International

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు లభించిన నేపథ్యంలో తాజాగా ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత కల్పించింది. వివరాల్లోకి వెళితే ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. వీరిలో ఓ నటుడు కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో […]

మళ్లీ అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు

మళ్లీ అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. గత వారం పది రోజులు స్తబ్దుగా ఉన్న అమెరికా, ఉత్తర కొరియాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. అమెరికాను చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి తయారీ తుది దశకు చేరుకుందంటూ […]

రాణి డయానా గురించి షాకింగ్‌ న్యూస్‌

రాణి డయానా గురించి షాకింగ్‌ న్యూస్‌

కారు ప్రమాదంలో చనిపోయిన బ్రిటన్‌ యువరాణి డయానాకు సంబంధించి ఒక షాకింగ్‌ విషయం తెలిసింది. పెళ్లి అయిన పది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆమె తన రెండు చేతుల మణికట్టులను రేజర్‌ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె తన సొంతమాటల్లో చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డులు […]

పాములాగా ఆ చిన్నారి కుబుసం విడుస్తోంది

పాములాగా ఆ చిన్నారి కుబుసం విడుస్తోంది

అమెరికాలోని ఊల్టెవాకు చెందిన ఆరేళ్ల చిన్నారి హన్నా బారోట్ ఇప్పుడు వైద్యులకు సవాలుగా మారింది. పాము కుబుసం విడిచినట్టు ఈ చిన్నారి చర్మం రోజూ రాలిపోతోంది. ఆ వెంటనే కొత్త చర్మం పుట్టుకొస్తోంది. కొత్త చర్మ కణాలు అత్యంత వేగంగా పుట్టుకు రావడం వైద్యులను విస్మయ పరుస్తోంది. చిన్నారి లామెల్లర్ ఇచ్‌థైయోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు […]

లిబియాలో విషాదం.. పడవ మునిగి 10 మంది మృతి

లిబియాలో విషాదం.. పడవ మునిగి 10 మంది మృతి

లిబియాలో మరోమారు విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ లిబియా తీరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 100 మంది గల్లంతైనట్టు తీర రక్షక దళం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గురైన సమయంలో పడవలో 120 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. లిబియాలో […]

భారత్ పై ప్రభావం చూపించనున్న గల్ఫ్ గోడవ

భారత్ పై ప్రభావం చూపించనున్న గల్ఫ్ గోడవ

ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటి ఖతార్. ఈ గల్ఫ్ దేశంతో సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, మాల్దీవులు, బహ్రెయిన్ వంటి దేశాలు ఆర్థిక, దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా ప్రకటించడం భారత్ పై పెను ప్రభావం చూపే అంశంగా మారింది. ఖతార్ ఉగ్రవాద సంస్థలకు అండగా ఉంటోందని, అందుకే ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా ఆయా […]

ఉల్లాసంగా..ఉత్సాహంగా టీఏజీసీ వనభోజనాలు

ఉల్లాసంగా..ఉత్సాహంగా టీఏజీసీ వనభోజనాలు

అందరూ మెచ్చే సేవా కార్యక్రమాలు చేస్తూ చికాగో మహా నగర తెలుగు సంస్థ, టీఏజీసీ (TAGC) సేవకు మారుపేరుగా నిలుస్తోంది. ప్రతియేటా వేసవిని ఆహ్వానిస్తూ చికాగో పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు వారికీ వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈసారి చికాగో శివారు ఎల్క్ గ్రోవ్ గ్రామంలోని బస్సే వుడ్స్ అటవీ ప్రాంతంలో […]

వాళ్లు వస్తూనే కొట్టుకుంటూ వచ్చారు : లాడెన్ భార్య

వాళ్లు వస్తూనే కొట్టుకుంటూ వచ్చారు : లాడెన్ భార్య

మే ఒకటో తేదీన ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టింది..అయితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై ఆయన భార్య చెప్పిన విషయాలు చర్చనీయాంశాలయ్యాయి. వాళ్లు అమెరికా సైనికులు లోపలిక వస్తూ లాడెన్‌ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవపడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని […]

ఆ పర్వతం మనుషుల్ని తినేస్తోంది!

