Home > General > ఆధార్ గడువు మళ్లీ పెంచారు

ఆధార్ గడువు మళ్లీ పెంచారు

మరింత తగ్గిన బంగారం
రైళ్లకు ఫుల్ డిమాండ్

deepak-misra-apduniaప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్‌ కార్డులు, ఇతర సేవలకు ఆధార్‌ అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గతంలో ఆధార్‌ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్‌ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుందని పేర్కొంది.ఆధార్‌ పథకాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆధార్‌ నమోదు కార్యక్రమంపై స్టే విధించాలంటూ సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖాన్‌విల్కర్, జస్టిస్‌ చంద్రచూడ్‌ బెంచ్‌ వాదనలు జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదనలు విన్పిస్తూ.. కొన్ని ఏళ్లుగా అమలవుతున్న ఆధార్‌ పథకంపై ఎటువంటి స్టే విధించరాదని, డిసెంబర్‌ 31తో ముగుస్తున్న ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్రం పొడిగించనున్నట్లు కోర్టుకి తెలిపారు. అన్య మతస్తుడిని పెళ్లాడితే మహిళ మతం మారిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్శి మహిళ వేరే మతస్తుడిని వివాహమాడితే ఆమె మత గుర్తింపు మారుతుందా? అన్న కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ‘ ఇతర మతస్తుడిని పెళ్లి చేసుకున్న తరువాత సదరు మహిళ తన పుట్టింటి మతాన్ని కోల్పోతుందని చెప్పే చట్టాలేం లేవు. పైగా ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం…ఇద్దరు దంపతులు తమ సొంత మతాలనే ఆచరించొచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *