Home > Politics > ప్రవాసాంధ్రుల ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన

ప్రవాసాంధ్రుల ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన

ఇవాళ్టి జీఎస్టీపై తెలంగాణ కొండంత ఆశలు
రాష్ట్రాభివృద్ధికి సాధ్యమైనంత కృషి

chandrababu-apduniaప్రవాసాంధ్రులు నిర్మించ తలపెట్టిన అమరావతి అమెరికన్ ఆస్పత్రి నిర్మాణానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంపట్నంలోని 20 ఎకరాల స్థలంలో రూ.600 కోట్ల పెట్టుబడితో 3దశల్లో 700 పడకలతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. 2019 మార్చి నాటికి ఈ ఆస్పత్రి మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని అంచనా.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హేతుబద్ధతలేని రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. రాజధాని నిర్మాణమనేది చాలా కష్టతరమైన విషయమని, అలాంటి కష్టతరమైన రాజధాని నిర్మాణాన్ని ప్రపంచంలోనే ఆధునిక రాజధానిగా నిర్మించాలని సంకల్పించామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. అమరావతికి 13 వైద్య కళాశాలలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *