Home > Editorial > మోడీలో కనిపిస్తున్న మార్పులు

మోడీలో కనిపిస్తున్న మార్పులు

రాహూల్ గాంధీ విశ్వాసం కల్గిస్తారా...
అన్నంపై జీఎస్టీ భారం

narendramodi-apduniaమూడేండ్ల పాలనా అనుభవమో, ఇంటా బయటా ఎదురవుతున్న విమర్శనాస్ర్తాలో ఏమో గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో మార్పు కనిపిస్తున్నది. పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎదురే లేదన్నట్లుగా తనదైన శైలిలో పాలనా విధాన నిర్ణయాల్లో దూకుడుగా వ్యవహరించారు. కానీ మోదీ మొదటిసారి ఎవరి విమర్శలనైనా స్వీకరిస్తామనటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయనలో వచ్చిన మార్పునకు ఇది సంకేతం. ఢిల్లీలో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా 50వ వార్షికోత్సవాల ప్రారంభ వేడుకను వేదికగా చేసుకొని చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రజాకర్షక విధానాల తో ప్రశంసలు పొందడం కన్నా సంస్థాగత సంస్కరణలు తీసుకురావటానికి ప్రాధాన్యమిస్తామన్నారు. మందగించిన జీడీపీ వృద్ధిరేటుపై ప్రతిపక్షాలతో పాటు, బీజేపీ పాతకాపుల నుంచి ఎదురవుతున్న విమర్శలను నిరాశావాదుల మాటలని తిప్పికొడుతూనే, విమర్శలు ఎంతటివై నా స్వీకరిస్తామన్నారు. వాటితో అవసరమైనచోట మార్పులు చేసుకుంటామని తెలుపడం మం చి పరిణామం.తన సంస్కరణల బాట కొనసాగుతుంది అన్నారు. తాత్కాలిక అవరోధాలను చూసి బెంబేలెత్తాల్సిన అవసరం లేదని ప్రధాని భరోసా ఇస్తున్నారు. తగ్గిన స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటును పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి సంశయించబోమన్నారు. గత రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు 5.7గా నమోదైంది. దీన్నే పెద్ద వినాశనంగా చెబుతున్న వారు పది శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని 2.5 శాతానికి తగ్గించాం. కానీ దాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారని విమర్శించారు. రానున్నరోజుల్లో క్రమంగా ఆశించినస్థాయిలో వృద్ధిరే టు చేరుకుంటుందని అన్నారు. దీనికోసం అవసరమైతే ఎలాం టి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని వివరణ ఇచ్చారు. మోదీ సహజశైలికి భిన్నంగా ఉన్న ఈ వివరణల వెనుక పెద్ద కారణమే ఉన్నది. మోదీ ఎన్నికల సందర్భంలో చెప్పిన విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెనక్కి తెస్తామన్న మాట ఆచరణ సాధ్యం కాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టి దేశాన్ని ఆర్థికాభివృద్ధికి జవం, జీవంగా మారుతాయన్న పెద్దనోట్ల రద్దు, వస్తుసేవలపన్ను విధానం ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ జనాని కి కష్టాలే మిగిల్చాయన్నది సత్యం. ఈ నేపథ్యంలోంచే జీఎస్టీ అమలులో చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించాల్సిందిగా జీఎస్టీ మండలిని కోరారు. జీఎస్టీలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దుతామనడం ముదావహం.ఎనభైయవ దశకంలో రెండు పార్లమెంటు సీట్లకే పరిమితమైన బీజేపీని ఎల్‌కే అద్వానీ రథయాత్ర పేరుతో, రామజన్మభూమి అంశంతో నిర్ణయాత్మకశక్తిగా మార్చారు. వాజపేయికి ఉన్న వ్యక్తిగత పలుకుబడి, త్యాగశీలత, కార్యదక్షత ఆయన్ను సంకీర్ణప్రభుత్వాధినేతగా చేసినా అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఈ నేపథ్యంలో ఏనాటికైనా బీజేపీ తన సొంత కాళ్లపై నిలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే కాలం వస్తుందా అన్న సందేహం ఉండేది. ఈ తరుణంలో ఎవరూ ఊహించని రీతిలో బీజేపీకి ఢిల్లీ పీఠాన్ని అందించిన ఘనత మోదీకి దక్కింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. అంతేకాదు బీజేపీలోనూ ఎదురులేని నేతగా ఎదిగివచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో అద్వానీ, యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ లాంటి పాతతరం నాయకత్వాన్ని పూర్తిగా పక్క కుపెట్టే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తనదైన దూకుడుతో అభివృద్ధి విధానంతో ఎంతపేరు సంపాదించుకున్నారో, ఆ రాష్ట్రంలో జరిగిన మత కలహాలతో నూ వివాదాస్పదమయ్యారు. చివరికి అదే దూకుడు ఆయనకు బలంగా మారింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రధానిగా తనదైన ముద్రతో విధా న నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్రానంతర ఆధునిక భారతాన్ని రూపుదిద్దటంలో తనదైన పాత్ర వహించిన ప్రణాళికా సం ఘాన్ని రద్దు చేశారు. నల్లడబ్బును వెలికితీసే పేర ఎలాంటి కసరత్తు లేకుండానే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాల తర్వాత జనం ఎదుర్కొన్న కష్టా లు, కన్నీళ్లు వాస్తవాన్ని చూపాయి. ఈ పరిస్థితుల్లోంచే బీజేపీలో అంతర్గతంగా రగులుతున్న అసమ్మతి యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరీ రూపంలో బహిర్గతమైంది. ఒకరకంగా మోదీ ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాల విమర్శలకన్నా, సొంతపార్టీ అసమ్మతి సెగలే మోదీ మాటల్లో మెత కతనాన్ని తీసుకువచ్చాయి. ఇప్పటికైనా మోదీ రాజకీ య, ఆర్థిక విధానాల అమలులో పునరాలోచనలకు బీజం పడటం ఆహ్వానించదగినది. దేశ సమగ్రాభివృద్ధికి, శాంతియుత సహజీవనానికి ఆవశ్యకమైనది. మరో వైపు నల్లడబ్బును వెలికితీసే పేర ఎలాంటి కసరత్తు లేకుండానే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాల తర్వాత జనం ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు వాస్తవాన్ని చూపాయి. ఈ పరిస్థితుల్లోంచే బీజేపీలోఅంతర్గతంగా రగులుతున్న అసమ్మతి యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరీ రూపంలో బహిర్గతమైంది. ఒకరకంగా మోదీ ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాల విమర్శలకన్నా, సొంతపార్టీ అసమ్మతి సెగలే మోదీ మాటల్లో మెత కతనాన్ని తీసుకువచ్చాయి.ఇప్పటికైనా మోదీ రాజకీయ, ఆర్థిక విధానాల అమలులో పునరాలోచనలకు బీజం పడటం ఆహ్వానించదగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *