Home > General > ఏజన్సీలో వినోదం అంటే కేవలం కోడిపందాలే

ఏజన్సీలో వినోదం అంటే కేవలం కోడిపందాలే

రుద్రాక్షలు- విశిష్టత ఏంటో తెలుసా
ప్రతి యేటా పన్నెండు రాకెట్ ప్రయోగాలు : ఇస్రో

cock-fight-apduniaఆరు కాలాలు… అరకొర పంటలు. సంవత్సరం పొడవునా శ్రమ. మహా సంక్రాంతికి మాత్రమే ఆహ్లదకర జీవితం. కేవలం కోడిపందాలే వినోదం. మన్యంలో గిరిపుత్రులకు సంక్రాంతి పండగంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే కొత్త అల్లుళ్లు… కోరుకున్నపిండివంటలు… కొత్త ధాన్యాలు… కోడిపందాలు. ఇంతే… ఆ మూడు రోజులు మన స్పూర్తిగా తినడానికి పిండివంటలు….ఆ పై ఆనందానికి కోడిపందాలు. తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో జరిగే నిజమైన కోడి పందాలు. జెస్ట్ వాచ్ ఏజెన్సీ కాక్ ఫైట్.తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు సంవత్సరం పొడవునా శ్రమించి పండించుకునే అరకొరగా ధాన్యాలు, అపరాలు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీరగా…. మిగిలిన పంటను తినడానికి కొంత దాచుకొని… మిగిలినది అమ్మి కొత్త అల్లుళ్లకు, పిల్లలకు కొత్త బట్టలు కొని.. అందరూ తినడానికి పిండివంటలు వండుకొని ఆనందంగా గడుపుతారు. ఇక్కడ వినోదం అంటే కేవలం కోడి పందేలే. ఎందుకంటే ఎక్కడ ఇతరత్రా వినోద కార్యక్రమాలు ఏమి ఉండవు. కోడిపందాలు మాత్రమే వినోదం కావడంతో భయం భయంగా మన్యంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లి కోడిపందాలు జరుపుతారు. పోలీసులు వస్తే పారిపోవడం తప్ప… బడా నాయకుల అండదండలు ఉండవు. ఉన్న ఒక్క వినోదాన్ని కూడా అవాంతరాలు వస్తుంటే తామేం చేయాలి అని ప్రశ్నించే ప్రశ్నలు కూడా గుసగుసలగానే మిగిలిపోతాయి. మొత్తానికి ఈ మూడు రోజులు భయంతో కూడిన వినోదాన్ని ఆస్వాదిస్తారు. ఇక్కడ కోళ్లకు ప్రత్యేకమైన తర్ఫీదులు ఉండవు. కోళ్లను రాట్నకు కట్టి పండించిన ధాన్యం, గంటెలు, చోళ్లు వేసి కోళ్లను మేపుతారు. ఇక్కడ పందెం బరిలో ఓడిపోయినా, గెలిలిచినా ఆనందమే. విచిత్రం ఏమిటంటే మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త అల్లుళ్లకు కూడా వినోదం కేవలం ఈ ఏజెన్సీ కోడిపందాలే.కొంత మందికి ఇష్టం లేకపోయినా, ఏ ఇతర కార్యకమాలు లేక అయిష్టంగానే కోడిపందాలు తిలకించి ఆనందిస్తారు. కొంత మంది పండక్కి వచ్చే అల్లుళ్లకు, అతిథులకు కోళ్లు-నాటు కోడి మాంసంతో భోజనం వండించడం మన్యం సంప్రదాయం కావడంతో కేవలం మాంసం కోసం కోళ్ళను తయారు చేసి కోడిపందాల బరిలోకి దింపుతారు. మైకంతో సంబంధంలేని కోడిపందాలు కేవలం మన్యంలోనే జరుగుతాయి. అందుకే తాటికల్లు, జీలుగ కల్లు పుష్కలంగా ఉండటంతో కల్లు సేవించి ఎంత దూరమైనా పందాల కోసం పోటీ బరికి కాలినడకనే వెళతారు.కోడిపందాల కోసం నడిచి వస్తున్నవృద్దులు, పిల్లలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన్యం కోడిపందాలు అరమరికలు లేని పందాలు ఎందుకంటే తిథులు, నక్షత్రాలు చూసే నాడీ జ్యోతీష్యులు ఉండరు. ఘడియలు, జాములు చూసే సారులు ఉండరు. కల్లు తాగిన మత్తులో, మాంసం భ్రమలో జరిగే ఈ కోడిపందాలు చూసే వారు ఆరోగ్యకరమైన ఆనందాన్ని పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com