ఆ పర్వతం మనుషుల్ని తినేస్తోంది!

పర్వతం మనుషుల్ని తినేయడం ఏంటని షాక్‌ అయ్యారా! కానీ మీరు విన్నది నిజమే. నైరుతి బొలివియాలోని సెర్రోరికో అనే పర్వతం దాదాపు ఐదు శతాబ్దాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలను బలితీసుకుందట. అలా అని ఈ పర్వతానికి అతీంద్రియ శక్తులేమీ లేవు. కానీ అంతమందిని ఎలా పొట్టన పెట్టుకుందో మీరే చదవండి! బొలివియాలోని సెర్రోరికో పర్వతంలో వెండి […]

ల్యాప్ టాప్ చూస్తే వణికిపోతున్న అమెరికా

ల్యాప్ టాప్ చూస్తే వణికిపోతున్న అమెరికా

నన్ను మించినవారు ఈ ప్రపంచంలోనే లేరంటూ జబ్బలు చరుచుకుని పెత్తనం చేసే పెద్దన్న అమెరికా ఇప్పుడు చిన్న ల్యాప్ టాప్ ను చూసి భయపడిపోతోంది. భర్తలను శాసించే భార్య చిన్న బొద్దింకకు భయపడినట్లుగా అంగబలం అర్థబలంలో అన్ని దేశాల కంటే టాప్ లో ఉన్న అమెరికాకు ఇప్పుడు ల్యాప్ టాప్ ఫోబియా పట్టుకుంది.. ల్యాప్ టాప్ […]

హెచ్1బీ వీసా భారతీయులకు శుభవార్త

హెచ్1బీ వీసా భారతీయులకు శుభవార్త

అమెరికా అంటేనే బెంబేలెత్తిపోయే వార్తలు వస్తున్న సమయంలో అనూహ్యమైన తీపికబురు వినిపించింది. అది కూడా విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించే వార్త కావడం విశేషం. హెచ్1బీ వీసాల విషయంలో మన విద్యార్థులకు మేలు చేసే బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసాల మార్గదర్శకాలను ప్రభావితం చేసే ఈ బిల్లు భారతీయ విద్యార్థులకు పెద్ద […]

కిమ్ తో ఎప్పటికైనా ప్రమాదమే : డోనాల్డ్ ట్రంప్

కిమ్ తో ఎప్పటికైనా ప్రమాదమే : డోనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్‌‌ను చూస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎప్పుడు.. ఎక్కడ తమపై అణ్వాయుధాలతో దాడి చేస్తాడోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చేతిలో అణ్వాయుధాలున్న పిచ్చోడుగా కిమ్‌ను ట్రంప్ అభివర్ణించాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోతో ట్రంప్‌ గత నెలలో జరిగిన అంతరంగిక ఫోన్ సంభాషణ […]

సీలైన్‌ బాలికను లాగేసింది

సీలైన్‌ బాలికను లాగేసింది

భయానకరీతిలో ఓ సీలైన్‌ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ బాలిక సముద్రం డాక్‌పై కూర్చోని నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది. సీలైన్‌ డాక్‌ ఒడ్డుకు రావడంతో దానిని చూసి మరింత ముచ్చటపడింది. ఇంతలో ఆ బాలిక డాక్‌ అంచుల మీద కూర్చోగా […]

ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్

ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్

వానా క్రై రాన్సమ్ వేర్ అటాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో బిగ్ షాకింగ్ న్యూస్. ఇలాంటి భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఈసారి దాడి డిఫరెంటుగా ఉంటుందని, మరింత డేంజరస్ అని రాన్సమ్ వేర్ నెక్స్ట్ టార్గెట్ స్మార్టుఫోన్లేనని ఇండియన్ కంప్యూటర్ […]

అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం…జాదవ్‌ ఉరిశిక్షపై స్టే

అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం…జాదవ్‌ ఉరిశిక్షపై స్టే

  అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం సాధించింది. కులభూషణ   జాదవ్ కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇచ్చింది. మరణశిక్ష అమలు నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  తుది తీర్పు వెలువరించే వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఐసీజే ఆదేశించింది. 11 మంది న్యాయమూర్తలు అంతర్జాతీయ […]