Home > Vanitha > Recipes > కొబ్బరి కాప్సికం ఫ్రై

కొబ్బరి కాప్సికం ఫ్రై

బ్రెడ్ ఖర్జురా రసగుల్లా
చికెన్ డ్రై వింగ్స్

coconut4_apduniaకావలసిన పదార్థాలు :

ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌లు: మూడు(ఒక్కొక్కటి చొప్పున), ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, కొబ్బరితురుము: కప్పు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం : 
* క్యాప్సికమ్‌ను కడిగి తుడిచి నూనె రాసి మంటమీద నేరుగా కాల్చాలి. ఇప్పుడు వీటిని గాలిచొరని డబ్బాలో పెట్టి కాసేపు ఉంచాలి. తరవాత కాలిన పై పొరను తీసేసి క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోయాలి. 
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరవాత తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి కలపాలి. చివరగా కొబ్బరితురుము వేసి దించాలి. ఇది అన్నంలోకీ రోటీల్లోకీ కూడా బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *