Home > Crime > బూతులు రాస్తే…ఇక కేసులే

బూతులు రాస్తే…ఇక కేసులే

నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

cybercrime-rammohanrao-apduniaసినీ ప్రముఖుల ఫోటోలని మార్ఫింగ్ చేసి, తమపై ఇష్టం వచ్చినట్టుగా బూతు రాతలు రాస్తూ తమ పరువు ప్రతిష్టలని దెబ్బతీసున్న పలు వెబ్‌సైట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయా సైట్ల నిర్వాహకులపై చర్యలు చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టంచేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహన్.. సైబర్ క్రైమ్ గురించి సినిమా వాళ్లే కాకుండా బాధితులు ఎవ్వరు ముందుకొచ్చి ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రముఖులపై బూతు రాతలు రాస్తే, రాసినవారితోపాటు సదరు వెబ్‌సైట్ల నిర్వాహకులపై సైతం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వెబ్‌సైట్ అడ్మిన్స్ విదేశాల్లో వున్నా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *