Home > Politics > విదేశీ పర్యటనలో చంద్రబాబు

విదేశీ పర్యటనలో చంద్రబాబు

ఇరవై నెలల్లో కాళేశ్వరంను పూర్తి
మున్సిపల్ అన్నీ ఆన్ లైనే

chandrababu-tour-apduniaఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరారు. సోమవారం నుంచి ఈనెల 25 వరకు సియం చంద్రబాబు దావో స్ లో పర్యటిస్తారు. దావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. దావోస్ పర్యటనలో వ్యవసాయం, ప్రక్రుతి వ్యవసాయం, ఔషధరంగం, సోలార్ ఎనర్జీ ,ఐటీ , మౌలిక వసతులు వంటి కీలక రంగాలకు సంబంధించి అంశాల పై చర్చతో పాటు 3 ఎంయూఓ లను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. వరుసగా నాల్గవ ఏడాది దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ సదస్సులో ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గోంటున్నారు. ఇందులో ద్వైపాక్షి సమావేశాలు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ , మూడు ఎంవోయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది..దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ సదస్సు సంధర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపును ఇప్పటికే ఎపీ పారిశ్రామిక ప్రగతి రధం దావోస్ లో తిరుగుతుంది..ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, వనరులు వంటి అంశాలను వివరిస్తు గత వారం రోజులుగా పారిశ్రామిక రధం దావోస్ వీధుల్లో తిరుగుతుంది..గత రెండేళ్లుగా దావోస్ పర్యటనలో భాగంగా ఎపీ ప్రభుత్వం అనేక కీలక పెట్టుబడులను తీసుకరాగలిగింది. ముఖ్యంగా దావోస్ పర్యటన అనంతరం జరిగే సిఐఐ సదస్సులో పెట్టుబడులు తీసుకురాగలుగుంది..

గత మూడు సంవత్సరాలుగా దావోస్ పర్యటించిన చంద్రబాబుకి ఈ సారి అరుదైన గౌరవం లభించింది..దావోస్ కీలకమైన ఉపన్యాసాల్లో ప్రధాన వక్తగా చంద్రబాబు ఉండబోతున్నారు. దింతో పాటు దావోస్ లో ఎపీ లాంజ్ ప్రధాని నరేంద్ర మోడితో చంద్రబాబు గంటన్నరపాటు గడపనున్నారు..గతం కంటే భిన్నంగా ఈ సారి వ్యవసాయం-భవిష్యత్తు, ఆహార భధ్రత, గ్లోబల్ ఫండ్, ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఫోకస్ పెట్టనుంది. దావోస్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలను ,వచ్చే నెలలో రాష్ట్రంలో జరబోయే సిఐఐ సదస్సుకు సియం ఆహ్వానించనున్నారు..

నాలుగు రోజులు దావోస్ పర్యటనలో మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ సెంటర్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత క్రిస్టల్ అవార్డుల ప్రదాన వేడుకలో పాల్గొంటారు. అదేరోజు డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్కు హాజరవుతారు. రెండోరోజు ఏపీలాంజ్లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు..అదేరోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోల తో చంద్రబాబు వరుసగా సమావేశమవుతారు. రెండవ రోజునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎపీ లాంజ్ను సందర్శిస్తారు. ఇండియా లాంజ్లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. బజాజ్ గ్రూప్ నైట్ క్యాప్ ఆధ్వర్యంలో డిన్నర్ రిసెప్షన్కు హాజరవుతారు. మూడోరోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ బెల్విడర్లో లంచ్ ఆన్ సమావేశం అవ్వనున్నారు.. ఈ సందర్భంగా ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తరువాత సీఐఐ సీఈవో లతో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్యానలిస్టుగా ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం చేపట్టిన చర్యలను, సాధించిన ప్రగతిపై చర్చిస్తారు. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ చైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *