Home > Politics > ఉరవ కొండలో బాబు సీఎల్ ఐడీ పధకానికి శంకుస్థాపన

ఉరవ కొండలో బాబు సీఎల్ ఐడీ పధకానికి శంకుస్థాపన

నిర్మల బాధ్యతలు స్వీకరించారు...
11 నుంచి ఇంటింటికి టీడీపీ

chandrababu-naidu-apduniaఅనంతపురం జిల్లాకు ప్రభుత్వం రూ.899.20 కోట్ల భారీ అంచనా వ్యయంతో ‘కమ్యూనిటీ లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ (సిఎల్‌డిఐ)’ పథకాన్ని తక్షణం అమలులోకి తెస్తోంది. అందుబాటులో ఉన్న నీటి నిల్వలను వినియోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రతి పంటకూ నీటిని సరఫరా చేసేందుకు, ప్రతి రైతూ ప్రయోజనం పొందేందుకు వినూత్న రీతిలో చర్యలు చేపట్టింది. . ఉరవకొండ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈవినూత్న ప్రాజెక్టు ద్వారా పిఎబిఆర్ కుడి, ఎడమ, ఎంపిఆర్, జీడిపల్లి రిజర్వాయర్ల పరిధిలోని 20,000 హెక్టార్లను సాగులోకి తేనున్నారు. సిఎల్‌డిఐ-1 కింద మిడ్‌పెన్నార్ ప్రాజెక్టు(ఎంపిఆర్) పరిధిలో రూ.213.52, సిఎల్‌డిఐ-2లో పిఎబిఆర్ ఎడమ కాలువ పరిధిలో రూ.231.46, సిఎల్‌డిఐ-3 కింద పిఎబిఆర్ కుడి కాలువ పరిధిలో రూ.217.17, సిఎల్‌డిఐ-4 కింద రూ.227.95 కోట్ల మేరకు మంజూరయ్యాయి. వీటితోపాటు పిఎంకెఎస్‌వై నిధులు రూ.271 కోట్లు వినియోగించుకోవచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగతా నిధులను సాధారణ రాష్ట్ర ప్రణాళిక వెసులుబాటును బట్టి వాడుకోవచ్చని సూచించారు. కర్ణాటకలో అమలవుతున్న రామ్‌థాల్ కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు మాదిరిగానే జిల్లా లో మోడల్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు. కాగా ఎంపిఆర్ పరిధిలో 5,193 హెక్టార్ల ఆయకట్టును లి ఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వా రా మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి నీటి ఎత్తిపోతల ద్వారా సాగులోకి తేనున్నారు. ఒక్కో హెక్టారకు రూ.4,1 2,785 కోట్లు వ్యయం చేనున్నారు. ఇందుకోసం 30 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌కు 171.1 హెక్టార్లు ఉండేలా 5 సబ్ జోన్లు ఉండేలా, ఒక్కో సబ్ జోన్ పరిధిలో 34.6 హెక్టార్ల ఆయకట్టు సాగుకానుంది. ఉరవకొండ మండలంలోని లత్తవరం, షేక్షానుపల్లి, మోపిడి, పెన్నా ముష్టూరు, చిన్న ముష్టూరు, కోనాపురం, పెన్న అహోబిళం, ఇంద్రావతి ప్రాంతాలకు లబ్ధి చేకూరనుంది. పిఎబిఆర్ ఎడమ వైపు ఆయకట్టులో 5,093 హెకార్లు సాగుకు ప్రతిపాదించారు. పిఎబిఆర్ నుంచి నీటిని వినియోగిస్తారు. ఒక్కో హెక్టారుకు రూ.4,61,867 ఖర్చు చేయనున్నారు. ఒక్కో జోన్‌కు 168.8 హెక్టార్ల చొప్పున 30 జోన్లుగా, ఒక్కో జోన్‌లో 34 హెక్టార్ల మేరకు 5 సబ్ జోన్లుగా విభజించారు. కౌకుంట్ల, మైలారంపల్లి, వై.రాంపురం, బూదిగుమ్మ, రామ్‌సాగరం గ్రామాలు ప్రయోజనం పొందనున్నాయి. ఎపిబిఆర్ కుడి ఆయకట్టులో 4,873.4 హెక్టార్లు సాగుకు నోచుకోనుంది. హెక్టారుకు రూ.4,50,684 ఖర్చు చేయనున్నారు. కూడేరు మండల పరిధిలోని భూములకు లబ్ధి చేకూరనుంది. 30 జోన్లలో ఒక్కో జోన్‌కు 162.4 హెక్టార్లు ఉండేలా విభజించారు. కొర్రకోడు, యజపురం, చోళసముద్రం, ముద్దలాపురం గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుంది. జీడిపల్లి రిజర్వాయర్ పరిధిలో 5042 హెక్టార్ల ఆయకట్టు సాగుకు నోచుకోనుంది. పిఎబిఆర్ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తారు. ఒక్కో హెక్టారుకు రూ.4,57,757 సగటు వ్యయం చేయనున్నారు. మొత్తం 30 జోన్లుగా, జోన్‌కు రూ.168.1 హెక్టార్లు ఉండేలా విభజించారు. ఒక్కో జోన్‌ను 5 సబ్ జోన్లుగా, సబ్ జోన్ పరిధిలో 33.6 హెక్టార్లు ఉండేలా రూపొందించారు. బెళుగుప్ప మండలంలోని రామసముద్రం, అంకంపల్లి, కోనంపల్లి, దుద్దేకుంట, తగ్గుపర్తి, బూదిగుమ్మ గ్రామాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *