శ్రీవారిని 81,555 మంది భక్తులు దర్శించుకున్నారు.

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

శ్రీ వెంకటేశ్వర స్వామి కోలుయైవున్న తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానినికి రెండు గంటలు ,కాలినడక భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 67,087 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం పురస్కరించుకుని ఆర్జిత […]

ఈ శనివారం తిరుమలలో ఆణివార ఆస్థానం

ఈ శనివారం తిరుమలలో ఆణివార ఆస్థానం

తిరుమల లో ఈ శనివారం సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి ఏడాది సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు జరుపబడుతుంది. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున అంటే జూలై 16వ తేదిన జరుపబడే కొలువు కనుక ఈ ఉత్సవానికి ఆణివార […]

‘తీరితే తిరుపతి.. తీరకుంటే మన్యంకొండ’

‘తీరితే తిరుపతి.. తీరకుంటే మన్యంకొండ’

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలకేంద్రానికి సమీపంలో ప్రకృతిసిద్ధమైన మునుల కొండపై కలియుగ వెంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. కలియుగ ఆరంభంలో వెంకటేశ్వరస్వామి ఆదిశేష అవతార రూపంలో గల రాతి గుహలలో స్వయంభువుగా వెలిశాడని చరిత్రగాథ. అలహరి వంశీయులైన అలహరి కేశవయ్య కలలో ఒకానొక రాత్రి శ్రీనివాసుడు దర్శనం ఇచ్చి కృష్ణనది తీర ప్రాంగణంలో గల మునులకొండ(మన్యంకొండ)పై […]

తలనీలాల టిటిడి ఆదాయం రూ.12.45 కోట్లు

తలనీలాల టిటిడి ఆదాయం రూ.12.45 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శ నార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తల నీలాల ఈ-వేలంలో టిటిడి రూ.12.45 కోట్ల ఆదాయాన్ని గడించింది. శుక్రవారం తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వ హించారు. ఈ నెల […]

వెంకన్న దర్సనానికి కొనసాగుతున్న రద్దీ

వెంకన్న దర్సనానికి కొనసాగుతున్న రద్దీ

ఏడుకొండలమీద కొలువైన కోనేటిరాయడు దర్శనభాగ్యం కోసం భక్తకోటి అలమటిస్తోంది. తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారిని […]

తిరుమల శ్రీవారికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్ సంస్థ విరాళం…

తిరుమల శ్రీవారికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్ సంస్థ విరాళం…

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖ వ‌స్త్ర వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్ రూ.1.20 కోట్ల విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన డీడీల‌ను టీడీడీ అధ్య‌క్షుడు చద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి అందించారు. సంస్థ అందించిన విరాళంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి రూపాయ‌లు ఉప‌యోగించ‌నున్నారు. ప్రాణదాన […]