Home > Politics > అమరావతి నిర్మాణంఫై అరుణ్‌ జైట్లీ ప్రకటన దారుణం

అమరావతి నిర్మాణంఫై అరుణ్‌ జైట్లీ ప్రకటన దారుణం

రజనీ పార్టీ కోసం క్యూ కడుతున్నారు
ఉగాది నుంచి చంద్రన్న పెళ్లి కానుక

cpi-ramakrishna-apdunia-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఋణం మంజూరు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.విభజన చ‌ట్టంలో పేర్కొన్నవిధంగా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.ప్రపంచ బ్యాంక్ రుణంతో రాజధాని నిర్మాణం చేస్తే రాష్ట్రాన్నివారికి తాకట్టు పెడుతున్నట్లేనని అన్నారు. నాలా బిల్లు ఆమోదించలేదని గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానన్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com