Tirumala News

తిరుమలలో నీటి పాట్లు

తిరుమలలో నీటి పాట్లు

  తిరుమలలో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్నటి వరకు తిరుమల డ్యాముల్లో ఉన్న నీటితో నెట్టుకొచ్చిన టీటీడీ అది కాస్తా అడుగంటడంతో తిరుపతి కళ్యాణి డ్యాము నుంచి నీటిని తిరుమలకి పంపింగ్ చేసుకుంటోంది. అయితే రోజు రోజుకి ఉష్టోగ్రతలు పెరుగుతండటం…మరో వైపు డ్యాముల్లోని నీరు డెడ్ స్టోరీజీకి చేరుకోవడంతో తిరుమలకి నీటికష్టాలు తప్పేలా కనపడ్డం లేదు. […]

3నుంచి టీటీడీ ‘శుభప్రదం’పై శిక్షణ

3నుంచి టీటీడీ ‘శుభప్రదం’పై శిక్షణ

   తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో జూన్‌ 3 నుంచి 9వ తేదీ వరకు ఎస్వీ జూనియర్‌ కళాశాలలో ‘శుభప్రదం’ పేరిట చిన్నారులకు ఆధ్యాత్మిక, వైజ్ఞానికి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా ధార్మిక ప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. శిబిరంలో పాల్గొనే చిన్నారులకు ఉచిత వసతి, […]

తిరుమలలో పెళ్లిళ్లకు ఆన్ లైన్ బుకింగ్

తిరుమలలో పెళ్లిళ్లకు ఆన్ లైన్ బుకింగ్

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని చెంత వివాహం చేసుకొని, ఒక్కటవ్వాలనుకునేవారికి ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే జంటలు సమీపప్రాంతాల్లోని నెట్ సెంటర్‌లో టిటిడి సేవా ఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఓటర్, […]

స్వామి వారికి 40 కోట్ల విరాళం

స్వామి వారికి 40 కోట్ల విరాళం

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరునికి కానుకలు కొదవేలేదు. వటవృక్షంలా స్వామివారి ఆస్తులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మొక్కుల రూపంలో కోట్లాది రూపాయలు భక్తులు సమర్పించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడికి భక్తులు విశేషంగా ముడుపులు సమర్పించుకుంటారు. వందలు వేలు కాదు కోట్లాది రూపాయలు భూరి విరాళంగా ఇచ్చేస్తుంటారు. తలపెట్టిన కార్యాలు నిరాటంకంగా […]

సింఘాల్ కు మద్దతు తెలిపిన మోహన్ బాబు

సింఘాల్ కు మద్దతు తెలిపిన మోహన్ బాబు

  ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. పవన్‌కు ఆయన తన మార్కు పంచ్ వేశారు. టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకానికి ఆయన మద్దతు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న బాబు దేవుడని, అలాంటి దేవుడిని […]

టీటీడీ ఛైర్మన్ పదవి కోసం చాంతాడంతా క్యూ…

టీటీడీ ఛైర్మన్ పదవి కోసం చాంతాడంతా క్యూ…

  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పాలకమండలిలో ఛైర్మన్ పదవికి ఆశావాహులు క్యూ కడుతున్నారు. డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఉన్న ధర్మకర్తల మండలి కాలపరిమితి  ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం లభించని ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడుకి టిటిడి చైర్మన్ పదవి లభించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాలను వ్యతిరేకించకూడదనే నిర్ణయానికి […]

టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం  కొత్త ఈఓగా అనిల్ కుమార్ సింగాల్ బాద్యతలు స్వీకరించారు. శుక్రవారం నాడు  తిరుపతికి చేరుకున్న ఆయన అలిపిరి కాలిబాట గుండా నడుచుకుంటూ తిరుమలకి వెళ్లారు. అనంతరం రాత్రి సామాన్య భక్తునిలా భక్తులతో కలిసి వైకుంఠం నుండి ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం  స్వామి వారి సమక్షంలో  మాజీ ఈఓ సాంబశివరావు […]

ఏడాదిన్నర నుంచి సాగుతున్న తిరుచానూరు నిర్మాణాలు

ఏడాదిన్నర నుంచి సాగుతున్న తిరుచానూరు నిర్మాణాలు

  శ్రీవారి భక్తులకు ఇప్పటిలో వసతి కష్టాలు తీరేలా లేవు. తిరుచానూరు సమీపంలో 52 కోట్ల వ్యయంతో 220 గదులతో భారీ వసతి సముదాయాన్ని టిటిడి నిర్మిస్తోంది. అయితే నత్తనడకన ఇంజనీరింగ్‌ పనులు సాగుతున్నాయి. ఆ భవనం పూర్తవడానికి ఏడాదిపైనే పట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి శ్రీనివాసం, మాధవం, విష్ణునివాస […]

ఉత్సవ శోభ

ఉత్సవ శోభ

  తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రిపద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టిటిడి. వైశాఖ మాస శుక్ల పక్ష నవమి రోజున మొదలై ఏకాదశి రోజున ముగిసే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వీటినే అలంకరణ కల్యాణోత్సవాలుగా కూడా పిలుస్తారు. సుమారు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన స్వర్ణ మండపం […]

వీఐపీ దర్పానికి తగ్గేది లేదు

వీఐపీ దర్పానికి తగ్గేది లేదు

వీఐపీ కల్చర్ కు స్వస్తి పలికింది కేంద్రప్రభుత్వం. మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. వీఐపీల వాహనాలపై ఉండే ఎర్రబుగ్గను తొలగించారు. అయితే వీఐపీ హోదాకు చిహ్నంగా ఉండే ఎర్రబుగ్గను తొలగించడం ఇష్టం లేని కొందరు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఎర్రబుగ్గను తొలగించినా తమ వీఐపీ దర్పానికి ఢోకా లేకుండా తిరిగేస్తున్నారు. వీఐపీ కల్చర్ […]

టీటీడీ ఈవోగా అనిల్ కుమర్ సింఘాల్

టీటీడీ ఈవోగా అనిల్ కుమర్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న డాక్టర్ డి.సాంబశివరావును కీలకమైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలంగా కేంద్ర సర్వీసులో ఉన్న ప్రవీణ్‌ […]

తిరుమల కోండపై అడుగుంటున్న జలాశయాలు

తిరుమల కోండపై అడుగుంటున్న జలాశయాలు

తిరుమల కొండపై  జలశయాలు దాదాపుగా అడుగంటాయి. ఇప్పటికే గోగర్భం, ఆకాశగంగ డ్యాంలు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనం, కుమారధార-పసుపుధార జలాశయాలు దాదాపుగా అడుగంటాయి. వరుణుడు కరుణిస్తే తప్ప మరోమార్గం లేకపోవడంతో…టీటీడీ పాలకమండలి తెగ హైరానా పడుతోంది. తిరుమల కొండపై ఉన్నగోగర్భం, ఆకాశగంగ డ్యాములు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనంతోపాటు కుమారధార-పసుపుధార జంట ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా భారీగా తగ్గాయి. దీంతో […]

స్వామి వారి ప్రసాదంలో బొగ్గులు

స్వామి వారి ప్రసాదంలో బొగ్గులు

తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భక్తులు భావించే లడ్డూలో ఈసారి బొగ్గు పెళ్లలు వచ్చాయి. ఉచితంగా ఇచ్చే లడ్డూల్లో బొగ్గులు రావడంపై తీవ్ర ఆందోళన చెందిన భక్తులు విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్టు వదిలేశారని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తమపై ఓ అధికారి మండిపడ్డారని భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా, […]

టీటీడీ పాలకమండలికి సమావేశం

టీటీడీ పాలకమండలికి సమావేశం

భక్తులకు, ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ పాలకమండలికి మంగళవారంతో రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా బోర్డు చివరి సమావేశం జరిగింది. తమ జీవితాల్లో ఇది మరచిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు.భక్తులు రద్దితో పాటు శ్రీవారికి ఆదాయం పెరిగిందని అయన […]

ఇంటి దొంగలే.. దొరలు!

ఇంటి దొంగలే.. దొరలు!

పవిత్ర శ్రీవారి క్షేత్రం తిరుమలలో పాతిక రూపాయల లడ్డూని యాభై రూపాయలకు అమ్మితే సవాలక్ష ప్రశ్నలు, కేసులు,అరెస్ట్ లు, ఇంటరాగేషన్ లు. అదే కోట్ల రూపాయల సొమ్మును అప్పనంగా దోచుకుంటే మాత్రం అరెస్టులు కాదు కదా… కనీసం కేసులు కూడా ఉండవు. ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది టిటిడిలో. దొరికితే దొంగ. దొరక్క పోతే దొర అనేది […]