Tirumala News

ఉత్సవ శోభ

ఉత్సవ శోభ

  తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రిపద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టిటిడి. వైశాఖ మాస శుక్ల పక్ష నవమి రోజున మొదలై ఏకాదశి రోజున ముగిసే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వీటినే అలంకరణ కల్యాణోత్సవాలుగా కూడా పిలుస్తారు. సుమారు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన స్వర్ణ మండపం […]

వీఐపీ దర్పానికి తగ్గేది లేదు

వీఐపీ దర్పానికి తగ్గేది లేదు

వీఐపీ కల్చర్ కు స్వస్తి పలికింది కేంద్రప్రభుత్వం. మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. వీఐపీల వాహనాలపై ఉండే ఎర్రబుగ్గను తొలగించారు. అయితే వీఐపీ హోదాకు చిహ్నంగా ఉండే ఎర్రబుగ్గను తొలగించడం ఇష్టం లేని కొందరు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఎర్రబుగ్గను తొలగించినా తమ వీఐపీ దర్పానికి ఢోకా లేకుండా తిరిగేస్తున్నారు. వీఐపీ కల్చర్ […]

టీటీడీ ఈవోగా అనిల్ కుమర్ సింఘాల్

టీటీడీ ఈవోగా అనిల్ కుమర్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న డాక్టర్ డి.సాంబశివరావును కీలకమైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలంగా కేంద్ర సర్వీసులో ఉన్న ప్రవీణ్‌ […]

తిరుమల కోండపై అడుగుంటున్న జలాశయాలు

తిరుమల కోండపై అడుగుంటున్న జలాశయాలు

తిరుమల కొండపై  జలశయాలు దాదాపుగా అడుగంటాయి. ఇప్పటికే గోగర్భం, ఆకాశగంగ డ్యాంలు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనం, కుమారధార-పసుపుధార జలాశయాలు దాదాపుగా అడుగంటాయి. వరుణుడు కరుణిస్తే తప్ప మరోమార్గం లేకపోవడంతో…టీటీడీ పాలకమండలి తెగ హైరానా పడుతోంది. తిరుమల కొండపై ఉన్నగోగర్భం, ఆకాశగంగ డ్యాములు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనంతోపాటు కుమారధార-పసుపుధార జంట ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా భారీగా తగ్గాయి. దీంతో […]

స్వామి వారి ప్రసాదంలో బొగ్గులు

స్వామి వారి ప్రసాదంలో బొగ్గులు

తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భక్తులు భావించే లడ్డూలో ఈసారి బొగ్గు పెళ్లలు వచ్చాయి. ఉచితంగా ఇచ్చే లడ్డూల్లో బొగ్గులు రావడంపై తీవ్ర ఆందోళన చెందిన భక్తులు విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్టు వదిలేశారని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తమపై ఓ అధికారి మండిపడ్డారని భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా, […]

టీటీడీ పాలకమండలికి సమావేశం

టీటీడీ పాలకమండలికి సమావేశం

భక్తులకు, ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ పాలకమండలికి మంగళవారంతో రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా బోర్డు చివరి సమావేశం జరిగింది. తమ జీవితాల్లో ఇది మరచిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు.భక్తులు రద్దితో పాటు శ్రీవారికి ఆదాయం పెరిగిందని అయన […]

ఇంటి దొంగలే.. దొరలు!

ఇంటి దొంగలే.. దొరలు!

పవిత్ర శ్రీవారి క్షేత్రం తిరుమలలో పాతిక రూపాయల లడ్డూని యాభై రూపాయలకు అమ్మితే సవాలక్ష ప్రశ్నలు, కేసులు,అరెస్ట్ లు, ఇంటరాగేషన్ లు. అదే కోట్ల రూపాయల సొమ్మును అప్పనంగా దోచుకుంటే మాత్రం అరెస్టులు కాదు కదా… కనీసం కేసులు కూడా ఉండవు. ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది టిటిడిలో. దొరికితే దొంగ. దొరక్క పోతే దొర అనేది […]

తిరుమల ఘట్ రోడ్డులో ప్రమాదం, ఏడుగురికి గాయాలు

తిరుమల ఘట్ రోడ్డులో ప్రమాదం, ఏడుగురికి గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు సంభవించడం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతోంది. తాజాగా గురువారం నాడు  రెండవ కనుమ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వెంకన్నను దర్శించుకోవడానికి భక్తులతో వెళుతున్న బొలెరో వాహనం లింక్ రోడ్డు సమీపంలో మలుపు వద్ద  బస్సును ఢీకొట్టింది. కొండకు చేరుకునే సమయంలో టైర్‌ పేలి అదుపుతప్పిన వాహనం ఎదురుగా వస్తున్న బస్సుపైకి […]

తిరుమలలో  ఇంటి దొంగల బెడద

తిరుమలలో ఇంటి దొంగల బెడద

భక్తులకు అందాల్సిన లడ్డూలను నల్లబజారులోకి తరలిపోతున్నాయి. తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. భక్తుల అవసరాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. లడ్డూ దళారులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్‌ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, లడ్డూ ట్రే లిఫ్టర్లు.. ఇలా సామూహికంగా కలసిపోయి […]

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాల్వ శ్రీనివాసులు.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాల్వ శ్రీనివాసులు.

  మంత్రి కాల్వ శ్రీనివాసులు సోమవారం ఉదయం తిరుమలలో స్వామి వారికి జరిగే సుప్రభాత సేవ లో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి అయనకు దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు అలాగే గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి […]

పది వారాల పాటు వీ ఐపీ దర్శనాల కుదింపు

పది వారాల పాటు వీ ఐపీ దర్శనాల కుదింపు

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. పరిక్షలు రాసి ఉత్తీర్ణులైన విధ్యార్థులు వారి కుటుంబ సభ్యులు బారీగా తిరుమలకు తరలిరానున్నారు. వేసవి సెలవులు అంటే చాలు టీటీడీ అధికారుల గుండెల్లో గుబులు పుడుతుంది. శ్రీవారి దర్శనానికి అంచనాకి మించి భక్తులు తిరుమలకు వస్తుంటారు. టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసిన చివరికి భక్తుల చెంతకు చేరే సరికి […]

శ్రీవారి సేవలో రంభ దంపతులు

శ్రీవారి సేవలో రంభ దంపతులు

సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే పారిశ్రామికవేత్తను రంభ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య […]

టీటీడీ వద్ద మూలుగుతున్న రద్దైన పెద్దనోట్లు

టీటీడీ వద్ద మూలుగుతున్న రద్దైన పెద్దనోట్లు

పెట్టనోట్లు రద్దై ఇప్పటికి దాదాపు నాలుగు నెలలు దాటింది. రద్దైన నోట్ల స్థానంలో కోత్త నోట్లు అములులోకి వచ్చి 5 నెలలు కావస్థున్నది. అయినా ఎక్కడెక్కడ దాటి పెట్టుకున్నారో తెలియదు కానీ దేశంలోని ప్రజలు 500, 1000 రు,, నోట్లను ఇంకా బయటపెడుతూనే ఉన్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా…పరోక్షంగా వాటిని మార్చుకునే ప్రయత్నాలు మొన్న మార్చి 31 […]

శ్రీవారి భక్తులకు చేదు వార్త : రూ.50 సుదర్శన టిక్కెట్లు రద్దు

శ్రీవారి భక్తులకు చేదు వార్త : రూ.50 సుదర్శన టిక్కెట్లు రద్దు

శ్రీవారి భక్తులకు ఇది నిజంగా చేదు వార్తే. ఎన్నో సంవత్సరాల పాటు సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టిక్కెట్లు రద్దయ్యాయి. విడతల వారీగా ఈ టికెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల (ఏప్రిల్) 1 నుంచి పూర్తిస్థాయిలో సుదర్శనం టిక్కెట్లను […]

సంచలనం సృష్టించిన ‘ఇన్‌సైడ్‌ తిరుమల తిరుపతి’

సంచలనం సృష్టించిన ‘ఇన్‌సైడ్‌ తిరుమల తిరుపతి’

తిరుమల శ్రీనివాసుడి వైభవంపై నేషనల్ జియాగ్రఫిక్ చానల్లో సోమవారం రాత్రి ప్రసారమైన ‘ఇన్‌సైడ్‌ తిరుమల తిరుపతి’ కార్యక్రమాన్ని దేశవిదేశాల్లోని కోట్లాది మంది భారతీయులు వీక్షించి పులకరించిపోయారు. ఈ ఘనమైన డాక్యుమెంటరీని ప్రఖ్యాత డాక్యుమెంటరీ దర్శకుడు రాజేంద్ర శ్రీవత్స కొండపల్లి చిత్రీకరించడం విశేషం. నేషనల్ జియాగ్రఫిక్ చానల్ ప్రత్యేక కార్యక్రమం కింద తిరుమల క్షేత్రం పవిత్రత మొదలు.. […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com