Home > Politics > కర్నూలులోచంద్రబాబుకు గుడి

కర్నూలులోచంద్రబాబుకు గుడి

పవన్ అన్నా... నీకు నీ జెండాకు సెలవు...
ఇంటికో ఉద్యోగం కాదు...ఊరుకో ఉద్యోగం రాలేదు : జగన్

chandrababu temple in nandyalతెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుడి కడతాం.. అని ప్రకటించింది ఏపీ హిజ్రాల సంఘం. కర్నూలు జిల్లా నంద్యాల్లో చంద్రబాబుకు దేవాలయం నిర్మిస్తామని హిజ్రాల సంఘం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు తమకు సంక్షేమ పథకాలను బాగా అమలు చేస్తున్న నేపథ్యంలో..ఆయన కోసం తాము గుడి కడతామని ఆ సంఘం తెలిపింది.హిజ్రాలకు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది తమకు ఎంతో మేలు చేస్తుందని హిజ్రాల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రకటించారు. అలాగే తమకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా బాబు చెప్పారని.. ఈ విధంగా తమ సంక్షేమం కోసం బాబు పాటుపడుతున్నారని అందుకే ఆయనకు గుడిని కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటామని హిజ్రాలు ప్రకటించారు.నంద్యాల్లో బాబుకు గుడిని కట్టనున్నామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఒక హిజ్రాకు కూడా ఉద్యోగం కల్పించిందని.. హిజ్రాల సంఘం తెలిపింది. ఈ విషయంపై కూడా సంఘం ఆనందం వ్యక్తం చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *