Home > Bhakti > ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు

జన్మ నక్షత్రం రోజునే కేసీఆర్ దుర్గమ్మకు ముక్కుపుడక
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మావారు

durga-devi-vijayawada-apduniaఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి అవతారాల క్రమణికలో బాలాత్రిపుర సుందరి తొలి అవతారం. బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు ఇవాళ దర్శనమివ్వనున్నారు. త్రిమూర్తుల స్వరూపమే అమ్మవారు. బాలాత్రిపుర సుందరి ఉపాసనపరులు అరుదుగా ఉంటారు. బాలా మంత్రాన్ని ఉపదేశం పొందిన వారు మాత్రమే శ్రీచక్రార్చనకు అర్హులవుతారు. బాలా త్రిపుర సుందరిని కొలిచిన తర్వాతే మిగతా దేవతా మూర్తుల అర్చన చేయాలన్న సంప్రదాయం కూడా ఉంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వృద్ధులు, వికాలాంగులు కొండపైకి వెళ్లేందుకు ఉచిత బస్సులు నడుస్తున్నాయి. 8 చోట్ల ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అర్జునవీధిలో లడ్డూప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో లడ్డూప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *