Home > Politics > విభజన చట్టాన్ని అమలు చేయాలి : చంద్రబాబు

విభజన చట్టాన్ని అమలు చేయాలి : చంద్రబాబు

ప్రభుత్వ స్కూళ్లలో మంత్రుల పిల్లలు
పశ్చిమలో టీడీపీ, బీజేపీ వార్

chandrababu-naidu-apduniaఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీని కోరాను. పోలవరం 2019కి పూర్తి చేయాలి కాపర్ డ్యాం నిర్మాణం 3 నెలలు ఆలస్యం అయింది. అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు చట్టంలో ఉంది. కేంద్రం అమలు చేయాలని ప్రధానిని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధానితో భేటీ తరువాత అయన మీడియాతో మాట్లాడారు. విభజన సమస్యల పై చర్చించడానికి నేను సిద్ధముగా ఉన్నా. కేంద్రం జోక్యం చేసుకోవాలి లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. అది ఒక్కటే పరిష్కారమని చెప్పినట్లు అన్నారు. నేను మొదటి నుంచి నేను చర్చలకు సానుకూలంగా ఉన్నా. ఏపీలో వ్యవసాయం ఎక్కువగా ఉంది అర్బన్, సర్వీస్ సెక్టార్ తక్కువగా ఉంది. ఏపీ తెలంగాణకు 46 శాతం, 54 శాతంతో కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్ కెపిట ఇన్ కం లో ఏపీ వెనుకబడి ఉందని అన్నారు. ఏపీ విభజన హేతు బద్ధత లేకుండా చేశారు. షెడ్యూల్ 9, 10 సరిగా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. కానీ ప్యాకేజ్ లో ఏపీకి ఎలాంటి బినిఫిట్స్ ఇవ్వలేదు అవన్నీ వెంటనే ఇవ్వాలని కోరామని అయన అన్నారు. హోసింగ్, నాబార్డ్, హుడుకో ద్వారా ఏపీకి నిధుల విడుదలకు కేంద్రం సహకరించాలని అన్నారు. రైల్వేజోన్ విషయం త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశా. రాజధాని నిర్మాణానికి ఇప్పటికి రూ.2,500కోట్లు ఇచ్చారు. విజయవాడ, గుంటూరులో అభివృద్ధి పనులకు రూ.వెయ్యికోట్లు ఇచ్చారు. షెడ్యూల్ 13లో 11 ఇనిషిట్యూట్స్ పెట్టారు. 9 కేటాయించారు మరో రెండు పెండింగ్ ఉన్నాయి. 11వేల కోట్ల ఖర్చు ఈ సంస్థల ఏర్పాటుకి అవసరం. కేంద్రం అత్యల్పంగా 400కోట్లు కేటాయించింది.కడపలో స్టీల్, వైజాగ్ మరియు విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై కారిడార్, ఏపీ విభజన చట్టం అమలు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరానని చంద్రబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com