Home > Vanitha > Recipes > మంచూరియన్ స్టైల్…క్రిస్పీ పొటాటో ఫ్రై

మంచూరియన్ స్టైల్…క్రిస్పీ పొటాటో ఫ్రై

మెంతులతో లడ్డూ...
ఆరోగ్యకరమైన జుట్టుకు కొబ్బరి నూనె-నిమ్మరసం

manchurian-potatto-fry-apduniaకావలసిన  పదార్థాలు:

  • బంగాళదుంపలు – 2 cups(నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి)
  • కార్న్ ఫ్లోర్- 2 teaspoons
  • కారం – 1 teaspoon
  • పచ్చిమిర్చి – 5 to 6
  • సోయాసాస్ – 1 teaspoon
  • టమోటో సాస్ – 1 teaspoon
  • చిల్లీసాస్ – 1 teaspoon
  • వెల్లుల్లి- 1 teaspoon (finely chopped)
  • ఉల్లిపాయలు – 1 cup Salt Oil

తయారుచేయు విధానం:

  • ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పొటాటో ముక్కలతో పాటు, కొద్దిగా కార్న్ ఫ్లోర్ చిలకరించి బాగా మిక్స్ చేయాలి.
  • ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పొటాటో కార్నఫ్లోర్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
  • కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ రెడ్డిష్ కలర్లో వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
  • అంతలోపు మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి.
  • తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, మరియు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులోనే సోయా సాస్, టమోటో సాస్, చిల్లీ సాస్ వేసి, మొత్తం పదార్థాలను వేగించుకోవాలి.
  • రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు కూడా అందులో వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకుని వేడి వేడి టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *