Home > Health > నూడిల్స్… ప్రమాదమే

నూడిల్స్… ప్రమాదమే

బ్రోకోలీని తీసుకుంటే...
కీళ్ల నొప్పుల పాలిట వరం

noodles-apduniaఅధిక బరువు సమస్యతో బాధపడే వారు నూడుల్స్ అస్సలు తినకూడదు. తింటే బరువు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ అస్సలు ఉండదు. నూడుల్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితా కిందకు వస్తాయి. కనుక వీటిని తింటే ఫైబర్ ఏ మాత్రం అందకపోగా వీటివల్ల మన శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. అది కొవ్వుగా మారి అధిక బరువుకు కారణమవుతుంది.నూడుల్స్ రెగ్యులర్‌గా తినే వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వస్తే శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయలేదు. జీవక్రియలు మందగిస్తాయి. ఫలితంగా థైరాయిడ్ గ్రంథుల పనితీరుపై ప్రభావం పడుతుంది. బరువు పెరుగుతారు.

నూడుల్స్‌ను మైదాతో తయారు చేస్తారు. అందువల్ల ఎలాంటి పోషకాలు ఉండవు. కనుక ఇది జంక్ ఫుడ్డే అవుతుంది. దీంతో నూడుల్స్ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగవు. ఒక వ్యర్థ పదార్థాన్ని తిన్నట్టే అవుతుంది.నూడుల్స్‌లో మన శరీరానికి చెడు చేసే కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బులను తెచ్చి పెడుతాయి.నూడుల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి అధిక మోతాదులో చేరితే ఫలితంగా బీపీ, తలనొప్పి, వికారం, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయి.నూడుల్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అది ఒంట్లో అధికంగా నీరు చేరేందుకు కారణమవుతుంది. దీంతో పాదాలు, చేతులు ఉబ్బినట్టు వాపులు వస్తాయి.నూడుల్స్ తిని ఇతర ఆహారాలు తింటే వాటిల్లో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా నూడుల్స్ అడ్డుకుంటాయి. దీంతో పోషకాహార లోపం వస్తుంది.గర్భిణీలు నూడుల్స్ అస్సలు తినకూడదు. తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.అందువల్ల గ్రామీణ ఆర్థిక రంగంలో మౌలిక మార్పులు తేవడం, గ్రామీణ మహిళల సాధికారతకు మార్గాలు ఏర్పరుచడం తక్షణ అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *