Home > Politics > చంద్రబాబు అసంతృఫ్తి

చంద్రబాబు అసంతృఫ్తి

ఆయుష్ శాఖ ఆసుపత్రులు తక్షణమే బలోపేతం
ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పకనే చెప్పిన మోడీ!

chandrababu-apduniaకేంద్రం నుండి ఆశించిన మేర బడ్జెట్ లో కేటాయింపులు లేవని ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం నిధుల విషయాన్ని బడ్జెట్ లో పెట్టకపోవడం పైన సీఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్రం వద్ద బడ్జెట్ కేటాయింపులు పైన చర్చించాలని టీడీపీ ఎంపీలకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. కేంద్రమంత్రి సుజనా చౌదరి , ఎంపీలు టీజీ వెంకటేష్ , తోట త్రిమూర్తులు , రవీంద్రబాబు , అవంతి శ్రీనివాస్ , శివప్రసాద్ , రామ్మోహన్ నాయుడు , జేసీ దివాకర రెడ్డిలతో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. స్వయంగా తాను డిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులు , ప్రధాన మంత్రులతోనూ చర్చించినప్పటికీ కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని ఎంపీల దగ్గర సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని కూడా ఆ నిధులేవీ బడ్జెట్లో ప్రస్తావించలేదని పై సీఎం కు ఎంపీలు చెప్పారు. న్యాయ పరంగా మనకు రావాల్సిన వాటిపైన కేంద్రంతో గట్టిగానే మాట్లాడాలని టీడీపీ నేతల నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *