Home > General > రుయాకు అవినీతి జబ్బు

రుయాకు అవినీతి జబ్బు

ఈ ఏడాది ఎంసెట్ ఆన్ లైన్ లోనే...
స్వచ్ఛ జిల్లా దిశగా విజయనగరం అడుగులు

ruya-hospital-tirupati-apduniaరాయులసీమకే తలమానికం తిరుపతి రూయా ఆసుపత్రి. కానీ.. ఇక్కడి సిబ్బంది తీరుతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రుయా సిబ్బంది చేతివాటంతో నెలకు 12 లక్షల రూపాయల ఆసుపత్రి సొమ్ము ఖాళీ అవుతోంది. తిరుపతి రుయాలో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా పేదలకు వైద్యం అందించాలంటే మొదట ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరిన రోగికి శస్త్రచికిత్స అవసరమైతే… వెంటనే వైద్యులు అతనికి శస్త్రచికిత్స అవసరం అని కీ షీట్ రాసి… ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది వద్దకు వెళ్లాలని సూచిస్తారు. అక్కడ సిబ్బంది వారి వద్ద ఉన్న కీ షీట్ ను పరీక్షల నిమిత్తం రేషన్ కార్డ్ వివరాలన్నీఎన్టీఆర్ వైద్యసేవ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దానికి రోగి వద్ద ఉన్న డాక్యుమెంట్లు అప్లోడ్, స్కాన్ చేయాలి. దీనికి రుయానే కాగితాలు, ఇతర ఖర్చులను చెల్లిస్తోంది. వాటిని కొన్ని ఎన్టీఆర్ వైద్యసేవ కోడ్ ఇస్తూ అప్లోడ్ చేసే చిన్న విషయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ప్రతి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి.. మెయిల్ ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని కాగితాలు అప్లోడ్ చేసే కాంట్రాక్టును 3 సంవత్సరాలకు అప్పగించారు. ఒక్కో అప్ లోడ్ కు రూ.920లను రుయా చెల్లిస్తోంది. రోజుకు సుమారు 40 నుంచి 50 మంది రోగుల కీ షీట్లు వీరు ఎన్టీఆర్ వైద్యసేవలో అప్ లోడ్ చేసి డబ్బు తీసుకుంటున్నారు.ప్రతినెలా దీనికోసం రుయా ప్రత్యేక నిధుల నుంచి రూ.11 నుంచి రూ.12 లక్షల వరకు బిల్లులు చేస్తున్నారు. 50రూపాయతో అయ్యే చిన్న పనిని రుయా అధికారులు.. ఒకో అప్ లోడ్ 920 రూపాయలు ఇస్తున్నారు. రుయా నిధుల నుంచి 25 మంది సిబ్బందికి నామమాత్రపు జీతాలు ఇస్తూ మిగిలిన సొమ్మును ప్రైవేటు వ్యక్తుల జేబులో వేసుకుంటున్నారు. ప్రస్తుతం డిసెంబరుతో ఈ కాంట్రాక్టు గడువు పూర్తి కానుంది. రెండవసారి ఈ కాంట్రాక్టు విషయం రుయాలో పెద్ద చర్చగా మారింది. ఆస్పత్రి నిధులను యధేచ్ఛగా వాడేయకుండా… అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తే..ఆసుపత్రి నిధులు మిగిలే అవకాశం ఉంది. జనవరి నుంచి మొదలయ్యే కొత్త కాంట్రాక్టులో అయినా రుయా అధికారులు భవిష్యత్తును… డబ్బులు మిగుల్చుకునే మార్గాన్ని అన్వేషిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com