Home > Politics > గవర్నర్ ను కలిసిన విపక్ష నేతలు

గవర్నర్ ను కలిసిన విపక్ష నేతలు

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు
 ఏపీలో సామాజిక వర్గాల వార్

narasimhan-apduniaగవర్నర్ నరసింహన్తో అఖిలపక్షం నాయకులు భేటీ అయ్యారు. రైతు సమన్వయ సమితుల పేరుతో టీఆర్ఎస్ నేతలకు దోచిపెడుతోందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జేఏసీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఇందుకు సంబంధించిన జీవో 39 ఉపసంహరణకు చొరవ తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ జీవో 39 కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో రైతులకు కానీ, ఇతరాత్ర ఎవరికీ ఉపయోగపడదని అన్నారు. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. జీవో 39 ను గందరగోళం సృష్టిస్తోంది. తెరాస రాజకీయ అవసరాలకు ఈ సమితి లను ఏర్పాటు చేస్తుందని ఆరోపించారు.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఇచ్చిన 39, 42 జీవో లు ఉద్దేశం పూరితంగా ఇచ్చినవని విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణం ఏ విధంగా జరిగిందో ఇప్పుడా కూడా అదే పంథా లో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టేందుకు ప్రయత్నమని అన్నారు. రైతుల పేరుతో టీఆర్ఎస్ దోపిడీ చేస్తోందని రమణ విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతు సహకారం పేరుతో టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు తెలంగాణ లో భూ మాఫియా హైదరాబాద్ పట్టణాల్లో ఉన్నాయి. ఇప్పుడు అవి గ్రామాల మాఫియా గా మరబోతుందని అన్నారు. పంచాయతీ సమిథులుగా మారుతాయని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ జీవో 39 ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. 2019 లో జరగబోయే ఎన్నికలకు డబ్బులు సమకూర్చుకునేందుకు ఈ ప్రయత్నమని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఉన్నాయి..వీటికి సంభంధం లేకుండా ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ జీవో 39 ప్రకారం రైతు సమన్వయ సమితి లపై గవర్నర్ కు పిర్యాదు చేసాం. రాజ్యంగం ప్రకారం ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ లు ఉండగా ఇవ్వని ఎందుకని ప్రశ్నించారు. నామినేటెడ్ వ్యవస్థ ద్వారా ఇబ్బందులు జరిగే అవకాశం వుంటుందని అన్నారు. ఇలాంటి నిరంకుశ దారి వ్యవస్త తో ముపు వాటిల్లుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *