Home > Politics > సానుకూల స్పందన రాలేదు : సీఎం చంద్రబాబు

సానుకూల స్పందన రాలేదు : సీఎం చంద్రబాబు

జైట్లీ ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారు : పురందేశ్వరి
కంచుకోటపై టీడీపీ నిర్లక్ష్యం

chandrababu-apduniaతెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు ఒక కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో యనమల, పయ్యావుల కేశవ్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, పరకాల ప్రభాకర్, కుటుంబరావు ఉన్నారు. భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు మండలాలను తెలంగాణాలో కలిపారు. అనుభవం వున్న రాజకీయ నేతగా దానివల్ల రాబోయే నష్టాలను గుర్తించి ఆ అంశంపై గట్టిగా నిలబడ్డానని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు ఉండరాదనే విజ్ఞతతో వ్యవహరించాను. 29 పర్యాయాలు రాష్ట్ర సమస్యలపై ఢిల్లీ వెళ్లానని అన్నారు. రెండు రాష్ట్రాల్లో తెలుగువారి మధ్య విభేదాలు వుండకూడదనే నా అభిమతం. ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబితేనే అంగీకరించాను. ఏడాదిన్నర అయినా ఈఏపీ ద్వారా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని అన్నారు. మొన్నటి బడ్జెట్లో ఎక్కడా మన రాష్ట్రం పేరు ప్రస్తావించలేదు. పోలవరం ముంపు మండలాలను ఏపీకి కేటాయించకపోతే అది మరోసారి మోసం అవుతుందని గట్టిగా చెప్పడంతో చట్టాన్ని చేశారు. ఇది నూతన రాష్ట్రం. పుట్టిన పిల్లలను చాలా జాగ్రత్తగా సాకాలని అన్నారు. ఆరంభంలో చాలా కష్టాలు పడ్డాం. ఉండేందుకు కార్యాలయాలే లేవు. ఉద్యోగులు, అధికారులకు వారాంతాల్లో రెండు రోజులు సెలవు ఇచ్చి కుటుంబంతో గడిపేందుకు అవకాశం ఇచ్చాం. అదనపు అద్దెభత్యం ఇవ్వాల్సివచ్చిందని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అడుగుతూ వచ్చాను. బడ్జెట్ ప్రసంగంలోనూ గవర్నర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదని చంద్రబాబు అన్నారు. యూసీలు కావాలంటే ఎప్పటికప్పుడు పంపిస్తూనే వచ్చాం, కానీ పంపలేదని ఆరోపణలు చేసింది కేంద్రం. కేంద్రం ఫ్రెండ్లీ పార్టీ అని యూసీలు ఇవ్వకపోతే తరువాత నష్టం జరుగుతుందని మన అధికారులను ఎఫ్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నానని అయన అన్నారు. యూసీలు పంపించాం, డబ్బులు పంపించి మరీ రివర్ట్ చేసింది కేంద్రం. ఇప్పుడు యూసీలు పంపలేదని సాకులు చెబుతోందని అన్నారు. 33 వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేసి ఇస్తే వారి త్యాగనిరతికి కనీస గౌరవం ఇవ్వకుండా రాజధానికి నిధులు కేటాయించడంలో మొండి చెయ్యి చూపించారని వ్యాఖ్యానించారు. రాజధానికి ఏం ఖర్చుపెట్టారు అని అడుగుతారు, కానీ కేంద్రం ఇచ్చింది కేవలం రెండున్నర వేల కోట్ల రూపాయలు.కేంద్రం కన్నా రాజధాని రైతులు 40 వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చారు. రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నట్టుగా వుంది కేంద్రం వైఖరని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకున్నాం, కేంద్రం నుంచి మంత్రులు రాజీనామాలు సమర్పించమన్నాం. మనకు చాలా కష్టాలు వున్నాయి, చాలా అవకాశాలు వున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హుద్ హుద్ తుఫానుకు ప్రధానమంత్రి వెయ్యి కోట్ల సాయం ప్రకటిస్తే అందులో రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారు. పట్టిసీమను ఏడాదిలోనే పూర్తి చేయగలిగాం. రాయలసీమకు మొదటిసారి 148 టీఎంసీల నీటిని ఇవ్వగలిగాం. గోదావరి జిల్లాలను మించి రాయలసీమలో వ్యవసాయ దిగుబడులు వస్తున్నాయి. సోమవారాన్ని పోలవరం కోసం అంకితం చేశాం, ఎట్టిపరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పించాం. ఆక్వా కల్చర్లో మనమే ముందున్నాం, మిగిలిన వ్యవసాయ అనుబంధరంగాల్లోనూ ప్రగతి కనిపిస్తోందని అయన అన్నారు. ఇదంతా మన విజన్, మన పట్టుదల వల్లే సాధ్యమైందని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *