World News

ట్రంప్‌, పుతిన్ ర‌హ‌స్య భేటి

ట్రంప్‌, పుతిన్ ర‌హ‌స్య భేటి

అగ్ర‌ దేశాధినేత‌లు పుతిన్‌, ట్రంప్ ర‌హ‌స్యంగా క‌లుసుకున్నారు. ఇటీవ‌ల హాంబ‌ర్గ్‌లో జ‌రిగిన జీ20 దేశాల స‌ద‌స్సులో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ రెండ‌వసారి ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రూ ఓ గంట పాటు చ‌ర్చ‌లు నిర్వ‌హించిన‌ట్లు కూడా సమాచారం. ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు వైట్‌హౌజ్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. […]

ప్రపంచమంతా శాఖాహారులైతే ఎలా ఉంటుంది..

ప్రపంచమంతా శాఖాహారులైతే ఎలా ఉంటుంది..

ప్రపంచం మొత్తం ఒక వేళ శాఖాహారులైతే ఏమవుతుంది… అలా జరిగితే దాదాపు 70 లక్షల మరణాలు తక్కువవుతాయట… 2050 నాటికి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు శాఖాహారం తింటే ఇది సాధ్యమేనని అధ్యయనకారులు తెలిపారు. నిజానికి శాఖాహారం తింటే గుండె జబ్బులు రావట. డయాబెటిస్, గుండె పోటుతోసహా క్యాన్సర్ కు సంబంధించిన అనేక రోగాలు మటుమాయమవుతాయట. […]

ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య సూపర్ అన్న ట్రంప్

ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య సూపర్ అన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తోటి దేశాధ్యక్షుడి భార్యను మోతాదుకు మించి పొగడడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. గురువారం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ దంపతులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ ప్రధమ మహిళ బ్రిగెట్టే మేక్రాన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్, సంప్రదాయపూర్వకంగా ముద్దు […]

WWE Chairman Vince McMahon, center, held by "Stone Cold" Steve Austin, prepares to have his hair cut off by Donald Trump, left, and Bobby Lashley, right, after Lashley defeated Umaga at Wrestlemania 23 at Ford Field in Detroit, Sunday, April 1, 2007. (AP Photo/Carlos Osorio)

పదేళ్ళనాటి వీడియోతో హీటెక్కించిన ట్రంప్

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ మీడియా మీద చిందులేశాడు. సోషల్ మీడియాను తన ఇష్టం వచ్చినట్టు వినియోగించుకుంటానని. మోడరన్ డే (ఈనాటి) ప్రెసిడెంట్ (అధ్యక్షుడు) అంటే ఇలాగే ఉండాలని అంటున్నాడు. తన ట్విటర్ ఖాతాలో ఓ మార్ఫ్ డ్ వీడియో పోస్ట్ చేసి మీడియా మీద తన కసి తీర్చుకున్నాడు. ఎప్పటిదో పదేళ్ళ నాటి […]

తీవ్రవాద సంస్థలతో బంధం తెంచుకోండి

తీవ్రవాద సంస్థలతో బంధం తెంచుకోండి

ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తోందని ఆరోపిస్తూ ఖతార్‌తో నాలుగు గల్ఫ్ దేశాలు ఇటీవల సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో ఖతార్‌ దౌత్య సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ పరిస్థితి నుంచి ఖతార్‌ బయటపడాలంటే తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని సౌదీ, బహ్రెయిన్, యూఏఈ, ఈజిప్టు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన లేఖను ఖతార్‌కు పంపించాయి. ఈ లేఖపై అమెరికా, కువైట్‌లతో […]

పాకిస్తాన్, చైనాలపై డ్రోన్ల నిఘా

పాకిస్తాన్, చైనాలపై డ్రోన్ల నిఘా

భారత సైన్యం  దగ్గర ఇప్పటికే 200 వరకు మానవరహిత డ్రోన్లు ఉన్నాయి. వీటిని ఇజ్రాయిల్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇవి కాకుండా అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు కూడా భారత్ ఒప్పందం చేసుకుంది. రూ.12 వేల కోట్లతో 22 డ్రోన్లను కొనాల్సిన అవసరం ఏముంది? వీటి గొప్పదనం ఏంటి? అనే ప్రశ్న మదిలో […]

ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ

ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తన తొలి యూఎస్ పర్యటనను ముగించుకునే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఓ అద్భుతమైన కానుకను అందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చిత్రంతో ఉన్న ఓ స్టాంపును ఆయనకు బహుమతిగా అందించారు. దీన్ని అందుకున్న ట్రంప్ కాసేపు ఆశ్చర్యంగా చూసి, ఇది […]

యూసఫ్ షా అంతర్జాతీయ ఉగ్రవాదే

యూసఫ్ షా అంతర్జాతీయ ఉగ్రవాదే

ఉగ్రవాదన్ని వెనకేసుకొస్తున్న పాకిస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ అండతో భారత్ లో ఉగ్రదాడులు చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ అలియాస్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ షాను  అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ కు ముందే ఆ […]

అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

భారతదేశం తనను తాను రక్షించుకోగలదని చెప్పేందుకు సర్జికల్ దాడులే ప్రబల సాక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భద్రత కోసం వేరొకరిపై ఆధారపడాల్సిన పనిలేదని.. అవసరమైతే మనదేశం తన కాళ్లపై తాను నిలబడగలదని ఈ దాడులు రుజువుచేశాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. వాషింగ్టన్ డీసీ వేదికగా భారతీయులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. భారత […]

చైనాలో కొండ చరియల కింద గ్రామం

చైనాలో కొండ చరియల కింద గ్రామం

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల మూలంగా విరిగిపడిన కొండచరియలు కింద దాదాపు 140 మంది చిక్కుకున్నారు. చైనాలోని సిచువన్ ప్రాంతంలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం గ్రామం మొత్తం శిథిలాల కింద చిక్కుకుంది. దాదాపు 46 ఇళ్లపై భారీ కొండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో, సుమారు 140 మందికి పైగా […]

పాప్ సింగర్ కార్లా బ్రూనీతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్?

పాప్ సింగర్ కార్లా బ్రూనీతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్?

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టకముందు డోనాల్డ్ ట్రంప్ మంచి శృంగారపురుషుడే. ఆ దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తల్లో ఈయన ఒకరు. పైగా అనేక మందితో రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఈ కోవలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పని చేసిన నికోలస్ సర్కోజీ భార్య, పాప్ సింగర్ కార్లా బ్రూనీతో కూడా ఈయనగారి ఎఫైర్ ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. […]

Choi Jung-yoon shows a product at her sex toy shop in Seoul, South Korea, December 16, 2015.  REUTERS/Kim Hong-Ji

యూరోపియన్ దేశాల్లో సెక్స్ టాయ్స్ తోనే పని…

సెక్సువల్ వెల్ నెస్ ప్రోడక్ట్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఇవి ఊపేస్తున్నాయి యూరోపియన్ దేశాలు అయితే శృంగారానికి భాగస్వామి అవసరం లేదు, సెక్స్ టాయ్స్ ఉంటే చాలన్నట్టుగా తయారయ్యాయి. శృంగారంలో స్వయంతృప్తి మార్గాన్ని అనుసరించడం అనారోగ్యకరం ఏమీ కాదని వైద్యులు ధ్రువీకరిస్తుండటం, వివిధ సామాజిక, సాంస్కృతిక కారణాల చేత చాలా దేశాల్లో సెక్స్ టాయ్స్ వంటి వాటికి […]

అడవిలో కార్చిచ్చు.. 43 మంది సజీవ దహనం

అడవిలో కార్చిచ్చు.. 43 మంది సజీవ దహనం

పోర్చుగల్‌లోని ఓ అడవిలో రగిలిన కార్చిచ్చు దావానలంలా వ్యాపించి రోడ్డు పక్కనే ఉన్న కార్లకు అంటుకుంది. ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కారులో కూర్చున్న వాళ్లు కూర్చున్నట్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 160 అగ్నిమాపక […]

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు లభించిన నేపథ్యంలో తాజాగా ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత కల్పించింది. వివరాల్లోకి వెళితే ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. వీరిలో ఓ నటుడు కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో […]

మళ్లీ అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు

మళ్లీ అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. గత వారం పది రోజులు స్తబ్దుగా ఉన్న అమెరికా, ఉత్తర కొరియాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. అమెరికాను చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి తయారీ తుది దశకు చేరుకుందంటూ […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com