Home > Politics > నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వ లక్ష్యం : చంద్రబాబు

నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వ లక్ష్యం : చంద్రబాబు

యువరాజ్ టీమ్ లో తెలంగాణకు పెద్ద పీట
మీ మనోభావాలు సరే... ప్రజల సంగతేంటి

chandrababu-apduniaకాపు కార్పోరేషన్ ద్వారా నిరోద్యుగులకు సాధికారిత కల్పించడం ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నాడు అమరావతి సచివాలయం హెలీప్యాడ్ వద్ద నిరుద్యోగ లకు వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని అయన జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కు కార్ల ను అయన పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మొత్తం కోటి 20 లక్షల తో 16 కార్లను పంపిణి చేసారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయాలక్ష్మి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు 16కార్లను కోటి ఇరవై లక్షలు రూపాయలతో కొని 16మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో వారికి ఉపాధి లో నైపుణ్యభివృద్ది కల్పిస్తున్నాం. ఇప్పుడు కోటి ఇరవై లక్షలు ఖర్చు పెడ్డితే 16మందికి ఉపాధి కలిగింది. రాష్టంలోని నిరుద్యోగలకు మరిన్ని నిధులు ఖర్చు పెట్టిఉపాధి కల్పించడానికి సిద్దంగా ఉన్నామని అయన వెల్లడించారు. నిరుద్యోగ నిర్మూలన ఈ ప్రభుత్వం లక్ష్యం. ఉపాధి పొందిన వారు, ఇంకా అభివృద్ధి చెందేలా చూడాలని సూచించారు. ఒక్కొక్కరు భవిష్యత్ లో రెండు , మూడు కార్లు తో మరింత గా అభివృద్ధి చెందాలి. వీళ్ల ద్వారా మరి కొంతమందికి ఉపాధి లభిస్తుంది. అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com