Home > Sports > ఫిడే ప్రపంచ లోగో పై విమర్శల వెల్లువ

ఫిడే ప్రపంచ లోగో పై విమర్శల వెల్లువ

జూన్ లో ఐర్లాండ్ టూర్ కు టీమిండియా
క్రీడలకు ప్రోత్సాహం : మంత్రి అనంద్ బాబు

fide-chess-logo-apduniaఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల కోసం రూపొందించిన లోగో. దీన్ని చూసిన క్రీడాకారులు, క్రీడా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పలువురు దిగ్గజ క్రీడాకారులు సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ లోగోను చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు కామసూత్ర భంగిమలో కూర్చొని చెస్ బోర్డు పట్టుకుని ఆడుతున్నట్లు ఉందని అంటున్నారు.ఫిబ్రవరి 9, 2018 నుంచి లండన్‌లో ప్రారంభంకానున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ కోసం మాస్కోకి చెందిన శుఖా డిజైన్ సంస్థ ఈ లోగోని డిజైన్ చేసింది. అయితే… ‘‘ఈ లోగు మా కోణంలో చూడండి’’ అంటూ ఆ సంస్థ సమర్ధించుకుంటోంది. ‘‘ఇది ఎంతో అధునాతన లోగో. పోటీలకు వేదికైన నగరాన్ని ఇందులో చూపించాం. దీని కోసం మా ఆర్టిస్టులు ఏడాదిపాటు శ్రమించారు. ఈ లోగోతో పోస్టర్లు, ప్రకటనలు, ఫ్లెక్సీలు, క్రీడా ప్రాంగణం ముస్తాబు, మగ్గులు, బహుమతులు… ఇలా అన్నీ సిద్ధమైపోయాయి’’ అంటూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు.భారత చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత విశ్వనాథ్ ఆనంద్ ఈ లోగోపై స్పందిస్తూ.. ‘‘చెస్‌బోర్డులో 8×8 గడులు ఉండాలి.. కానీ ఆ లోగోలో 6×6 గుడులుగా చూపించడం చాలా తప్పు. ప్రేక్షకులు చెస్‌ను ఆటగా చూసేలా ఉండాలి. కానీ, రాత్రులు చూసే టీవీ కార్యక్రమాలుగా చేయకండి’’ అని అన్నారు. ఈ లోగోపై సోషల్ మీడియాలో ఇప్పటికే విమర్శలు షికారు చేస్తున్నాయి. అయినా సరే, తాము వెనక్కి తగ్గేది లేదని లోగోతోనే పోటీలు జరుగుతాయని టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేశారు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com