Home > Health > డేంజర్ డెంగీ

డేంజర్ డెంగీ

నందిగామ ఆస్పత్రిలో నర్సులే డాక్టర్లు
బరువు తగ్గించడానికి బంగాళ దుంప

dengueనిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు అలముకున్నాయి. గత 15 రోజుల నుంచి వ్యాధి లక్షణాలతో బాధపడుతూ వందల మంది ఆస్పత్రులకు వస్తుండడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. స్థానికంగా జ్వరం, ఇతర లక్షణాలతో కోలుకోకపోవడంతో రాజధానికి సిఫారసు చేస్తున్నారు. అక్కడ రక్తపరీక్షలు చేసి డెంగీ లక్షణాలున్నాయని వెంటనే చికిత్స పొందాలని రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. ఒక రోగికి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాధుల ముప్పు పొంచి ఉన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకేంద్రంలో బతుకమ్మకుంటలో ఆపారిశుద్ధ్యం రాజ్యమేలుతోంది. ఎక్కడికక్కడ మురికి నీటి మడుగులు కనిపిస్తున్నాయి. దోమలు తమ సంతతిని పెంపొందించుకునేందుకు అనువైన కాలం ఇది. కానీ, జిల్లా కేంద్రంలో నియంత్రణ చర్యలు మచ్చుకైనా కానరావడం లేదు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

లక్షకు పైగా జనాభా నివసిస్తున్న బల్దియాకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడం సమస్యను పెంచేస్తోంది. 33 వార్డుల్లో చెత్తను పూర్తిస్థాయిలో తొలగించలేకపోవడం ప్రభావం చూపుతోంది. ప్రధాన ప్రాంతాలు మినహా, కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు ఉండడం లేదని స్థానికులు అంటున్నారు. అధ్వాన పరిస్థితులకు ఖాళీస్థలాలే అందుకు కారణమని గుర్తించినా చర్యలు లేవని చెప్తున్నారు. స్థానికంగా నిత్యం 50 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. 10 ఆటోలు, 8 ట్రాక్టర్లలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో వార్డుల నుంచి చెత్తకుప్పలు తొలగడం లేదు. ఇక ఖాళీ స్థలాల్లో మురికినీటి నిల్వల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. జిల్లాకేంద్రంలో బతుకమ్మకుంట, అశోక్‌నగర్‌, శ్రీరాంనగర్‌, విద్యానగర్‌, గాంధీనగర్‌, అయ్యప్పనగర్‌, రాజీవ్‌నగర్‌, హౌజింగ్‌బోర్డు కాలనీ, ఇందిరానగర్‌, రాజీవ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. ఖాళీస్థలాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఫలితం ఉండడంలేదు. ఇప్పటికైనా సంబంధింత అధికారులు స్పందించి చెత్తను తొలగించి ప్రజారోగ్యానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com