Home > Politics > అడ్డంకులు సృష్టించినా వెన‌కాడేది లేదు: చ‌ంద్ర‌బాబు

అడ్డంకులు సృష్టించినా వెన‌కాడేది లేదు: చ‌ంద్ర‌బాబు

ఉపాధ్యాయుడు ఆదర్శంగా వుండాలి : కడియం శ్రీహరి
ఇవాళ్టి జీఎస్టీపై తెలంగాణ కొండంత ఆశలు

chandrababu-apduniaరైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో శుక్రవారం నాడు జలసిరికి హారతి కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ, వైద్య పరీక్షలు తీసుకొచ్చామన్నారు. తనను నమ్ముకున్న ప్రజల కోసమే పని చేస్తానన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదన్నారు. కొంద‌రు కులం, మ‌తం పేరుతో రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నారని, మ‌రోవైపు రాజ‌ధాని నిర్మాణానికి అడ్డుప‌డుతున్నారని అన్నారు. తాము రాష్ట్రంలో విద్యుత్ కొర‌త‌ను అధిగ‌మించామ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచ‌బోమని అన్నారు. జ‌ల‌సిరి కార్య‌క్ర‌మంలో అంద‌రూ పాల్గొనాలని కోరారు. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *