Home > Vanitha > Recipes > చికెన్ రోస్ట్ తయారీ

చికెన్ రోస్ట్ తయారీ

ఆప్రికాట్‌ మీఠా
సోయా గ్రాన్యూల్స్‌ తో వెజిటేబుల్ బిర్యానీ

Chicken Ghee Roast_apduniaకావల్సినవి: చికెన్‌ – ముప్పావు కేజీ, గిలకొట్టిన పెరుగు – ముప్పావు కప్పు, కారం – చెంచా, పసుపు – అరచెంచా, నిమ్మరసం – పెద్ద చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద – ఒకటిన్నర చెంచా, ఉప్పు – తగినంత. 

మసాలాకోసం: ఎండుమిర్చి – ఆరు, మిరియాలు – అరచెంచా, మెంతులు – పావుచెంచా లవంగాలు – నాలుగు, జీలకర్ర, సోంపు – పావుచెంచా చొప్పున, ధనియాల పొడి – మూడు చెంచాలు, వెల్లుల్లి తరుగు – నాలుగు చెంచాలు, చింతపండు – ఉసిరికాయంత (వేడినీటిలో నానబెట్టుకోవాలి), బెల్లం తరుగు – రెండు చెంచాలు, నెయ్యి – అరకప్పు, ఉప్పు – తగినంత.

తయారీ: చికెన్‌ ముక్కల్ని శుభ్రం చేసి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగూ, కారం, పసుపూ, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఇంతలో బాణలిని పొయ్యిమీద పెట్టి.. రెండు చెంచాల నెయ్యి వేయాలి. అది కరిగాక చింతపండూ, బెల్లం తరుగూ, ఉప్పూ తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి. బాణలిని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. పెద్ద చెంచా నెయ్యి వేయాలి. అది కరిగాక చికెన్‌ ముక్కలు వేసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికిందనుకున్నాక ఇవతలకు తీసేయాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. దాని పచ్చివాసన పోయాక.. బెల్లం తరుగూ, కొద్దిగా చింతపండురసం, కొంచెం ఉప్పూ, చికెన్‌ ముక్కలూ వేసి.. బాగా కలపాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *