Home > Editorial > పూర్తిగా నిలిచిపోయిన కిరోసిన్, పంచదార

పూర్తిగా నిలిచిపోయిన కిరోసిన్, పంచదార

రికార్డులతో హోరెత్తిస్తున్న ఇస్రో
గ్రామాల్లో తీవ్రంగా మంచి నీటి సమన్య
 
TIRUCHI, TAMILNADU, 06/12/2014: People waiting to buy kerosene oil in front of a PDS outlet at Chinthamani Supermarket, Tiruchi, on December 06, 2014.  Photo: B. Velankanni Raj

TIRUCHI, TAMILNADU, 06/12/2014: People waiting to buy kerosene oil in front of a PDS outlet at Chinthamani Supermarket, Tiruchi, on December 06, 2014.
Photo: B. Velankanni Raj

 ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసే కిరోసిన్‌, పంచదారను జూన్‌ నుంచి పూర్తిగా నిలిపివేశాయి.ఇప్పటి వరకూ చౌక డిపోల ద్వారా అందించే కిరోసిన్‌ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసేది. గ్యాస్‌ కనెక్షన్లు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిరోసిన్‌ సరఫరాను నిలిపివేసింది. అలాగే పంచదారకు కూడా కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. దానిని కూడా ఇప్పుడు నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం కత్తిరిస్తే.., ఆ భారాన్ని మోయడానికి సిద్ధపడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో పేదలకు కిరోసిన్‌, పంచదార నిలిచిపోతున్నాయి. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కిరోసిన్‌, పంచదార అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయలేని వారు  ఇక నుంచి వాటికి దూరం కావాల్సిందే.  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొమ్మిది రకాల సరుకులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయగా, మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చిన తరువాత వాటిని ఒక్కొక్కటి కుదిస్తూ వచ్చి కిరోసిన్‌, పంచదారను కూడా కట్‌ చేశాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. అనంతపురం జిల్లాలో 11 లక్షల 22 వేల పైబడి తెలుపు, ఎఎవై, అన్నపూర్ణ రేషన్‌ కార్డులున్నాయి. వీరికి నెలకు 1,623 కిలో లీటర్ల కిరోసిన్‌ సరఫరా చేయాల్సి ఉంది. చౌక డిపోల ద్వారా ప్రభుత్వం లీటర్‌ కిరోసిన్‌ రూ.19కు పంపిణీ చేస్తోంది. ఈ లెక్కన గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న తెలుపుకార్డుదారులకు ఒక లీటరు, గ్యాస్‌ కలెక్షన్‌ లేని వారికి 2 లీటర్ల చొప్పున ప్రభుత్వం కిరోసిన్‌ సరఫరా చేస్తోంది. అయితే ప్రభుత్వం జూన్‌ నుంచి కిరోసిన్‌ సరఫరా నిలిపివేసింది. బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే లీటర్‌ రూ.50 పలుకుతోంది. అంత మొత్తానికి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత పేదలకు లేదు. దీంతో పేదలు మళ్లీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ముందస్తు ఆలోచన లేకుండా గ్యాస్‌ మంజూరు చేయనున్నామని చెప్పి కిరోసిన్‌ రద్దు చేయడంతో రెండింటికి చెడ్డ రేవడిలా లబ్ధిదారుల పరిస్థితి తయారైంది.అలాగే 11లక్షల 22 కార్డులకు అర కిలో చొప్పున ప్రభుత్వం పంచదార పంపిణీ చేస్తోంది. ఈ లెక్కన 538.278 టన్నుల పంచదార అవసరం కానుంది. ప్రభుత్వం నుంచి రెండు నెలలుగా పంచదార పంపిణీ ఆగిపోయింది. గొడౌన్లలో నిల్వ ఉన్న పంచదారనే మే వరకూ పంపిణీ చేశారు. మే నెల పంచదార 40 శాతం, కిరోసిన్‌ 30శాతం కార్డులకు మాత్రమే అందింది. జూన్‌ నెలకు పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకూ అలాట్‌మెంట్‌ రాలేదు. దీంతో పంచదార పంపిణీకి సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల రేషన్‌ డిపోల ద్వారా అర కిలో పంచదార రూ.6.75కు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పంచదార పంపిణీ నిలిపివేస్తే బయట మార్కెట్‌లో అరకిలో రూ.22కు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి రానుంది. దీంతో ప్రజలు టీకి కూడా దూరం కానున్నారు. తీపి రుచులను ఇక మరిచిపోవాల్సిందే. చౌక ధరల డిపోల ద్వారా ఎన్ని ఎక్కువ సరుకులు సరఫరా చేస్తే అంత మొత్తంలో రేషన్‌ డిపోల డీలర్లకు కమీషన్‌ వస్తుంది. ఈ 

కమీషన్‌ డబ్బులతోనే షాపుల అద్దెలు, కూలీలకు కూలి డబ్బులు చెల్లించడంతో పాటు, తమ కుటుంబాన్ని పోషించుకోవాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బియ్యం, కిరోసిన్‌, పంచదార, కందిపప్పు, పామాయిల్‌, గోధుమలు, గోధుమ పండి వంటి తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు సరఫరా జరిగేవి. ఆ సమయంలో డీలర్లకు కమీషన్‌ కూడా బాగానే వచ్చేది. కాని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కొక్క సరుకు కత్తిరిస్తూ ఇప్పుడు పంచదార, కిరోసిన్‌, బియ్యం మాత్రమే ఇస్తుంది. జూన్‌ నుంచి పంచదార, కిరోసిన్‌ నిలిపివేసింది. దీంతో డీలర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *