Home > General > పరిహారం అందక మత్స్య కారుల ఆందోళన

పరిహారం అందక మత్స్య కారుల ఆందోళన

ప్రమాదంలో ప్రజారోగ్యం
మూడేళ్లలో మూడు లక్షల ఎకరాలు సాగు తగ్గింది

fisherman_apduniaవేట సమయం వచ్చేసింది. గంగపుత్రులు సముద్ర అలల్లో జీవన పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. వలలు చేత పట్టి.. పడవలో సుదీర్ఘ ప్రయాణాలకు మత్స్యకారులు రెడీ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని.. 193 కిలోమీటర్ల సుదూర సముద్ర తీరం. గడిచిన 45 రోజులుగా చేపల వేట నిషేధంతో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేట నిషేధ సమయం పూర్తి కావడంతో.. బతుకు పోరుకు సన్నద్ధమవుతున్నారు. అయితే చేపల వేట నిషేధ సమయంలో.. మత్స్యకారులకు ఆసరాగా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ప్రకటనలకే పరిమితమైంది.జిల్లాలోని పదకొండు మండలాల్లో.. 104 సముద్ర తీర గ్రామాలున్నాయి. అయితే కేవలం 5, 050 మంది మత్స్యకారులకు మాత్రమే నాలుగు వేల చొప్పున.. లీ మంత్‌ పరిహారం అందించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి రెండు కోట్ల రెండు లక్షల
రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వేట నిషేధం పూర్తయినా.. ఇంత వరకూ పరిహారం మాత్రం అందలేదని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిహారం 10 వేలకు పెంచడంతో పాటు.. వంద కేజీల బియ్యం పంపిణీ చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకునే నాయకులు కరువయ్యారు. కొత్త ప్రతిపాదనల మాట పక్కన పెడితే.. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు వేల రూపాయలు కూడా.. అందడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలో 12 వేల మంది వరకూ మత్య్సకారులు మెకనైజ్‌డ్‌ బోట్లతో చేపల వేట సాగిస్తున్నారు. వీరిలో అరవై శాతం మందిని మాత్రమే గుర్తించి.. వారికి కూడా చెల్లింపులు చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల గంగపుత్రులు వలస బాట పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలు ఒక రకంగా.. జాబితాలలో ఇంకో రకంగా ఉంటోంది. వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు.. ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *