Home > Movies > చైనాలో సైరా….

చైనాలో సైరా….

సాయి పల్లవి కాస్ట్లీ గురూ
రంగ స్థలం ముచ్చటగా మూడో సాంగ్ రిలీజ్

sye-raa-apduniaఖైదీ నెం.150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘సైరా’ విడుదలకు ముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ తేజ్ ‘సైరా’ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్డ్‌‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ కు రెడీ అయ్యింది. భారీ బడ్జెట్‌తో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇందుకు అనుగుణంగా ‘సైరా’ కొన్ని మేజర్ పార్ట్స్‌‌ని అక్కడ షూట్ చేసుందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇటీవల చైనాలో విడుదలైన భారతీయ సినిమాలు ‘దంగల్, భజరంగీ భాయిజాన్’లు కాసుల వర్షం కురిపించడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులరీ ఉన్న మెగాస్టార్ తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘సైరా’ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.కాగా ‘సైరా’ సినిమాకు డిజిటల్ రైట్స్ ఎవరూ ఊహించని రీతిలో రూ.30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయడంతో ‘సైరా’ బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేయడం ఖాయమని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బితో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీ రోల్‌లో నటిస్తుండగా.. జగపతి బాబు, సుదీప్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన నయనతార జోడీ కడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *