Home > Editorial > వధ.. గాధ!

వధ.. గాధ!

ఉన్నత పదవికి సమ్మున్నతులు
ఈ-ముందులెట్లగ...
 
cows_apduniaవిజయనగరం జిల్లా కేంద్రంలో అక్రమంగా కొనసాగుతున్న పశు కబేళాల నిర్వహణపై అధికారులు చేపడుతున్న చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. కంటోన్మెంట్ లో కొనసాగుతున్న కేబేళాపై ఎప్పటి నుంచో వివాదాలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా అధికారులు హడావిడి చేయడం మినహా చర్యలు మాత్రం తీసుకోలేకపోతున్నారు. కబేళా నిర్వహణ తమ పరిధిలోకి రాదని కొందరు అధికారులు, సోదాలు చేసినా వారిపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని మరికొందరు అధికారులు చేతులెత్తేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో జరిపిన దాడులతో కబేళాను మూసివేశారని అంతా భావించారు. అయితే మళ్లీ తెరిచారని సమాచారం రావడంతో దాడులకు వెళ్ళిన అధికారులు నిర్వాహకులతో మాట్లాడి వెనుదిరిగారు. అధికారులు కబేళాపై దాడులు చేసే సమయంలో 17 ఆవులు, ఒక దూడ అక్కడ కనిపించాయి. వాటిని తమ ఆధీనంలోకి తీసుకొని పురపాలక సంఘం కార్యాలయానికి తరలించారు. చర్మాలు అమ్ముకోవడానికి అనుమతులు ఉన్నాయని, పశు కబేళా నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు నిర్వాహకులకు స్పష్టం చేయగా, అటువంటిదేమి లేదని, కేవలం చర్మాల వ్యాపారం మాత్రమే చేస్తున్నామని నిర్వాహకులు బదులిచ్చారు. పశు కబేళా నిర్వహణపై తదుపరి చర్యల కోసం నివేదికను తయారు చేసిన అధికారులు రాత్రి కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ను కలిసి అందజేశారు. అటునుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తర్వాత ఏం చేయాలో నిర్ణయించడం జరుగుతుందని సంబంధిత అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మొత్తం మీద విజయనగరం కంటోన్మెంట్ లో నిర్వహిస్తున్న ఈ పశు కబేళా వ్యవహారం వివాదస్పదంగా మారడంతో దాని జోలికి వెళ్లేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఎటు నుంచి ఏ సమస్య వచ్చి తమ మెడకి చుట్టుకుంటుందోనన్న భయం అధికారులను వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *