World News

చైనాలో కొండ చరియల కింద గ్రామం

చైనాలో కొండ చరియల కింద గ్రామం

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల మూలంగా విరిగిపడిన కొండచరియలు కింద దాదాపు 140 మంది చిక్కుకున్నారు. చైనాలోని సిచువన్ ప్రాంతంలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం గ్రామం మొత్తం శిథిలాల కింద చిక్కుకుంది. దాదాపు 46 ఇళ్లపై భారీ కొండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో, సుమారు 140 మందికి పైగా […]

పాప్ సింగర్ కార్లా బ్రూనీతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్?

పాప్ సింగర్ కార్లా బ్రూనీతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్?

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టకముందు డోనాల్డ్ ట్రంప్ మంచి శృంగారపురుషుడే. ఆ దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తల్లో ఈయన ఒకరు. పైగా అనేక మందితో రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఈ కోవలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పని చేసిన నికోలస్ సర్కోజీ భార్య, పాప్ సింగర్ కార్లా బ్రూనీతో కూడా ఈయనగారి ఎఫైర్ ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. […]

Choi Jung-yoon shows a product at her sex toy shop in Seoul, South Korea, December 16, 2015.  REUTERS/Kim Hong-Ji

యూరోపియన్ దేశాల్లో సెక్స్ టాయ్స్ తోనే పని…

సెక్సువల్ వెల్ నెస్ ప్రోడక్ట్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఇవి ఊపేస్తున్నాయి యూరోపియన్ దేశాలు అయితే శృంగారానికి భాగస్వామి అవసరం లేదు, సెక్స్ టాయ్స్ ఉంటే చాలన్నట్టుగా తయారయ్యాయి. శృంగారంలో స్వయంతృప్తి మార్గాన్ని అనుసరించడం అనారోగ్యకరం ఏమీ కాదని వైద్యులు ధ్రువీకరిస్తుండటం, వివిధ సామాజిక, సాంస్కృతిక కారణాల చేత చాలా దేశాల్లో సెక్స్ టాయ్స్ వంటి వాటికి […]

అడవిలో కార్చిచ్చు.. 43 మంది సజీవ దహనం

అడవిలో కార్చిచ్చు.. 43 మంది సజీవ దహనం

పోర్చుగల్‌లోని ఓ అడవిలో రగిలిన కార్చిచ్చు దావానలంలా వ్యాపించి రోడ్డు పక్కనే ఉన్న కార్లకు అంటుకుంది. ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కారులో కూర్చున్న వాళ్లు కూర్చున్నట్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 160 అగ్నిమాపక […]

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు లభించిన నేపథ్యంలో తాజాగా ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత కల్పించింది. వివరాల్లోకి వెళితే ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. వీరిలో ఓ నటుడు కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో […]

మళ్లీ అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు

మళ్లీ అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. గత వారం పది రోజులు స్తబ్దుగా ఉన్న అమెరికా, ఉత్తర కొరియాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. అమెరికాను చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి తయారీ తుది దశకు చేరుకుందంటూ […]

రాణి డయానా గురించి షాకింగ్‌ న్యూస్‌

రాణి డయానా గురించి షాకింగ్‌ న్యూస్‌

కారు ప్రమాదంలో చనిపోయిన బ్రిటన్‌ యువరాణి డయానాకు సంబంధించి ఒక షాకింగ్‌ విషయం తెలిసింది. పెళ్లి అయిన పది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆమె తన రెండు చేతుల మణికట్టులను రేజర్‌ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె తన సొంతమాటల్లో చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డులు […]

ఆసియాలో ఆలీబాబా క్లౌడ్ డేటా సెంటర్లు

ఆసియాలో ఆలీబాబా క్లౌడ్ డేటా సెంటర్లు

అంతర్జాతీయ షాపింగ్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌నకు చెందిన ఆలీబాబా క్లౌడ్ దేశీయంగా డేటా సెంటర్లను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ , ఇండోనేషియాలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లోని ముంబైలో రెండు, ఇండోనేషియాలో జకార్తాలో ఒక కొత్త డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆలీబాబా క్లౌడ్ ప్రకటించింది. భారతదేశం […]

పాములాగా ఆ చిన్నారి కుబుసం విడుస్తోంది

పాములాగా ఆ చిన్నారి కుబుసం విడుస్తోంది

అమెరికాలోని ఊల్టెవాకు చెందిన ఆరేళ్ల చిన్నారి హన్నా బారోట్ ఇప్పుడు వైద్యులకు సవాలుగా మారింది. పాము కుబుసం విడిచినట్టు ఈ చిన్నారి చర్మం రోజూ రాలిపోతోంది. ఆ వెంటనే కొత్త చర్మం పుట్టుకొస్తోంది. కొత్త చర్మ కణాలు అత్యంత వేగంగా పుట్టుకు రావడం వైద్యులను విస్మయ పరుస్తోంది. చిన్నారి లామెల్లర్ ఇచ్‌థైయోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు […]

లిబియాలో విషాదం.. పడవ మునిగి 10 మంది మృతి

లిబియాలో విషాదం.. పడవ మునిగి 10 మంది మృతి

లిబియాలో మరోమారు విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ లిబియా తీరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 100 మంది గల్లంతైనట్టు తీర రక్షక దళం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గురైన సమయంలో పడవలో 120 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. లిబియాలో […]

చైనాకు భారత్ ధ్యాంక్స్

చైనాకు భారత్ ధ్యాంక్స్

  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో సహకరించినందుకు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కజగిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరుగుతున్న ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ..శుక్రవారం చైనా అధ్యక్షుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ఈ సమావేశం సందర్భంగా మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం లభించింది. ఎస్‌సీవోలో భారత్‌కు సభ్యత్వం […]

బ్రిటన్ ప్రధాని ధెరిస్సాకు షాక్…

బ్రిటన్ ప్రధాని ధెరిస్సాకు షాక్…

  ముందస్తు ఎన్నికలతో ముందుకెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను గెలుపొందడంలో థెరిసా మే నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ విఫలమైంది. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొంది. మొత్తం 650 స్థానాలకుగాను ఇప్పటి వరకూ 643 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. కన్జర్వేటివ్‌ పార్టీ 313 […]

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ‘అమేజాన్’ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ప్రొడక్టుల కోసం వెతుకున్న వారికి కుక్కల బొమ్మలు కనిపిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఎంతో మంది ఈ విషయమై ఫిర్యాదులు చేయడంతో అమేజాన్ సైతం స్పందించింది. “మా వైపు నుంచే ఏదో తప్పు జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం” అని అమేజాన్ […]

భారత్ పై ప్రభావం చూపించనున్న గల్ఫ్ గోడవ

భారత్ పై ప్రభావం చూపించనున్న గల్ఫ్ గోడవ

ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటి ఖతార్. ఈ గల్ఫ్ దేశంతో సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, మాల్దీవులు, బహ్రెయిన్ వంటి దేశాలు ఆర్థిక, దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా ప్రకటించడం భారత్ పై పెను ప్రభావం చూపే అంశంగా మారింది. ఖతార్ ఉగ్రవాద సంస్థలకు అండగా ఉంటోందని, అందుకే ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా ఆయా […]

ఉల్లాసంగా..ఉత్సాహంగా టీఏజీసీ వనభోజనాలు

ఉల్లాసంగా..ఉత్సాహంగా టీఏజీసీ వనభోజనాలు

అందరూ మెచ్చే సేవా కార్యక్రమాలు చేస్తూ చికాగో మహా నగర తెలుగు సంస్థ, టీఏజీసీ (TAGC) సేవకు మారుపేరుగా నిలుస్తోంది. ప్రతియేటా వేసవిని ఆహ్వానిస్తూ చికాగో పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు వారికీ వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈసారి చికాగో శివారు ఎల్క్ గ్రోవ్ గ్రామంలోని బస్సే వుడ్స్ అటవీ ప్రాంతంలో […]